పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

20, మార్చి 2014, గురువారం

Padma Sreeram కవిత

నటభూషణుడికి..... నా..... అశ్రునివాళి || Padma Sreeram|| అనంతమైన ఆకాశం నల్లని దుప్పటినే కప్పుకొంది నువ్వు చూడని హోలీ రంగులు తనకూ వలదనుకొందేమో....... వసంతం రాబోతోందన్న ఆనందం కోకిల చూపకుంది నీ స్వరమిక లేదని తన రాగాలని మూగగా మలచుకొందేమో...... మల్లెపూలు పరిమళాన్ని మరచి రిక్తంగా వికశిస్తూనే ఉన్నాయి... దిగంతాలు చేరిపోయిన నీ నవ్వుల పూలు తలచుకొనేమో........ ఉగాది రాకున్నా వేపపూలు నేలరాలి వెతుకుతూనే ఉన్నాయి నువ్వు ఏ అణువులోనైనా తిరిగి పుట్టావేమో అనేమో....... అందమైన ప్రకృతి తనను తాను మరచి విలపిస్తోంది తన అందానికి దీటుగా నిలిచిన నటభూషణం అవని దాటిందనేమో.... గోదావరి సైతం తన పరవళ్ళు మరచి నిస్తేజ అయింది..... రాజమహేంద్రానికి ఎన్ని ప్రత్యేకతలున్నా నువ్వు లేని లోటు తెలిసినందుకేమో....... ఇన్నీ ఇన్ని త్యాగాలు చేస్తున్నా , నువ్వీ అవని విడిచి ఏడాదైనా నా కనుల తోటలు మాత్రం నిరంతర పుష్పాలను స్రవిస్తూనే ఉన్నాయి నా మది తన గానాలు మరచి శిలగా మారి పలకకుంది హుస్సేన్ సాగర్ లో నిలిచిన చెదరని సిద్ధార్థునిలా నియంతలాంటి విధి నిశీధివైపు నడిచిపోతూనే ఉంది తన కర్తవ్యం ముందు కళాకారులైనా , కలలకారులైనా బద్ధులే అని...... (తన భవిష్యత్తును తానే నిర్వచించుకోగల నిబద్ధత కలిగిన శోభన్ బాబు వర్థంతి సందర్బంగా , ఎంతటివారినైనా తన ఇంటికి అతిథిని చేసి తీసుకొని పోయే కరాళమృత్యువు కఠిన హృదయం తలచి అశేష అభిమానులందరి తరఫున నటభూషణుడికి నా..... అశ్రునివాళి) 20March2014

by Padma Sreeram



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1g4tiH9

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి