మరువం ఉష | ఉనికి -------------------- దగ్ధ వృక్ష శిలాజాలు వజ్రకాంతులుగా విముక్తి పొందుతాయి స్తబ్ద దిగుళ్ళు విడిచి మెరుపుకలలు పలుకరిస్తాయి ఉరిమే మబ్బును చూసి కప్పపిల్ల కిలకిలా నవ్వుతుంది విఘాతాల విధ్వంసం కసిరితే ఆశ ధిలాసాగా విచ్చుతుంది పువ్వు విప్పారినపుడు చిరుగాలి మేను జాజర జడిలో జలదరిస్తుంది మనసు పొంగినపుడు అనుభూతి పరవశంగా పరిమళిస్తుంది భూమ్యాకాశ గతుల్లో, ఋతు సంక్రమణముల తాకిడితో ప్రకృతి నిరంతర ప్రవాహం స్థితిగతుల్లో జీవనం, మౌక్తిక సృజనలో మునిగితేలే సాగరం 19/03/14
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hE3QG7
Posted by Katta
by Usha Rani K
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hE3QG7
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి