స్రవంతి ఐతరాజు " హృదయవనం" సౌగంధిక జాజరలు! మాఘమాసం వచ్చింది కదా అని... చాలాకాలం తరువాత నా తోటలో కెళ్ళానా!!! నా రాకకు తమ ఆనందాన్ని తెలుపుతూ.. నా వదనంలా..తెల్ల గులాబీ విచ్చుకుంది కనులనుబోలిన నందివర్ధనాలు మొగ్గతనాన్ని వీడాయ్ పెదాలకు వర్ణాలద్దాలని యెర్రని ముద్దమందారాలు బయలుదేరాయ్ మమ్మల్ని నీ అందమైన పొడవైన సిగలో ముడువమని, గుండు మల్లియలు,మాను సంపెగలూ..పోటీ పడ్డాయ్ నా చీరె రంగును తలదన్నాలని చేమంతులు తెగ ఆరాటపడ్డాయ్ పేరు పేరునా పలుకరించా..ప్రేమను కుమ్మరించా... పువ్వు పువ్వునీ పెదాలకు మెత్తగా హత్తుకున్నా.. కొమ్మ గుబురుల ఆలింగనాలు చేసా.. అనురాగాల నీరాలు త్రాపించా.. పూల సువాసనలతో గుసగుసల ఊసులు చెప్పుకున్నా.. అలా ఎంత సేపు గడిచిందో.. రవి బావ పడమట నుండీ పిలిచాడు! శశి బావ వచ్చి నాకు కన్నుగీటుతాడేమోనని తనకి దిగులు! సరే! బయటపడి ఇల్లు చేరాలని బయలుదేరా.. ఒక్కసారిగా అడుగుసాగలే... నా చెంగును గులాబీ కొమ్మ వొడిసి పట్టింది.. తమాల తీగే వెళ్ళద్దని బ్రతిమలాడుతూ నా బుగ్గల్ని లేతగా, సుతిమెత్తగా తాకింది మెల్లిగా జాజి పందిరి కిందకు చేరానా.. ఇక్కడే సేద తీర మంటూ జాజిమల్లెలు జాతర చెసాయి మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలవని మాలతీ పూల సుగంధాలు బంధీ చేసాయ్ సందె చీకట్లలో దారి చూపుతూ తులసికోటలో దీపం దేదీప్యమానంగా వెలుగుతోంది... వెళ్ళిరామ్మా..అంటూ తులసికొమ్మ దీవించి పంపింది! ఇంతలో శశి బావ రానే వచ్చాడు.వలపుల సరాగాలాడించాడు... తన వెన్నెల చీరెను చుట్టాడు... మంచి ముహుర్తానికి చేరువౌతానంటూ.. తారలను తోడిచ్చి ఇంట్లోదిగబెట్టాడు!
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fyOAdT
Posted by Katta
by Sravanthi Itharaju
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fyOAdT
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి