పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Sai Padma కవిత

కొన్ని నిర్మోహ నిర్వచనాలు ~~~~~~~~~~~~~~~~~~~~ అందం : డేగ కళ్ళ సమూహాల కొలతల డెఫినిషన్ ప్రేమ : రాత్రికి గుర్తొచ్చే ఒక అవసరం మోహం ; ప్రేమ పదం మానేస్తే , కవితల్లో వాడేది కామం: అర్వాచీన అవసరం.. ..మా కాలం లో ఇలా కాదు ' అని అవాక్కయ్యేది ఆవేశం: ఆడవాళ్ళకి మాటల్లోనూ, మగవాళ్ళకి చేతల్లోనూ ఉండేది ఆత్మీయత : బంధాల్లో తక్కువగానూ, నిర్బందాల్లో అతి తక్కువగానూ, స్వేచ్చ లో హక్కుగానూ ఉండేది ఆధ్యాత్మికత: ఇన్వెస్ట్మెంట్ దొరికితే మంచి బిజినెస్స్,.. లైన్ కి మరరోవైపు ఒక నిస్సహాయత వొంటరితనం : అస్సలు జెండర్ లేని .. అనాదిగా ఓవర్ రేటెడ్ కవిత్వ వస్తువు సున్నితమైన మనసు : ఎవరికి వాళ్ళు, తామొక్కరికి మాత్రమే ఉంది అనుకునేది కథ : జెండర్ గోల లేకుండా ... అందర్నీ ఊరించే ప్రేయసి కవిత్వం : నిర్వచించలేకపోయినా .. అందరూ వచించేది --సాయి పద్మ

by Sai Padma



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kkzlXV

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి