పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
మరువం ఉష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మరువం ఉష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఫిబ్రవరి 2014, గురువారం

మరువం ఉష కవిత

మరువం ఉష | శతకాలు వల్లెవేయించి, పద్యాలు బట్టీపట్టించి --------------------------------------------------------- చదువే లోకంగా చదివించిన ఘనవిద్యలెల్లా… తిరగరాసి మరోమారు మననం చేయించె నిత్యజీవితం వైద్యునికొరకు అప్పిచ్చువాడిని వెదికాను అప్పుతీర్చలేక వూర్లు పట్టి ఏర్లు దాటి పరుగిడాను మేడిపండు సమాజం పొట్టవిప్ప లోటుపాట్ల పురుగులు లోపమెంచి చిచ్చుపెట్ట లోకులే పలుగాకులని కన్నాను శతకాలు శతకోటి నేర్చి నీతిచంద్రికలు ప్రీతిగా వినుకుని పన్నాగాలు పన్నేటి గోముఖవ్యాఘ్రాలను చూసి భీతిల్లాను తల్లితండ్రులందు దయలేని పుత్రులు దేశప్రగతికి వారసులు తోబుట్టువుల మోసగించు దగాకోర్లు దండనాథులు సదా ఈ తారుమారుల్లో సతమతమైన నా మానసం తెలుసుకున్నదొక్కటే పాఠం - జీవితమే గురువు జీవించను నేర్పగ వినరా అని నేనెవరినీ అడుగను, కనరా అని చాటి చెప్పను నేర్వని పాఠాలు సాధనచేయ మనిషికో తీరుగ మారును 02/12/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gwfUJ0

Posted by Katta

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

మరువం ఉష కవిత

మరువం ఉష | హోరు --------------------- స్థల కాలాల్లో దూరంగానైనా సమాంతర ప్రపంచమేదో ఉండే ఉంటుంది. అద్దంలో చందమామతో ఆగని రాముడు, మేఘాల పీచుమిఠాయి కావాలని మారాములు చేస్తుంటే, శాస్త్రజ్ఞుడొకడు శుక్రగ్రహపు ధూళిని నిశితంగా పరికిస్తున్నాడు. చందమామ విచ్చి నవ్విన క్షణాల్లో మరెక్కడో పగటినిద్ర మనసు పలక మీద తీరని కలని తిరిగి దిద్దుకుంటుంది. ఇరుకు నగరాల్లో చినుకుల నేల సాంగత్యం లేని ఒంటరివాన విసుగ్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లోకి ఇంకిపోతుంటే ఆవలి పక్కన కొండ అంచున నది, ఎగువ ప్రవాహమై శిఖరాన్ని చేరలేక, విరహాన ఆవిరై, చినుకై సాయుజ్యం పొందుతుంది. సృష్ట్యాది నుంచి రాధాకృష్ణుల రసవంత గాథ అనురాగ జలధి. నల్లకలువ కళ్ళలో చెంగల్వమాల మెరుపు. ఇదిగో ఓ జంట హృదయాల వేణుగానం — ఆమె పీల్చిన గాలి కణం ఊపిరితిత్తులలో రసాయనిక చర్య పొంది మళ్ళీ ఎప్పటికో మరలా అతని ఊపిరితిత్తుల్లో జొరబడే క్షణాలుంటాయా? ఉంటే, అవి అతనికి తెలుస్తాయా? అతను చూసిన నక్షత్రాన్నే, అతను చూసిన క్షణంలోనే, ఆమె చూస్తుందా? అలా జరిగితే దానికి మినుకుమినుకుల్లో ఏమన్నా ద్యుతి పెరుగుతుందా? ప్రేమ బారిన పడ్డవాళ్లింతే. ఆమె కౌగిట ఆతని గుస గుస "విశ్వమొకటి వుధ్భవించిన క్షణాన మనతో ప్రచోదితమవుతున్నాయనుకున్న మానవ లక్షణాలు.... అనురాగం, విరహం వంటి వున్నతానందాలను ప్రేరేపించగల భావ పరంపర మొదలయ్యాయి, ఆ భావాలతోటే నీ వునికీ ఆరంభమయ్యిందేమో అందుకే ఆది నుంచి నువ్వు నాకు ఎరుకే. నన్ను నాకు మిగలనీయని ఈ అనుభూతికి పదే పదే కారణమయ్యే నువ్వు నా జీవితానికి వరం" – రాధామాధవీయం. అక్కడో తరం క్రౌంచ వారసత్వ శాపభారాన్ని వేదనతో మోస్తుంది. సమకూరని మిథున భాగ్యం అందని ద్రాక్షలా ఊరిస్తుంటే అర్థవృత్తంలా అంతా బయటికికనపడిపోతూ, తమని తాము కప్పుకోలేక, విప్పుకోలేక, కాపు లేని అనాథ గాయంలా ముసిరే ఈగల బారిన పడుతుంది. నిన్నటి మొన్నటి చిన్నతనాల కుట్టిన పున్నాగ పూల జడల వాసన ఇంకా పూర్తి గా మనసు లో నిండనే లేదు, విరబుసే కాలాలకు కాలాతీతమయ్యిందని కబురొచ్చింది. నిరుడు కురిసిన కన్నీటి సముద్రాల ఉప్పెన పోటు ఉధృతి ఇంకా తగ్గనే లేదు, మేట వేసిన దిగులు దిబ్బల మధ్య గా రాత్రి కురిసిన వెన్నెల మరక మెరుస్తూ గూడు నుంచి జారిన చిన్నారి చిలుక కళ్ళలో మెరుపులు నింపుతోంది. ఆనంద విషాద రహిత స్వర్గ సీమల్లో అప్సర కాంతలు నాట్యమాడుతున్నారు. 'ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధం లో నిదురించు జహాపనా. నిదురించు జహాపనా.. ' — ఈ కల్పనలకు, యమున రాగాలకు అసలు అర్ధం తెలిపే బేగం యే గానాలు ఆలపించిందో? వైభవాల నడుమ అపూర్వ ఆదరణ పొందిందో,ఆదరణలోనే రగిలే నిరాశల చెరసాలలో మునిగిందో. స్వయంప్రకాశకమైన మణిపూస నవ్వుతో వెలిగిందో, ప్రాణం లేని రాళ్ళ మధ్య ఒక పాషాణమై తళ తళ లు మెరిపించిందో. ఏమో ఆమె మనస్సులో ఎన్ని అగ్ని పర్వతాలే రగిలేయో, అందమే ఆలంబనగా అదే జీవనాధారంగా ఆనందపడుతూ బతికేసిందో. వాకిట ముగ్గుతో ఇంటి శోభని వెళ్ళడించే గృహమొకటి ఊసుల పూసల పల్లకిలో మమతని మోస్తూ ఉంది. ఆలుమగలు — మగని బుగ్గన మిగిలిన తన కుంకుమ గురుతు చూసి ఫక్కున నవ్వుతూ మల్లియకి అసూయ పుట్టించే మగువకి ఆతని మనసే ధామం. ఆ క్షణమే శాశ్వతం. జ్ఞాపకార్దదశ అక్కడ జనించదు. ఈ హోరు ఏమిటి. ఈ అంతర్ముఖ బాహ్యస్పృహల ఆర్బాటం – దర్శనాల ఆరాటాల కలబోత ఎందుకు. ప్రాణం లేని ఈ అక్షరాలని మమకారం తో స్వీకరించే ఓ మనసు కోసమేనా? ఊహాప్రపంచాలు రూపమియ్యమని మూగగా అడుగుతున్నాయి. నిజానికి ఇది సంబరమేమో. సంతృప్తనిశ్వాసల్ని విడువగల అవలోకన భాష్యమేమో. తీక్షణమైన హోరు — కావాలి, దహించాలి. అనుభూతి రవ్వల గనిగా బతుకు మారాలి. 02/11/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lsnpUs

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

మరువం ఉష కవిత

మరువం ఉష | హంసగీతి ------------------------ లోయ గోడలు బీటలు పడ్డాయి పైనుండి జారే పిలుపుకి ప్రతిధ్వని కొదవైంది ఏ పిట్ట నోటికూడు విత్తులుగా నేలపాలైందో వేళ్ళాడుతున్న వెర్రి చెట్ల జాతరల్లే ఉంది కిక్కిరిసిన వేర్లు గోడ మీద బల్లుల్లా పాకుతున్నాయి వెన్నెల పిల్లలు కొందరక్కడ దాగుడు మూతలాడుతున్నారు చీకటి చేతులకి అందకుండా పరుగులు తీస్తున్నారు గుట్టుచప్పుడు కాకుండా ఆవాసం ఉన్న సరస్సు లోయలో అలలు ఉగ్గబట్టుకుని ఉంది ఇన్నాళ్ళకి హంస గీతి ఒకటి పైకి ఎగిసింది ఉలికిపడ్డ సరస్సులో వెన్నెల ఊయలూగింది చెదిరిపడ్డ ఆకుల పక్క మీద చిందిన చివరి కూత ఏనాటి అనుబంధం కొరకు ఎదురుచూపు సాగుతుందో మరణాన్ని సైతం పారద్రోలుతూ మిన్నంటిన చరమ గీతం హర్షోన్మత్త విషాదమే రాగంగా కట్టిన ఆ బాణీలో సంద్రాలు సైతం కంటనీరు పెడుతున్నాయి (Cygnus olor,Swan Song ని గూర్చి చదివినపుడు ఎపుడు నిగూఢంగా దాగిందో ఈ ఊహ, అక్షరాలలో నిదురలేచిందిలా!) 06/02/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e6lNJC

Posted by Katta

మరువం ఉష కవిత

మరువం ఉష | శుక్రవారం Forough Farrokhzad Farsi కవితానువాదం సందడిలేని శుక్రవారం బావురుమంటున్న శుక్రవారం ఇరుకైన పాతసందుల్లా వ్యాకులపెట్టే శుక్రవారం నలతపడ్డ సోమరి తలపుల శుక్రవారం చీదరపెట్టే వంకరటింకర కొనసాగింపుల శుక్రవారం అపేక్షించని శుక్రవారం అణకువ కలిగిన శుక్రవారం ఖాళీ గృహం ఏకాంతగృహం పడుచుదనపు తాకిడికి తాళం పెట్టిన ఇల్లు సూర్యుని కల్పనలు, చీకట్లు ఒదిగిన ఇల్లు ఒంటరితనం, శకునం, డోలాయమానాల లోగిలి తెరలు, పుస్తకాలు, బీరువాలు, పఠాల లోగిలి అహ్, నా జీవితమెలా నిశ్శబ్దంగా, నిర్మలంగా సాగుతుంది, లోతుగా పారే ప్రవాహంలా అటువంటి పాడుబెట్టిన నిశ్శబ్ద శుక్రవారాల ఆత్మగుండా అటువంటి ఉత్సాహరహిత ఖాళీ గృహపు హృదయంగుండా అహ్, నా జీవితమెలా నిశ్శబ్దంగా, నిర్మలంగా సాగుతుంది Friday | originally translated from Farsi to English by Ahmad Karimi-Hakkak Quiet Friday deserted Friday Friday saddening like old alleys Friday of lazy ailing thoughts Friday of noisome sinuous stretches Friday of no anticipation Friday of submission. Empty house lonesome house house locked against the onslaught of youth house of darkness and fantasies of the sun house of loneliness, augury and indecision house of curtains, books, cupboards, picture. Ah, how my life flowed silent and serene like a deep-running stream through the heart of such silent, deserted Fridays through the heart of such empty cheerless houses ah, how my life flowed silent and serene. ఈమె నాకు చాలా నచ్చే కవి (కవయిత్రి అనటం నాకు నచ్చదు కనుక). ఎక్కడో గుండెల్లో ఒక నాడి, నాళం ఆమెది నాదీ ఒకటేననిపించేంత సామ్యం ఉంది మాకు. 07/02/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MzlEZ6

Posted by Katta

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

మరువం ఉష కవిత

మరువం ఉష | తోడై వస్తావా సహోద్యోగి గా? ------------------------------------------ "కవిత్వం అంటే?" నాకు నేనే వేసుకున్న ప్రశ్నని మోసుకుంటూనే, పదిలంగా నా 'కవితాసంకలనం' ఒకటి నీకు పోస్టులో పంపుదామని... "Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?" నిర్లిప్తం గా సమాధానం కొరకు వేచిన చెవులతో ఇన్నేళ్ళగా ఎన్నో-నవ్వు అద్దకాలతో- ముతకబారిన ముఖాలు, ఉద్యోగాలు: డాలర్లలో/డాలర్ల కోసం, ఇంద్రియాలు వేలం వేసుకుని క్రిమి ఇబ్బంది గా కదులుతోంది లోలోపల: గూటి గోడలు ఎక్కుతూ జారిపడుతూ, గుండెజిగటలో కూరుకుపోతూ పగిలిపోగల ఆ ఒక్క గుండె చేజార్చుకున్నాను, అక్కరలేని జవాబు నీరుగారిన ఆశలు, ప్రణాలికలు మనసులో- దేహం లోపలా వెలుపలా ప్రవహిస్తున్న చీమూ నెత్తురు బతుకుని ఒరుసుకుని సాగే లజ్జా, బిడియాలు - ఏ జలతత్వం తెలపాలి? నువ్వు, నేను, తను నిజానికి ఈ మర్త్యలోకం, కదిలే జీవం ఏదో ఒకనాటికి Perishable మరణ సంహిత ఇదే/ను/గా/!? విపత్తు ని పొట్లాల్లో చుట్టి విసిరేయగలిగితే, విశ్వం పట్టటానికి అంతే లోతైన గొయ్యి తవ్వాలి, ఇదే, ఈ నానాజాతులకి నాబోటి జీవి తలపెట్టగల Potentially Hazardous యోచన "Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?" మళ్ళీ అదే నవ్వుతో, విసుగు ధ్వనిస్తూ అదే ప్రశ్న- తెప్పరిల్లాను కానీ, I grinned back, sort of smiled... చెప్పగల/అంగీకరించబడే మాట మెత్తగా అప్పజెప్పి కొత్త సమాధానం కొరకు వెదుకులాట ఈమారు నాలోని నాకు నేను వేసుకున్న ఇంకొక ప్రశ్న పువ్వుల్లో ఏదో ఉంటుంది, పసిపాప నవ్వల్లే - ఏమిటది? పసిపాప కన్నుల్లో దాగి ఉంటుంది వెన్నెలల్లే సున్నితం గా, లేతగా- లేత గాలిలో, నీరెండలో కోమలత్వం ఉన్నట్లే అవన్నీ fragile beings, ఖచ్చితం గా విలువైనవీను కాలం ఎంత చిక్కగా ప్రవహిస్తుంది, ఎన్నిటిని దాటుకుని ఎడతెరిపిలేకుండా... ప్రశ్న వెనుక ముసురుతూ ఇంకొన్ని మరికొన్ని ఇంకెన్నో! అశాశ్వతం కి నిర్వచనం: ఏది? ఇదొక్కటీ శాశ్వతం గా దొరికితే బావుణ్ణు కలవటం, విడిపోవటం, పోగొట్టుకోవటం, నిరీక్షించటం నిరంతరం దేనికొరకో నశించిపోయే ఉద్వేగాలు ఊరించే విష ఫలాలు, ఆ ఒక్క బలహీనతనీ బలం గా చేధిస్తే - ఆకాశం దాచుకున్న nonperishable, సముద్రం పొదివిపట్టిన perpetual శాంతి నిత్య సత్యమై పోదూ!? యంత్రాలు, యాంత్రిక వైనాలు, ప్రాపంచిక పోకడలు వీటికన్నా Potentially Hazardous వస్తువులేవి సముదాయాలు, సమూహాలు గా అవే బండశిలలు- మర మనిషి గా మారిన నువ్వు, నేను, మనమంతా! ఇకిప్పుడు చెప్పు, నీ నుంచి, నా నుంచి, మనల్ని కాపాడుకునే వృత్తిని చేపడదామా మనమిద్దరం ఈ చిన్ని లోకాన్ని రక్షిద్దామా? "Anything Fragile, Liquid, Perishable, Or Potentially Hazardous?" విశ్వాల తనిఖీ చేస్తూ - సృష్టి కోసమొక తపాలా వ్యవస్థ కనిపెడుతూ - మరణించే వరకు ఓ మహత్తర కార్యం నెరవేరుస్తూ... కవిత్వమంటే జవాబు అవసరం లేని బతుకు సాగిస్తూ- లోలోపల పగుళ్ళ సవ్వళ్ళు వినవస్తున్నాయా? రంగు రంగు రెక్కల సీతాకోకచిలుక నీకు త్రోవ చూపుతూ- 05/02/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jfFzL3

Posted by Katta

5, ఫిబ్రవరి 2014, బుధవారం

మరువం ఉష కవిత

మరువం ఉష | తరుచుగా -------------------------- దేహమే శిలువగా మోసుకుంటూ, లేదా దేహపు గదిలో బందీ అయిన ఆత్మగా విశ్వపు ఒడికై ఆర్తి చెందుతూ విడుదల కొరకై వేచి ఉంటాను గోడల్ని ఒరుసుకు మొలిచిన రావిఆకులు కదులుతాయి, కంటి చూపుని కదుపుతాయి నీటిలో పడ్డ కిరణాల పరావర్తనమో, వక్రీభవనమో మెరుపు నీడలై కనులెదుట నిలుస్తాయి వార్తాహరులు వచ్చిపోతున్నట్లే ఉంటుంది కమ్ముకుని కట్టిపడేసిన భయపు కౌగిలి లో ఊపిరి అందని ఉక్కిరిబిక్కిరి లో దిగంతపు దిశ గా, ఏవేవో ఆనవాళ్ళ వెంట చివరి మజిలీ కి తరలిపోతుంటాను గాలి ఊయలులు సేద తీరుస్తాయి కెరటాల వీవెనలు కుదుటపరుస్తాయి ప్రకృతిలో మనుషులు, మనుషుల్లో ప్రకృతి పలుకరిస్తాయి, గృహానికి చేరిన భావన ఇస్తాయి ఇవన్నీ నిండిన లోకపు వాకిలి లో నిలిచి, కృతజ్ఞతల తోరణాలు కట్టిపోతాను 03/02/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bjTNSS

Posted by Katta

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

మరువం ఉష కవిత

మరువం ఉష | స్తంభించ/లే/ని ఘటనలు --------------------------------------- వాకిలి వద్ద వేచిన నీకు ఎవరూ కనపడరు అభ్యాగతుల స్వరాలు వినవస్తుంటాయి విస్తరిలో ముడిచిన జీవితం గుర్తుకొస్తుంది ఆస్వాదించని రుచుల జాడలే ఆ సవ్వడులు సమూహాలు చురుగ్గా కదులుతూ ఉంటాయి నిదురించే నీలోకి ఎవరో పయనిస్తారు వాడిపోయిన చిత్రాలకు వర్ణాలు అద్దుతారు నిషేధించిన కలల్ని నీవెప్పటికీ అడ్డుకోలేవు ఆలోచనల కుబుసాలు విడుస్తావు నాగరిక పొరలూ విప్పుకుంటావు లజ్జాభారపు మూటలు విసిరేస్తావు ఆశల కొలనులో నగ్నంగా విహరిస్తావు మెత్తగా ఆవరించే మెలుకువనీ ఆపలేవు ఇప్పుడు మరింతగా ముడుచుకుంటావు లోగిలి ద్వారాలన్నీ మూసివేస్తావు వాస్తవాధీన రేఖ వద్ద చొరబాటుకీ ప్రయత్నిస్తావు నిదురలో, కలలో, జాగృతిలో, వేదనలో నీ ప్రపంచం నీకెపుడూ ఒక రంగశాల నీవెరుగని నిన్ను నువ్వు ఆవిష్కరిస్తావు లేదా, అవతరించే మరో నిన్ను చూస్తుంటావు * అభ్యాగతుడు : భోజనమప్పుడు వచ్చిన అతిథి 01/02/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nBWvLR

Posted by Katta

1, ఫిబ్రవరి 2014, శనివారం

మరువం ఉష కవిత

Sneha | One Step Closer ---------------------------- Shots heard ‘til the back of the line. Ten shots, ten more, The line is shortening. Step-by-step I approach death. His arms wide open, Accepting. Memories flashed past, Family, mother, father, brother, I will meet you soon. Reality snaps back, Three sets left, now two, One. I step, Others step forward from behind What thoughts have they? It’s their last. Time has come, Fear is not what I have. Goodbye Hell, Hello Family. /**************************** రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ జర్మనీలు తాము దండయాత్ర చేసి స్వాధీనం చేసుకొన్న అనేక యూరోపియన్ దేశాల్లోని యూదు మతస్థులని పట్టి బంధించి గేస్ చాంబర్లలో చంపేసారు. స్నేహ నా పాప. పోయినేడు 12సం. పాయంలో హోలోకాస్ట్- అంటే అగ్ని, గేస్‌లని ఉపయోగించి అధిక సంఖ్యులని చంపడం- ద్వారా మరణం పాలైన ఒక బాలిక చివరి క్షణాల మానసిక స్థితి ని ఊహిస్తూ రాసిన కవిత ఇది. ఈ మధ్యన వింటున్న అనేకానేక యుధ్ధబీభత్సాలు మరే మనసుని కలచివేస్తున్నాయి. విశ్వశాంతి కి ఏదైనా సంభవిస్తే బావుణ్ణు. *****************************/ మరువం ఉష | ఒక అడుగు చేరువగా ------------------------------------ వరుస చివరికంటా గుళ్ళమోత వినవచ్చింది పది తూటాలు, మరొక పది వరుస తరిగిపోతూ ఉంది అడుగు వెంట అడుగు వేస్తూ నేను మృత్యువుని సమీపిస్తున్నాను వెడల్పుగా సాచివున్న అతని చేతులు సమ్మతినిస్తున్నాయి గతస్మృతులు వెలిగాయి కుటుంబం, అమ్మ, నాన్న, సోదరుడు మిమ్మల్ని నేను త్వరలోనే కలుసుకుంటాను వాస్తవం చిటెకెవేసి వెనక్కి లాగింది మూడు జట్లు మిగిలాయి, ఇకిప్పుదు రెండు ఒకటి నేను అడుగు వేసాను నా వెనుగ్గా ముందుకు సాగుతూ వాళ్ళు వాళ్ళు ఏ ఆలోచనల్లో ఉన్నారు? అదే వారి చివరి యోచన సమయం ఆసన్నమైంది నా వద్ద ఉన్నది భయం కాదు నరకమా, వీడ్కోలు హలో కుటుంబం. 01/31/2014

by మరువం ఉష



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fiYWwS

Posted by Katta