పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Padma Bikkani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Padma Bikkani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జూన్ 2014, ఆదివారం

Padma Bikkani కవిత

||అలౌకికం|| అందమైన ఆవేశాన్ని ఇంకు చుక్కలో ఈదమని ఆజ్ఞాపించితే పక్కున నవ్వింది. ఆజ్ఞకు తలవంచటమేకాని తలపుల జల్లు లకు ఎదురీతరాదుఅని. పోనీ నటనా కౌశలం కి తెర తీయమంటే నటనే రాదు తిరిగి ముసుగేలా అని తగువులాడింది ప్రబంధాలు వ్రాయిపోనీ అంటే ఆ పరాకాష్ట పైత్యం నాకేలా అని కస్సుమంది రౌధ్రాన్ని చూపించమంటే నేను రాజ్యాలను కోల్పోయిన నిరుపేదనా అని చిరుఅలుక ప్రదర్శిచింది పోని ఏ చతురతో చాతుర్యమో కన్పర్చమంటే కయ్యినలేసిందినేను మాటకారినాఅంటూ.. పోనీ నిశీదిగీతాలు ఆలపించమని అడిగితే నాకేల ఆ విరహగీతిక అని కినుక వహించింది ఏ ఆకారంలోనూ ఇమడలేని 'శిల'వా అంటే చట్టుక్కున ఎగిసి పడింది చెంగున దూకే జలపాతంలా. అంబరాన్ని అంటే ఆప్యాయతలా మరకతం తో దోబూచులాడిన దూదిపింజలా, రివ్వున ఎగిరే విహంగంలా పాశాలు లేని స్వేచ్ఛాజీవిలా...

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qPoOqA

Posted by Katta

2, జూన్ 2014, సోమవారం

Padma Bikkani కవిత

|| అసంపూర్ణ చిత్రం || నిగూఢమైన ఆలోచనలనుంచి జనించిన భావాలు హృదయపు కాన్వాస్ పై గజిబిజి చిత్రరేఖలుగా రూపుదిద్దుకొని ఇమిడి ఇమడని భావాలతో ఓ పికాసో చిత్రంలా, తెలిసితెలియని ఆవేధనలా .... తర్కానికి అందని రోధనలా అరణ్యంలో ఓచోట రాజుకొంటున్న దావానలంలా ఎగిసి పడుతుంది... గుప్పిట బిగించిన అరచేతిలో గీతల్లా, రూపం పోల్చుకోని యాతనలా అచ్చులు హల్లులకి తర్జుమా చేయలేని ప్రకంపనాల్లా.., ముడతలు పడ్డ శరీరంలో వణుకు గీతల్లా రూపాన్ని మారిపోయి జాలిగా చూస్తున్నాయి.... కంటిపోరలలో నీరు తోణికిసలాటకు జీవం కోల్పోయిన ఆకారంలా భాషల లిపిలో ఏరూపంలో దాగక ఉడిగిన జవసత్వాలా నిశబ్ధరోధనై మూగపోతుంది..... గుప్పిట బిగిసిన గీతలు వృద్దాప్యంలో ముడుచుకు పోతు చిట్ట చివరి మజలీల్లో వైవిద్యభరిత శోధనకు నా జిజ్నాసకు అందని పదాలుగా నన్ను వెలివేస్తున్నాయి....!! భావాలకు అనుభవాలల్లి క్రమబద్ధికరించితేనే నీకు నువ్ గీటురాయివి అవుతావు అని వెక్కిరిస్తున్నాయి....!! కానీ, అంతర్మదనంలో అక్షరాలు ఉప్పొంగే అలల్లా నెగ్గటం రాక మళ్ళీ సంద్రంలో సబ్ధువుగా వెనతిరిగి ఓడి నెగ్గటానికి విశ్వప్రయత్నం చేసి మళ్ళీ ఓటమి చేరువని దరిచేరుతున్నాయి ఎప్పటికి నెగ్గని నాలో భావుకునిలా... నా అన్వేషణ అక్షరమై,.... ఆ అక్షరానికి అసంపూర్ణచిత్రంలా వేళ్లాడుతూ మిగతా చిత్రాన్ని గీస్తూ పోతున్నాను ఈ అసంపూర్ణ చిత్రాన్ని సంపూర్ణం చేసేందుకు....!! 2 june14

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iK9h6d

Posted by Katta

23, ఏప్రిల్ 2014, బుధవారం

Padma Bikkani కవిత

* *ఆ.....అక్షరాలు.....* * ఎలాజరిగిందో మరి అంతరంగంలో ఆలోచనలు అక్షరాలుగా ప్యూపాలు పగల గొట్టుకొన్నట్టున్నాయ్ ఎందుకనో మరి పదాలై పెదాలు దాటించాలని ప్రయత్నం చేస్తే ఓడిపోయిన సైన్యం లా దిగాలుగ వెనుతిరిగాయి .. ఉక్రోషంగా ఎత్తుకు పైఎత్తుగా మాటల పదాలను కొటగోడలుగా పేర్చుదాం అంటే బరువైన పదాలేవీ బాష లో ఇమడ్చ లేక గుండె తలుపులు గడియ వేసుకొన్నాయి.. ఏమైందో ఇక నీలి రంగు సిరా లో వెతలుగా కొన్ని అక్షరాలను తడిపేస్తూ నింపబోతే ఆ సాంద్రత బరువు తట్టుకోలేక ఇంకు చుక్కలకు 'కన్నీటి 'చుక్కలు నేస్తాలయ్యాయ్ ఎలాగో ఒకనాటికి తడిసీ తడవని అక్షరాలని తడారిన గుండె పై రాల్చుకున్నాక కాలం భూతమైంది కవిత గతమైంది సగం కరిగిన కొవ్వొత్తి చేతిలో పట్టుకొని చిరిగిన పుస్తకాలలో రెండు శూన్యాల నడుమ ఇరుక్కున్న అక్షరాలను చూడబోతే పురాతన పుస్తకంలోని తప్పిపోయిన కాగితాలు పచారీ సామానుకి వలువలైపోతే జరీ అంచులా మెరుస్తూ ఆ అక్షరాలు.. నా అక్షరాలు... **పద్మ**23|4|2014

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tA8tc6

Posted by Katta

21, ఏప్రిల్ 2014, సోమవారం

Padma Bikkani కవిత

పద్మ****నా బాల్యం**** జీవితమనే పుస్తకంలో అత్యంత అద్భుతమైన మొదటి పేజీ బాల్యమేనేమో.! అమాయకమైన బాల్యన్ని గేలం వేసి వెనక్కి తెచ్చేసుకోవాలని ఉంది. చిన్నప్పుడు ఉదయం లేవగానే ఇంటివెనకాతలనే ఉన్న రాములులవారి గుడి దగ్గరకు నా ప్రమేయంలేకుండానే నా కాళ్ళు నడిచేసేవి. చెట్టూ చుట్టురా పరుచుకొన్న పారిజాతం పువ్వులతో మాట్లాడేసి గుడి చుట్టూ ఉన్న మొక్కలను ఓసారి కళ్ళతో తడిమేసి, శివాలయం పక్కన ఉన్న చెరువుదగ్గరకు వెళ్ళి మునికాళ్ళపై కుర్చుని నిశ్చలంగా ఉన్న నీటిలో నా ప్రతిబింబాన్ని చూసుకోని మురిసిపోయేదాన్ని. చిన్న చిన్న రాళ్ళను నీటిలోకి రువ్వుతూ ఆ తరంగాలను చూస్తూ తరంగాలు దూరందూరంగా పెద్ద వృత్తంలా వాటిలో మళ్ళీ రువ్విన రాయి దూసుకొని పోతూ ఇంకో వృత్తం అలల తరంగాలో ఏదో తెలియని గమ్మత్తు. నీటిలో రివ్వు రివ్వున తిరిగే చేపపిల్లలు తడిచిన నా పాదాలను ముద్దు పెట్టుకొంటూంటే ,వాటిని తాకుదాం అనే లోపలే చట్టుక్కున అందకుండా జారిపోయేవి. ఇప్పుడు కూడా నాకు తెలియకుండానే కాలం చేతి వేళ్ళ మద్య జారే ఇసుకలా జారిపోతుంది నన్ను వెక్కిరిస్తూ... పేపర్ పడవల మద్య ఒదిగిన బాల్యం, బ్రతుకు నావకు చుక్కానిలా మారి పోయింది. 21|4|14

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RDT6RA

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

Padma Bikkani కవిత

పద్మ **నేనైన నువ్వు ** అదమరచి నిద్దరోతున్న నన్ను , కిటికీలో నుంచి ఉషా సమీరాలు మేనును తడిమి అల్లరి చేస్తున్నాయి. అచ్చం నీలానే.. నా పాదాలు పుడమిని ముద్దు పెట్టుకొని పెరట్లో ఉన్న మల్లితీగకు చెలికత్తెల్లా మనసు సొద వినిపించేందుకు చేరువవ్వుతున్నాయి... నాలో ఇంకిన నీ స్పర్శ్హ ఆ విరులకు తాకినట్లుంది, నీ ఙ్ఞాపకం లా నన్ను తడిమేస్తుంది తీరా కుసుమాలను తాకబోతే మంచుకు తడిసిన పువ్వులు కొత్త మాటలేవో చెపుతున్నాయి.. గమ్మత్తుగా నువ్ తడివై ఓ ఙ్ఞాపకం ఆ పువ్వుకి అంటి పరిమళం లా నన్ను చుట్టేసావు అని.. తీరా నిన్నూ ఆ తొడిమ నుంచి వేరు చేసి నాలో కట్టేద్దాం అని చూడబోతే రెక్కలు తెగిన పక్షిలా విలవిలలడి పోయావు. నేను నీకేనా నేను నేను కానా..!? అని నిలదీస్తున్నట్లుగా.. ఏం చెప్పనూ ప్రేమంటే నిండైన స్వేచ్చే కదా..!! అందుకే నువ్వు కొమ్మపై నేనూ ఓ కొమ్మనై ఇద్దరమూ ఒకలానే మిగిలాం..

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i5f3SK

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Padma Bikkani కవిత

** భావుకత్వం అంటే !? ** భరించలేని వ్యథను అక్షరాలతో అనుసంధానం చేయటం భావుకతనా !! ?? ఓటమి గుండె పొరలను తవ్వుతుంటే ఉబికి వొచ్చే కన్నీటికి వంతెనలు వేయలేక అక్షర ప్రవాహంలో కొట్టుకు పోవటం భావుకతనా !! ?? సంతోషం లో విసిరే అక్షరాల కన్నా వేదనా భరితమైన అక్షరాలే భావుకతనా !! ?? నాది నీది అని సంబరపడిన క్షణాలు ఆవిరై గుండె గొంతును నులిమేసి నాలోనే ఇంకిపోయే ఆవేదనా!! లాలనకి చిన్ని పాపయి లా ఒదిగిపోయే మనసు వేదన ప్రకంపనలకు చిగురాకులా వణికిపోవటమా !! ? కడలి ఘోషలా ఎగిసి ఎగిసి పడే హ్రుదయ ఘోష భావుకత్వమా !!? పద్మ

by Padma Bikkani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oDKJDV

Posted by Katta