పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Nauduri Murty కవిత

కవిత్వంతో ఏడడుగులు 28 కాలం చాలా వింత పదార్థం. చేతికి చిక్కదు. మార్పుకులోనవుతుంది. మనల్ని మార్పుకి గురిచేస్తుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో, రెప్పపాటులో, కరిగిపోతుంటుంది. దానంత ఊరించే (Teasing) వస్తువు బహుశా సృష్టిలో మరోటి లేదేమో! అందుకే కవులందరికీ కాలం అంటే అంత మోహం. Time Flees అంటాడు షేక్స్పియర్. కాలాన్ని గూర్చి చెప్పిన మరో మంచి కవిత ఇది. ఈ కవిత చదివేక నాకు నండూరి సుబ్బారావు గారి "ముందుగతి" కవితలోని "ఎన్నాళ్ళు మనకోలె ఈ సుఖములంటె, కంటతడిపెట్టింది జంట నా యెంకి" అన్న పదాలు గుర్తొచ్చాయి. కాలం నిలకడలేనిది. మనప్రమేయం లేకుండా మనలో మార్పులు తెచ్చిపెడుతూ, మనకు నచ్చినవాటిని అట్టిపెట్టుకునే అవకాశం ఇవ్వకుండా దానికి తోచినపుడు మనదగ్గరనుండి లాక్కునే మహా పెంకిది. ఏ ప్రార్థనలకూ, వేడికోళ్లకూ కరగని మొండి ఘటం. అయినా, సరే, ప్రతివారికీ భయంతో కూడిన ఆశ. ఆశతోకూడిన భయం వదలవు. ఆశకీ, వేదనకీ మధ్య గాలిచొరలేని సందున్నా, మధ్యలోంచి జారిపోగలిగింది కాలమే. కవులు తాము చెప్పదలుచుకున్నవాటిని సూటిగా, పాఠం చెప్పినట్టు చెప్పడం కంటే, కవిత్వంలో వచ్చిన సందర్భాన్ని అనుకూలంగా వాడుకోగలిగితే సౌలభ్యంతోపాటు సౌందర్యవంతంగా ఉంటుంది. . అనంతకాల గీతిక… సిడ్నీ లేనియర్, . ఒక రోజు రాత్రి మా దివాణం తోటలో నేనూ, నా ప్రేయసీ చాలాసేపు మౌనంగా ఉండిపోయాం… ఏ గ్రహచారం వల్లనైనా, మా ఇద్దరికీ ఎడబాటు సంభవిస్తుందేమోనని బాగా దిగులుపడుతూ. . అకారణంగా దుఃఖపడుతున్న నా ప్రేయసి, మా మీద నక్షత్రకాంతి పడకుండా అడ్డుగా ఉన్నతీగమీది ఒక ఆకుని చేయి జాచి, పక్కకి తప్పించింది. . ఆమె దుఃఖాన్ని గమనించిన ఒక తారక ఆకు తొలగించిన మార్గంలోనే సూటిగా ప్రకాశిస్తూ, అద్దంలో ప్రతిబింబంలా,ఆమె కనుకొలకుల చివర వేలాడుతున్న అస్రుకణంలో ప్రతిఫలించింది. . అప్పుడు నేనన్నాను: “ఆశకీ వేదనకీ మధ్య ఎవరో విలపించే కన్నీటి బొట్టు కాలమంటే… మెరుస్తున్న గోళంవంటి ఈ చిన్న భాష్పకణం లోనే చుక్కలలోచుక్క మన కైవల్యం ప్రకాశిస్తోంది.”అని. . సిడ్నీ లేనియర్ (February 3, 1842 – September 7, 1881) అమెరికను కవీ, సంగీతకారుడూ A Song Of Eternity In Time . Once, at night, in the manor wood My Love and I long silent stood, Amazed that any heavens could Decree to part us, bitterly repining. My Love, in aimless love and grief, Reached forth and drew aside a leaf That just above us played the thief And stole our starlight that for us was shining. A star that had remarked her pain Shone straightway down that leafy lane, And wrought his image, mirror-plain, Within a tear that on her lash hung gleaming. “Thus Time,” I cried, “is but a tear Some one hath wept ‘twixt hope and fear, Yet in his little lucent sphere Our star of stars, Eternity, is beaming.” . Sidney Lanier (February 3, 1842 – September 7, 1881) American musician and poet. Further Reading: http://ift.tt/Az348n

by Nauduri Murty



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kz3emE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి