Aduri Inna Reddy || నినుకలిసే క్షణం కోసం గొడవపడుతూ గడుపుతున్నా నాతో నేను || --------------------------------------------------------------------------- లిపిని మరిచిన భాష మనసును మరిచిన జ్ఞాపకం నిజాన్ని దాచినా అబద్దం ఎవరికవి నటిస్తూనే ఉన్నాయి అన్ని బ్రమలౌతుంటే .. నమ్మలేని నిజాలు ఎదురుగా వికటాట్ట హాసం చేస్తుంటే నిజాన్ని మరచి నేను అయోమయంగా ఆకాశంకేసి చూస్తుంటే అక్కడ నాకై తెరచిన ద్వారం రమ్మని పిలుస్తుంఅగా మార్గం తెలీని మనసు నెమ్మదిగా జ్ఞాపకాల పొరల్లోకి చూస్తూ పరిశొధన చేస్తుంటే భారమైన బరువు కన్నీటి రూపమైంది. నా మనస్సు నిన్ను గురుతుకు తెస్తుంటే నేను ప్రశంతంగా ఎలా ఉండగలను భారమైన గుండె బరువు మోయలేకపోతుంటే రూపంలేని భావాలు యుధ్ధానికి సిద్ధమవుతుంటే నాలో నాకు జరిగే యుద్దంలో కూడా నేనే ఓడిపోతుంటే . ఇక గెలుపనేది కనుచూపుమేరలో కానరాకుండా నన్ను వేక్కిరిస్తుంటే ఏమని చెప్పను ఎవరికి చెప్పుకోను అసలు నిజాన్ని కలలెన్నో కన్న కళ్ళు కన్నీరన్న నిజం చూసి భయపెట్టే ఊహలనే ప్రేమ లేఖలుగా రాస్తుంటే సునామీలెన్నిటికో చెదరని సంద్రమంటి గుండెకేమో కన్నీటి పిల్లకాలువ దాచుకోని బరువౌతున్న గుండెను ఏమని సర్దిచెప్పుకోను ... ఏమౌతున్నానో అర్దంకాక సగం నువ్వు సగం నేనని భాదలోనూ మరవకున్నా ప్రత్యుత్తరంలేని ప్రశ్నలతో సతమతమై చస్తున్నా పడమటింటికి వెళ్ళమని సూరీడుని తొలిపొద్దునుండే పోరుపెడుతున్నా రోజులకే విసుగుతెచ్చే గంటలతో గంటలకే విసుగుతెచ్చే నిమిషాలతో నిమిషానికి విసుగుతెచ్చే సెకనులతో నినుకలిసే క్షణం కోసం గొడవపడుతూ గడుపుతున్నా నాతో నేను
by Aduri Inna Reddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ODa7ch
Posted by Katta
by Aduri Inna Reddy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/ODa7ch
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి