కూరాకుల వెంకట చలపథి బాబు ||కవితా సాక్షాత్కారం|| అందమైన కవిత రాయాలని కూర్చున్నా... అద్భుతమైన కవితా వస్తువు కోసం ఆలోచిస్తున్నా.. ఏకాంతంలో బాగా వస్తాయని ఎవరో అంటే ఒంటరిగా తోటలో కూర్చోని ఆలోచించా.. ఎండిన ఆకులు రాలాయి కాని.. కవితా వస్తువు దొరకలేదు.. ఇలా కాదని.. గదిని చీకటి చేసి కూర్చోని ఆలోచించా.. మెదడుకు తట్టలేదు.. విద్యుత్ దీపం మీట నొక్కాను దీపం వెలిగింది కాని మస్తిష్కంలో కవితా వస్తువు తట్టలేదు.. లాభం లేదని.. "శ్రీశ్రీ" పుస్తకాలు తిరగేశాను.. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల ఏదైనా కవిత వస్తువే అన్నారు.. నవ రసాలు కలిపిన హృదయభాషే కవిత అని అర్ధం అయింది.. ఇంతలో పెళ్ళుమనే శబ్దం... ఏంటా అని కిటికి తెరిశాను.. ఉరుములు... మెరుపులు.... చిన్న చిన్న చినుకులు... ఆ వెంటనే సూర్యుడు వచ్చాడు.. ఇంతలో అద్భుతం... అల్లంత దూరాన సూర్యకిరణాలు నీటి బిందువులు చేసిన ప్రకృతి అద్భుతం కళ్ళముందు కనువిందు చేసింది.. నా మెదడుకు వెలుగునిచ్చింది.. నా కలం సప్తవర్ణాలను నింపుకుని "హరివిల్లు"లా శోభించి పరుగులు తీసింది.. అద్భుతమైన కవిత నా కనులముందు సాక్షాత్కరించింది.. అప్పుడు అర్ధమైనది... కవితలు సహజత్వపు తీరాల్లో సాక్షాత్కరిస్తాయని.. మనసు పొరల్లో వికసిస్తాయని.. #31-01-2014
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nw8niw
Posted by Katta
by వెంకట చలపతి బాబు కూరాకుల
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nw8niw
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి