కలల కళలు !!!!!!!................శశి ................................................ కనుల వాకిట కలల లోగిట పూత పూసిన ఆశ కలువా ఎదురుగా నిలిచేను చూడవె నిండు వెలుగుల చందురూడే చిలిపి తలపుల పులకరింతలు వయసు తపనల పలకరింపులు తీపి తేనెల చిగురు ఆశలు చెదిరి మెరిసే నుదుటి అలకలు కవన వీధుల నటన మాడెనె ఎదను ఎవరో తట్టి లేపెనె మధుర యామిని సోయగాలతొ మల్లె జాజుల పరిమళాలతొ వీచు శీతల తెమ్మెరలతొ దాచలేని వలపు చిన్నెలతొ విరిసెనె ఒక వింత భావం సాగెనే ఒక ప్రణయ రాగం...2 feb 14
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fyOC5z
Posted by Katta
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fyOC5z
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి