నీలాగే ఒకడుండేవాడు -------------------------//-శ్రీనివాసుగద్దపాటి-// నీలాగే ఒకడుండేవాడు అక్షరాలతో ఆడుకుంటూ.... పదాలతో పాడుకుంటూ.. అల్లిబిల్లి కలల్తో..... నక్షత్రవీదుల్లో విహరిస్తూ... అచ్చం నీలాగే నీలాగే ఒకడుండేవాడు పదాలను ప్రేమిస్తూ... వాక్యాలను పరామర్శిస్తూ ఆనందాన్నాస్వాదిస్తూ చిన్ననాటి చిలిపిముచ్చట్లో....! పడుచుదనపు ప్రేమకబుర్లో...! ఎవో.... ఏవేవో..... స్మరిస్తూ... స్పృశిస్తూ... అచ్చం నీలాగే ఒకడుండేవాడు చిర్నవ్వు చెరగని నగుమోముపై అక్షరాల్ని అతికించుకొని వాక్యాల్నివెంటేసుకొని భావాల్ని వొలకబోస్తూ నిత్యం మాహృదయాల్లో.... ఆనందాల్ని పండిస్తూ... నీలాగే అచ్చం నీలాగే ఒకడుండేవాడు (ఎందుకో నందూ కవిత్వం చదివినతర్వాత నాకు రాయాలనిపించిన నాలుగుమాటలు)...02.02.2014
by Srinivasu Gaddapati
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kvTs5x
Posted by Katta
by Srinivasu Gaddapati
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kvTs5x
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి