// జయ రెడ్డి బోడ // వృద్ధ కపోతం // కళ్ళు లేని కబోదిలా ఆ చీకటి గదిలో, గోడపై కరుచుకొని ఉన్న బల్లిలా కదలకుండా ... గాంధీ గారి మూడో కోతిలా చెడు చూడకు అన్నట్టు ముడుచుకొని, అతను వెళ్లి పోతున్నానమ్మా ఆశీర్వదించు అని, ఎవరు ఎందుకు ఏం కావాలి అని పిచ్చి పిచ్చిగా భయం భయంగా ఆమె ... కొనుక్కొచ్చిన "పళ్ళు" చేతిల పెట్టితే వద్దు నాకెందుకు? పిల్లగాండ్లు బడికెళ్ళి వచ్చాక ఇస్తానులే అని ఒడిలో దాచుకుని మొహమాటంగా ఆమె .. పండ్లు కాయలతో, పచ్చని ఆకులతో తులతూగి కొన్ని గింజల్ని ఈ లోకంపైకి చల్లీ.. ఇప్పుడేమో ఆ ఉడిగిన కాయాన్ని చూస్తూ ఉండబట్టలేక గడప దాటిన అతను.. అర్థం కాని సంశయంలో, వెనుదిరిగొస్తే వణుకుతున్న చేతులతో ఆమె, అందిన ద్రాక్షలన్ని నోట్లె కుక్కుకుంటూ ఆదుర్దాగా,గబా గబా దొంగలాగా.. మతి స్థిమితం తప్పించిన పేగుల ఒరిపిడికి కాలిన ఆ తల్లీ క్షుద్భాద అది! గుండెకు గుచ్చుకున్న విఫలమైన మానవత్వపు సెగ అది, ఈ లోకంలో జీవించూ తన బీజ కణముల పై, పండిన దీవన అయి, గువ్వలా ఎగిరి అనంత లోకాలకు , చూసే జాలి గొలుపు కన్నులకు, అది ఓ మరపు రాని గాయం.. పునరావృత్తము అవుతున్న ఆ పీడ కలతో "నిద్రలో ఉలిక్కిపడుతూ మరుగున పడుతున్న మానవ విలువల కోసం ఆవేదనతో ,.. సమాజ గౌరవం మంట గలవకుండా కాపాడి, తమను తాను అంధకారంలోనే అంతమొందించుకునే 'తల్లి తండ్రుల' తలుచుకొని... (02-02-2014... ఆప్యాయతానురాగాలు లేని నాలుగ్గోడల మధ్య, ఈ నాటి వృద్ధాప్యం దైన్య స్థితి )
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1egzX0U
Posted by Katta
by Jaya Reddy Boda
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1egzX0U
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి