రమేష్ పమ్మి ||నాకెప్పటికీ సమాధే|| ఒకప్పుడు అల్లంత దూరాన అందంగా అగుపించేటిది మా అమ్మ ఆమే అమ్మన్న విషయం.. మా రావక్క సెప్పేదాకా నాకూ తెనీదు ఆయమ్మ నను కంటే.. కాకమ్మ ఈడ పడేసినాదట నాకంటే పెద్దది కనుక రావక్కకు ఇదంతా తెలుసు అక్క సెప్పగానే... అమ్మా అని పిలుద్దామనుకున్నా.. కానీ ఏడ్వాలిసొచ్చింది అయ్యాలే మా అమ్మను సంపేశారు.. గండ్ర గొడ్డలతో, రంపపు కోతలతో పాశవికంగా నరికి సంపేశారు.. కొన్నాళ్లకు ఆడో.. పెద్ద సమాధి కూడా కడుతుంటే.. అమ్మకు పూజలు సేత్తారనుకున్నా ఏం సిత్రమో కానీ ఆ సమాధిపైనే చానామంది కాపురమెట్టారు. గుబురుగున్న చెట్ల మీద దెయ్యాలుంటాయని అక్క సెప్పేటిది ఆ మాను సమాధి మీద కూడా దెయ్యాలుంటాయని అయ్యాలే నాకర్థమైంది ఆ దెయ్యాలకది నివాసమేమో.. నాకెప్పటికీ సమాధే వాళ్లేమో కాలనీలంటారు నేను శ్మశానం అంటాను 02-02-14
by Ramesh Pammy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bPoeR2
Posted by Katta
by Ramesh Pammy
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bPoeR2
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి