ఎందుకిలా................ పక్కనే ఉన్నట్టుగానే అనిపిస్తుంది నీ ఊహలను మోసుకొచ్చే ఊపిరి వెచ్చదనం ఆవిరులు ఏ శీతల జలపాతంలో కరిగిపోతున్నాయి ? ఇంటి వెనక ఎప్పటికప్పుడు గుప్పెడు కొత్త పరిమళాలు వెదజల్లే సాయం సంధ్యలూ ఇంటిముందు పోటీ పడి విరబూసి దారంతా పరచుకునే ధవళ కాంతుల ఉదయాలూ ఎందుకలా నీ మొగలిరేకుల స్వరాన్ని మడతలు మడతలుగా లోలోపల పేర్చుకు౦టాయి? నీ సమక్షంలో రెక్కలు తగిలించుకున్న గాలి గుమ్మటం లా దిగంతాలు చుట్టి వచ్చి ఈలవేసే మనసు ఇప్పుడెండుకిలా గంజాయి తిని పడుకున్న కదలలేని చీకటి సముద్రమవుతు౦ది? అలలు అలలుగా తీగలమధ్య ఒరుసుకుంటూ పారే ఆలోచనలు ఇక్కడ ఇలా గడ్డకట్టి పాలిపోయిన మంచుచుక్కలవుతాయి? బంగారపు లాలించే పిలుపు కోసం నదీతీరాలు బెత్తెళ్ళ తో కొలుచుకు౦టూ ఎగిరెగిరిపడే కలల ప్రవాహాల చెమ్మలో తడిసి ముద్దవుతూ ఊహ కరిగి నీరవుతుంది. ఎదురుగా రెప్పవాల్చకుండా నీడల గుంపు
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvTigV
Posted by Katta
by Swatee Sripada
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nvTigV
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి