పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

Narayana Sharma Mallavajjala కవిత

ఆవరణం ___________________ మాట్లాడుకోవడానికి చీకటికంటే సత్యవాక్యం ఏముంటుంది ఆ ఒడ్డున అంతపొడుగునా సత్తువగా నడవడానికి వ్యూహాలేర్పరుస్తాం గాని. నడకని భయపెడుతున్న నిశ్శబ్దం వెనుక ఎంత చీకటి ఉందో చిక్కిన కాస్త వెలుతురుని నమ్ముకుని అడుగుల్ని కదుపుతాం కాని వెనకే నడుస్తూ చీకటి కప్పేస్తుంది కప్పల బెకబెకైనా..చిమ్మెటల కేకలైనా కీరవాణి సంగీతాన్నించిగాక రాత్రిరక్తం నుంచి అనుభవించగలమా ? పిచ్చిగానీ.. లైటార్పసి చీకటంటే ఎలా.? చుట్టుతా ప్రపంచమంతా ఏళ్లుగా చీకట్లోనే ఏడుపంతా తడిస్పర్శగా అనుభవంలోకి వచ్చిందిక్కడే ఎన్నాళ్లని భరించలేని వెలుక్కింద నలిగిపోతాం నిన్ను నువ్వు చిదిమేసుకుని వచ్చేయ్ ఏ వెలుక్కీ చీకటిని చూసే ధైర్యం లేదు.

by Narayana Sharma Mallavajjala



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hE3Q8Z

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి