పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

Babu Koilada కవిత

//కొయిలాడ బాబు// రొట్టె ముక్క రోటీ కపడా ఔర్ మఖాన్ ఈ మూడూ చాలు మనిషి బ్రతకడానికి అని ఎవరో సూక్తులు చెపుతుంటే వినే రోజుల్లో వచ్చిన ఆలోచనల ప్రవాహం మనసు వీధుల్లో సంచరిస్తుంటే అడగకనే అడగమన్నాయి ఎన్నో ప్రశ్నలు నా అంతరంగపు పొరలు సాయీబాబాకి చపాతీని నైవేద్యంగా పెట్టి కోరికలు కోరుతూ చక్కంగా ఆఫీసుకు పోతూ మళ్ళీ దేని కోసం ఆ ప్రయాణం అని ఆలోచించే వేళ ఆ ఆసామికి నెలవారీ వచ్చే జీతం రాళ్ళతో పాటూ ఇంకేదో ఆశ మనసు చంపుకుని ఏదో ఉద్యోగం వచ్చేదాకా మార్కెటింగ్ చేస్తున్న ఆ సగటు ఎగ్జిక్యూటివ్ కి ప్రతి మధ్యాన్నం ఏ పరోటానో, చపాతీనో గతి రోజంతా బలాదూర్ తిరిగి ఏ అపరాత్రో హాస్టల్ కి వచ్చే వెర్రినాగన్నలు కాలే కడుపుకి బ్రెడ్డు అండ్ జాం తో కుస్తీ పడాలేమో రొట్టేముక్క మరో కొత్త రూపం కోసం కసరత్తు చేస్తుంది కొత్త కొత్త టెక్కులు హైటెక్కులతో మారకనే మారిపోయింది సాఫ్ట్ వేర్ అమ్మాయి పిజ్జాహట్ లో బర్గర్ తింటుంటే బయట మార్వాడి సోదరుడు పావ్ బాజి వండే ఎన్నో షెహర్లలో రొట్టెముక్క తన ప్రాధాన్యతను తను సంతరించుకుంది అయినా ఆ రొట్టె విరిగి ఇంకా నేతిలో పడలేదు రొట్టె రొట్టె గానే ఉంది మనుష్యులు సైతం మనుష్యులుగా గుర్తించక వెలివేసాక రోడ్డు పై పడుతున్న అభాగ్యులు,ఆపన్నులు చేయి చాచి తిండికై దేహీ అని అడుక్కుంటున్న సందర్భంలో ఆ రొట్టె విలువ వెయ్యి రెట్లు పెరిగి అక్షయపాత్రే అవ్వాలేమొ ఆ సమయాన ఈ అల్పసమాజంలో (చర్లపల్లి బాయ్స్ హాస్టల్లో ఉన్నప్పుడు ఓ అపరాత్రి దిక్కూ మొక్కూ లేని ఒక ముసలావిడ వచ్చి కాస్తా తిండి పెట్టమని, ఆకలికి తాళలేకున్నానని,వార్డెన్ ని ప్రాధేయ పడిన సందర్భం గుర్తుకు వచ్చి) 20.03.2014

by Babu Koilada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hHJZFM

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి