పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

Sahir Bharathi కవిత

| ఒక ప్రయాణం ........................................ స్నేహితురాలిగా దగ్గరయ్యావు నాకు తెలియని ప్రపంచం ఉందని నీ అడుగులతో దాన్ని పరిచయం చేసావు నేను ఇంకో ఆత్మకు దగ్గరైనా ఆకాశమంత బాధని నీ గుండెలో కప్పేశావు ఒకరోజున నీ అడుగులలో అడుగులువేసి భూమిపైనే కాదు,జీవితంలో నడిచేలా చేసావు ఆకర్షణకి నా ఆలోచనలకి విభిన్నంగా ప్రేమ ఉంటుందని తెలియజేశావు అమ్మచేతి వంటనే మధురమనుకున్న నాకు నీ చేతితో ఆకలిని తీర్చావు కులమతాలు వేరైనా ,సరిహద్దులు మింగి నన్ను నీవాడిలా చూసావు నా ప్రతి శ్వాసకీ నువ్వు ఊపిరి తీసుకున్నావు ఇక,నీ బాటలో నా అడుగులకి స్థానం లేదని ఎగిరిపోయావు జీవితంలో ఏదో ఒక బాటలో మరల మన అడుగులు కలిసి ప్రయాణం చేస్తాయని ఎదురుచూస్తు…………………………sahir bharati.

by Sahir Bharathi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iipodb

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి