జీవితం-నిప్పుల కొలిమి ప్రాణదీపం కొడిగడుతుంది మనసుకు తన స్మృతుల ఆజ్యం అందనపుడు ఆరిపోవడానికి,వాడిపోవడానికి నీ జీవితం గాలిలో దీపం కాదు, పూసిన ఒక్కరోజుకే మాసిపోయే మల్లె కూడా కాదు. మనసులు మళ్ళీ అతుక్కుంటాయి మమతానురాగాలు బంకలాంటివి కొన్ని వాక్కులు పేలుతాయి మౌనాలు ముక్కలై సమయంలో శిథిలమవుతాయి నీకోసం కొన్ని రాత్రులు ఏడుస్తాయి కొన్ని చుక్కల్ని నేల రాలుస్తాయి చీకట్లు వెన్నెలను వెంటబెట్టుకొస్తాయి నీ కళ్ళలో వెలుగునింప చూస్తాయి మది నది ఇంకిపోతుంది లావాలా పొంగే గుబులును చల్లారుస్తుంది నీ గుండె ఆక్రోశం విని కొండాకోనలు ప్రతిద్వనిస్తాయి సెలయేరులు కన్నిటి జలపాతాలై పారతాయి ఓదార్పు ఊరడింపునివ్వదని ఊహలన్నీ వాస్తవాలు కావు వాస్తవాలన్ని కాలే కట్టెలే పట్టిన చేతికే ఆ గాయమంటూ ఏ చెట్టుకొమ్మనో ఆశ్రయిస్తావు మెడకు ప్రశ్నల తాడు తగిలించుకుని జవాబుకై ఊపిరిని ఊపుతూ.... ఆపుతూ.... గాలిలో ఊయలూగుతావు ఒడ్డు చేరక సుడిగుండంలోనే సుడులు తిరిగి కలసిపోయే కడలికెరటం అవుతావు తీరంలోనే గొయ్యి తీసి పాతేసిన అలవవుతావు ఎవడి కాలికిందో నలిగి అంటుకుపోయే మట్టవుతావు గాలి నీ ఆత్మకు పల్లకీ అవుతుంది నిన్ను అనంతలోకాలకు చేర్చే విహంగమవుతుంది ఆకాశం నిప్పుల కొలిమి తిరిగి రాజేసుకుంటుంది ఈసారింకా బాగా సానపట్టి దైర్యం ఆకురాయిపై నూరి మరీ నిన్ను భూమ్మీదకు విసిరేస్తుంది జీవితపు లోతుల్ని ఈ జన్మలోనయినా తలంచి తరచిచూసి తరించి జీవితపు చివరంచు వరకు పరిశీలించమని పరిశోదకుడవై విజయసాదకుడవై శిఖరాగ్రాన నిలువమని... నువ్వు బ్రతకడంలో ఓడిన ప్రతిసారి గెలిచే వరకు పైనుండి తోసేయబడుతూనే ఉంటావు.! విశ్వనాథ్ 04APR14
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmNb7Y
Posted by Katta
by Viswanath Goud
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hmNb7Y
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి