చెట్టు అక్కడో చెట్టుండేది అచ్చం మా అమ్మలా ఉండేది అచ్చం మా అమ్మలాంటి గుండే తనదీ నన్ను ఎత్తుకునేది ఆడించేది తినిపించేది లాలిపాట పాడేది నిద్రపుచ్చేది తెల్లారి లేచేసరికి తను లేదు మా అమ్మ లాంటి అమ్మ అందరికీ అమ్మ లాంటి అమ్మ లేదు అసలు తను అక్కడ ఉన్నట్టుగా జాడే లేదు అక్కడ శూన్యం నన్ను చూస్తూ నేను శూన్యంలోకి చూస్తూ అమృతంలాంటి ఆ అమ్మ గుండె మీద పడి గుండె ఆవిసేలా ఏడుద్దామంటే తన శవమే లేదు అక్కాడక్కడా ముక్కలై కనిపిస్తున్న ఆమె ఆనవాళ్లని ఎత్తుకుంటూ ఏడుస్తూ శ్మశానంలో నుండి శ్మశానంలోకి నేను ఒక అనాధలా ! © జాస్తి రామకృష్ణ చౌదరి 02.02.2014@8.18AM
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LC7bLS
Posted by Katta
by R K Chowdary Jasti
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LC7bLS
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి