నా కవిత జనవరి విహంగ పత్రికలో //ఒక నమూనా కావాలి// భయపడ్డానా ఎప్పుడైనా ఇంతవరకు వెన్నెల్లో ఆడి వానల్లో తడిచి తూనీగలతో ఎగిరి తువ్వాయిలతో గెంతి ఇద్దరం అమ్మలం ఇద్దరం పాపలంగా వున్నంతవరకు ఇప్పుడు భయమౌతుంది పసిబుగ్గల పాల వాసన ఇంకిపోతుంటే ముంజేతి వెన్నెల మలినమౌతుందేమోనని వంటలు చేసే అమ్మని చూసి అది ఆమె జన్మస్థలమని ఐటెం సాంగుల ఆరబోతను చూసి ఆమె అవయవాల కుప్పని సెంటుతో చుట్టు తిప్పుకుంటూ పందాలతో పడగొట్టేస్తుంటే ఆమె విలువలేని సరుకని అనుకుంటాడేమోనని భయమేస్తుంది మగవాడే రాజని దయతో వేసే భిక్షే ప్రేమని వేసినప్పుడు ఆరగించాలని నిరాకరిస్తే నిప్పౌవుతాడని పుక్కిళించే పురాణాలని నిజమనుకుంటాడని భయమౌతుంది ఫ్రేమించే పూజారో శాసించే అధికారో నడిపించే రహదారో కావద్దని ప్రేమిస్తూ స్నేహించే ప్రేమికుడవ్వాలని స్నేహిస్తూ ప్రేమించే స్నేహితుడవ్వాలని కంటున్నా ఒక కలని నేర్పాలనుకుంటున్నా పాఠాన్ని అందుకే చూపాలనుకుంటున్నా నమూనాని శిధిలాలలోనైనా శిఖరాలలోనైనా మ్యూజియంలోనైనా మాజిక్ తోనైనా దయగల ప్రభువులు నమూనా చూపిస్తారా
by Bodapati Haritha Devi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ddJ9Ni
Posted by Katta
by Bodapati Haritha Devi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ddJ9Ni
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి