పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

Chennapragada Vns Sarma కవిత

శర్మ సీహెచ్., ||వెన్నెలరేడు|| ఆకాశవీధిలో ఓ నిండుచందమామ నీతో మాకు బంధుత్వం లేదుసుమా అడుగో మామ..అటుచూడంటూ అమ్మ నిన్ను చూపిస్తేనే చిన్నప్పుడు అన్నంముద్ద తిన్నానట నువ్వు నాకే కాదు.. మా పిల్లలకూ మామవే.. వాళ్లూ నిన్ను చూస్తూనే అన్నం తింటున్నారిప్పుడు చల్లనిరాజా ఓ చందమామ నా మనసు చిరాగ్గా ఉన్నప్పుడు.. అయినవారెవరూ దగ్గరగా లేనప్పుడు డాబాపై పడుకుని నిన్నే చూస్తూ గడుపుతా నీ చల్లని స్పర్శ నను తాకినంత తనువులోని అణువణువూ పులకింత అందుకే వెలుగులు పంచుతున్నావు జగమంత.. \20.3.14\

by Chennapragada Vns Sarma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gJdTLV

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి