అశ్రుతర్పణం .....................................................శశిబాల (20.march .14 ) బ్రతుకంతా మనం తోడై నీడై వుండాలనుకున్నాము కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు చిన్ని చిన్ని అలకలు .చిరునవ్వుల కొసరింపులు ఏవీ ..అవేవీ ....నీతో పంచుకున్న ఆ అపురూప క్షణాలు నీ నిష్క్రమణం లో అవి మధుర జ్ఞాపకాలై నాలో ( నాతో ) మిగిలి పోయాయి శూన్యమైన గుండె గోడలు నీవులేని అసంపూర్ణ చిత్రాలతో బోసిపోయి మిగిలాయి వినబడటం లేదా నీకు నా గుండె చప్పుళ్ళు ఎద మీద ఎదబెట్టి విన్న తుళ్ళింతల ఊసులు నీతో స్వేచ్చగా ఊహా గగనం లో విహరించిన నా ఆశలు రెక్కలు తెగిన పక్షులై నిస్సత్తువగా ,నిరాశగా మొండి కుడ్యాల (గోడల ) నడుమ .. కర్కశమైన ఏకాంతాన్ని మిగిల్చి వెళ్ళిపోయాయి నిన్నోదిలి నేనుండలేను ..ప్రియబాంధవీ నింగికెగసిన నీ ఆత్మతో నా ఆత్మను మిళితం చేసుకొని తీసుకుపో రా !! రా మరీ !!!! వదిలిన నీ ఊపిరి నన్ను చుట్టుకొని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది రా ప్రియా !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j5D7HJ
Posted by Katta
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1j5D7HJ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి