పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

Gubbala Srinivas కవిత

గుబ్బల శ్రీనివాస్ ----।। వీధి దీపం ।।--- చుట్టూరా జన సంచారమున్నా ఏకాకి జనజీవన స్రవంతికి వెలుగురేఖ జన వనానికి అమావాస్య చీకట్లు పారద్రోలి పున్నమి కిరణాల ప్రసరణి . విధిలేని బ్రతుకుల్ని వీపున మోసే ఆపద్భాంధవి విలువైన భవిష్యత్తుల మార్గగామి . వెలిగే చిరువెలుగు వేల కళ్ళు మెరిసేలా గ్రామ గ్రామాన్ని దిక్కు కాచే దివిటీలా . ఆకాశ మెరుపుల తళుకుల మిలమిల అవని అందాల జిలుగుల కళకళ నీవిచ్చిందే కదా ఈ వెన్నెల . కొంత కాంతి ముద్దను దాచుకున్న వైనం కోవెలలో ద్వజస్థంభంలా జనుల ముంగిట వెలిగే వీధి దీపం తరాలు మారినా ఆరిపోని నిత్యదీపం తనువే వెలిగే త్యాగదీపం ! 20-032014

by Gubbala Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lS43YT

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి