నెగడు - వాహెద్ కాటుక కంటి నీరు తొణికిందా ఉప్పునీటి సముద్రాలు వెలిశాయి మనిషిని కూడా మట్టితోనే చేశావా నేలపై ఎడారి మొలిచింది చెంపలపై జారి నేలపడిన నిరాశ కొత్తరెక్కలు విచ్చుకుందా గోడలు కొత్తఎత్తులేస్తున్నాయి... ఆకాశరామన్న పేరుతో నేను నాకు రాసుకున్న ఉత్తరం జీవితకాలం లేటు... మనసుకు మనిషికి మధ్య దూరం ఇంత పెరిగిపోయిందా... మిట్టమధ్నాహ్నం ఎండలా కళ్ళపై కమ్ముకుంటున్న ప్రేమ నాలుగక్షరాల మజ్జిగ పుచ్చుకో గుండె సేదదీరుతుంది... దుమ్ము ధూళి తొడుక్కునే చెట్టుగాలి నగ్నంగా నర్తించేదెప్పుడు? కాటుక మబ్బుల్లో ఆశల మెరుపు కురిసేదెప్పుడు? మనసు కాగితాన్ని పడవగా చేసి కంటి వాన నీటిలో నడిపేదెప్పుడు? జాబిల్లి నవ్వితే రాలిన ముత్యాలు చీకటి సెలయేటిలో కొట్టుకుపోతున్నాయి ఇప్పడు వెలుగు కావాలంటే మనసులో మంటపెట్టాలి కోరికల కట్టెలేసి నెగడు రాజేయాలి..
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LCJrar
Posted by Katta
by Abd Wahed
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LCJrar
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి