పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sree Kavita లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sree Kavita లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, మే 2014, ఆదివారం

Sree Kavita కవిత

|| మాతృ దేవో భవః || 'శ్రీ' కవిత 11.05.2014 'అ' అంటే అమృతం 'మ' అంటే మమత ఈ రెండు అక్షరాల క్షమత 'అమ్మ' పదం అమ్మే నే పలికిన తొలి పలుకు అమ్మ స్పర్శే నే పొందిన తొలి ప్రేమ అమ్మే నాకు ఓనమాలు నేర్పిన తొలి గురువు అమ్మ పలుకు అద్వితీయం అమ్మ పలుకు కమ్మదనం అమ్మ పలుకు ఆచంద్రార్ఖం అమ్మ నిజమైన ప్రేమకి నిలువెత్తు రూపం అమ్మ నిజమైన కరుణకి కదిలే దైవం అమ్మ నిజమైన లాలనకి ఆలనా పాలనా 1. జనని నవమాసాలు మోసి పురిటి నొప్పులు పంటి బిగువున ఓర్చి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి జన్మనిచ్చే మాతృ మూర్తి తన బిడ్డ ధరణిపై అడుగిడుతూనే నొప్పులు మరిచి మురిచి గుండెలకు హత్తుకొని లాలిస్తూ ప్రేమని కురిపించే అమృత వర్షిణి 2. మాత ఏడవగానే తన రక్త మాంసాలు కరిగిస్తూ పాలిస్తూ పరవశించే ప్రియవదనం నిద్రాహారాలు మానీ తన బిడ్డకు పోశాకాహారాలిచ్చే అక్షయం చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కిరావే అంటూ గోరు ముద్దలు తినిపించే అన్నపూర్ణ రాగం రాకున్నా అనురాగంతో లాలిపాటతో అవలీలగా నిద్రపుచ్చే లాలిని ప్రియగామిని 3. తల్లి తప్పటడుగులు మాన్పి బుడి నడకలు నేర్పి బుజ్జగింపులతో నడవడిక మార్చే నేర్పరి ఓంకారంతో మొదలుపెట్టి అమ్మపేరుతో రాతలు దిద్ది తలరాతను మారేల శ్రమించే బ్రాహ్మణి చెడుగుణాలను తుంచి మంచిని పెంచి ఓటమిలో ఓదార్చి ఆత్మ విశ్వాసం నింపే స్పూర్తి ప్రదాత అమ్మ అని పిలుపు వినగానే ఎక్కడ ఉన్నా పరుగెత్తుకొని వచ్చి అక్కున చేర్చుకొనే ఆదరణీయ మూర్తి 4. అమ్మ ఏప్రతి ఫలం ఆశించని ప్రేమే అమ్మ ప్రగతిని ఆకాంక్షించే అభిలాషిని అమ్మ ఎంత ఎత్తు ఎదిగినా చంటి పాపలా చూసుకొనేది అమ్మ పేగుబంధంతో మొదలై మమతల బంధంతో మిగిలేది అమ్మ ఓ మాతృమూర్తి ఏలా తీర్చుకోగలను నీ ఋణం ఏమిచ్చినా తక్కువే అందుకే అందుకో స్వీకరించు నా వందనం పాదాభి వందనం ఓ జనని నువ్వు నాతో లేకున్నా నీ నామ స్మరణతోనే నా ప్రతి అడుగు నిన్ను తిరిగి తీసుకురాలేను కానీ నా కూతురులో నీ రూపాన్ని చూసుకుంటూ అమ్మా అని పిలుస్తూ అపురూపములా పెంచుకుంటూ కొంతైనా నీ ఋణం తీర్చుకుంటా ఆశీర్వదించు మాతృమూర్తులందరికీ... వందనం......!!.మాతృ దేవో భవః !!

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fY1LbZ

Posted by Katta

6, మే 2014, మంగళవారం

Sree Kavita కవిత

||శుభసూచకాలు|| శ్రీ కవిత @ 06.05.2014 గగగన కుసుమ వయారియది నీ వదనం ఎదో మరిచీ మరువని వలపు కొమ్మల్లో దాగిన కోయిల పిలుపులా మది వూహల్లో పరిమళించిన సంపంగిలా కళకళలాడే నా వూహా సౌంధర్య రాశి ఊర్వశి వంటి నీతో చెలిమి నాకెంతో కలిమి మేనకలా మెరిసే నీ అందం కలిగించెను నాకెంతో మనో ఉల్లాసం చెలిమితో కలగలిపి అందంగాచిరుమందహాసంతో చిద్విలాసంలా ప్రతిబింబించే ముఖారవిందం కలిగించును నా మదిలో పులకింతల గమకం నీ హృదయం కోరాలనీ నా వూపిరి సాగాలనీ నీ మనసంతా నేనై నిండాలనీ నా కలలు పండాలనీ పరిపరి విధాల తలచి వలచాను నీ మమతల బంధాలతో ఈ ప్రపంచాన్నీ మరిచాను నీ పలుకుల మాధుర్యంలో ఇహలోకంలో మునిగి నిన్నే నా దేవిగా తలచి ప్రతి నిత్యం ఆరాధిస్తున్నాను పెద్దగా నిన్ను ఏది కోరను నా పేద మనసుతో నీ పెదవుల చాటున దాగిన ఆ "చిరునవ్వు" తప్ప అందమైన ఆ చిరునవ్వులు మన నిష్కల్మష మైన ప్రేమకు అంకురాలు వలపుల బంధానికి శుభసూచకాలు

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kGxw5C

Posted by Katta

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

Sree Kavita కవిత

||ప్రణయ కేతనం|| 'శ్రీ' కవిత 25.04.2014 చూపులు కలిసిన శుభవేళ మనసుని మనసు మనువాడిన బంధాన అందాల స్పర్శల ఆత్మీయ అనుభూతులలో తనువుల తమకాల గమకముల మౌనరాగం !!మన జీవన రాగం!! మౌనమే 'అర్థం' ప్రధమార్ధం మౌనమే 'ధ్యానం' మన అనునయం మౌనమే 'భాష ' మన మూగ భాష అర్థం అంగీకారం కలిగే సర్వాధికారం మనం సగం సగం కలిస్తే పరిపూర్ణం సర్వ సుంధరాల సమ్మొహణం నారీస్వరం సగం సగం ఏకమై నీలొ నెనై నాలో నువ్వై కలిసి ఒకటై చేసెను నృత్య కేతనం అదే మన !!ప్రణయ కేతనం!!

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RRI62U

Posted by Katta

Sree Kavita కవిత

||ప్రణయ కేతనం|| 'శ్రీ' కవిత 25.04.2014 చూపులు కలిసిన శుభవేళ మనసుని మనసు మనువాడిన బంధాన అందాల స్పర్శల ఆత్మీయ అనుభూతులలో తనువుల తమకాల గమకముల మౌనరాగం !!మన జీవన రాగం!! మౌనమే 'అర్థం' ప్రధమార్ధం మౌనమే 'ధ్యానం' మన అనునయం మౌనమే 'భాష ' మన మూగ భాష అర్థం అంగీకారం కలిగే సర్వాధికారం మనం సగం సగం కలిస్తే పరిపూర్ణం సర్వ సుంధరాల సమ్మొహణం నారీస్వరం సగం సగం ఎకమై నీలొ నెనై నాలో నువ్వై కలిసి ఒకటై చేసెను నృత్య కేతనం అదే మన !!ప్రణయ కేతనం!!

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pwrwV3

Posted by Katta

16, ఏప్రిల్ 2014, బుధవారం

Sree Kavita కవిత

|| చిరునవ్వు || @ శ్రీ కవిత 16.04.2014 చెలీ ! ఓ నా ప్రియ సఖీ ! స్నేహార్ద్రపు నయనాలతో నాలో ప్రేమ మత్తును నింపావు కష్టాలను భరిస్తూ కన్నీళ్లను దాచుకొని నిన్ను నీవు మరిచి ప్రేమ సుధను కురిపిస్తావు నన్ను నేను మరచేల ముద్దు ముద్దుగా మురిపిస్తావు స్వార్థం లేని ఈ వలపుల వలయంలో నిస్వార్థంగా నేను కోరు కునేది ఒక్కటే అది ...... మచ్చలేని జాబిలిలా పవిత్ర గంగాజలంలా పున్నమి వెన్నెలలా ఆమనీ కోయిలలా విరిసిన పుష్పాలపై మంచు బిందువుల్లా కొండల మీద నుంచి కిందకి దూకుతున్న ప్రణయ గోదారిలా మధుమాసం మంచులో తడిసి విచ్చుకున్న ముద్ద మందారంలా గులాబీ రేకు మీద నుంచి జారి పడుతున్న నీటి బిందువులా అందాలా బృంధావనములా నయగారాల నందన వనములా పిల్లన గ్రోవిని విన్న గోపికలా మదిని పులకింపజేసే ........ ప్రకృతిలో ఏ అందానికి సాటిలేని నీ చిరునవ్వు ... నా మనసు కోరు కునేది..అదే ...నువ్వు నీలో ఆ చెరగని చిరునవ్వు ..ఎప్పటికి నవ్వుతు నవ్విస్తూ ఉండాలనీ

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hJOjsr

Posted by Katta

7, ఏప్రిల్ 2014, సోమవారం

Sree Kavita కవిత

||ఏడేడు జన్మల అనుబంధం|| 'శ్రీకవిత' శ్రీ కారం నొసగు నా చెలి సుందర వదనం ఎందెందు వెతికినా కాన రాదు ఈ పరిపూర్ణ బింబం కనులార్పక ఆధ్యంతం తిలకించినా తనివితీరనిది నా చెలి ముఖారవిందం !! ఇంతటి సొగసు ఎవరి తరము !! శారద రాత్రుల శశివో, పున్నమి రాత్రుల నెలవంకవో మెరిసే మేఘాంతరాల మధ్యలో మేరిచే లతవో కాశ్మీర కమనీయ అందాల సోయగాల సొగసరివో ప్రకృతికి హరిత వర్ణాలు తెచ్చే వసంతానివో !! మది పులకించును నా చెలి తలపులు !! వసంతుని రాకతో చిగురించిన మామిడి వృక్షం కొమ్మలందున పువ్వులనడుమ చివురు మేయుచూ గొంతు నెత్తిన కోయిలమ్మల కొసరు పాటల మిసిమి పల్లవి నా చెలి పలుకులు కలిగించును !! తేనె తాగిన అనుభూతులు !! నా చెలి పలుకే రమ్యం, కులుకే సింగారం మేళవింపుల మధుర గీతం నా చెలి నిర్మల మనసు పలికించును సప్త స్వరాల సమ్మోహన రాగం నా చెలి పులకిస్తే పల్లవించును రసరమ్య మాధూర్యాల ప్రణయ రాగం నా చెలి తలపే సరిగమలు వలపే శృతి లయలు కలిసి సాగే సహచర్యం ఆలపించును !! అనురాగాల జీవన సంగీతము!! బంతి పువ్వులోని నిండుతనము, గులాబిలోని గుంభనము సన్నజాజిలోని మేని వంపులు, కనకాంబరంలోని సౌరభవర్ణాలు చేమంతి లోని సరసం, సంపంగిలోని పరిమళం మల్లెలలోని శ్వేత వర్ణం, కలువలోని కోమలత్వం కలగలుపులతో నాచెలి !! మురిపించే మమతల (కు)సుమం !! నా చెలి చీర సింగారంలో కనిపించును పదహారణాల తెలుగు తనం, సాంప్రదాయాల సౌభాగ్యము నా చెలి చెలిమి కలిగుంచు అమర కలిమి,వెల కట్టలేని విలువైన చెలిమి నా చెలి సాంగత్యంలో సృష్ఠిలోని ప్రతిదీ కళ్ళకు మనోహరమే...మరింత..ఆందంగా నా చెలి తో గడపిన ఒక్కొక క్షణం అమరం అనుభూతుల బంధం !! ఏడేడు జన్మల అనుబంధం !!

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jRPjd4

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Sree Kavita కవిత

!! ఓ దార్పు!! 'శ్రీ కవిత' 04.04.2014 ఓ చెలీ.!!..నా మది కోవెలలో కొలువున్న ఓ దేవి..!! నా కనుపాపల మీద తెలాడే నీ రూపము నీ తనువు ఆకృతి, నీ సుందర మోము వర్ణించలేని పోల్చలేని ఇంద్ర జాలం ..!! ప్రియ సఖి!! మన పరిచయం మనోవాంచా ఫలం పంచుకున్న అనుభూతుల ప్రపంచం రసరమ్య మాధుర్యం ప్రపంచంలోని ప్రతి కదలిక మన చతుర్నయనాలకు మాత్రం వింతలే ..!! చింతలేని మన వలపుల వలయములో ఏర్పడిన అపార్ధాలు వీడని గ్రహణంలా మదిని కుదిపేస్తూ,.భావాల ప్రవాహమై, ఆక్రందనతో విరహ గీతాల రాగం చివరకంటూ వచ్చి గొంతు మూగ బోయింది స్వర పేటిక నిశబ్ద గీతాన్నీ ఆలపించింది..!! ప్రియ వర్షిణి ..!! ఒక్కసారి ఆలోచించు ఘనత లన్నీ మరచిపోయి, సాకులేన్చితివి నీ ,నిరాదరణతో నా శక్తి యుక్తులు సన్నగిల్లెను గతము కలవలె కరిగిపోగా , నిదురలేని నిర్భాగ్యుడిలా .సొమ్మసిల్లితినే !! ప్రేమ వర్షం కురిపించలేవా ..??..!! హిమ వర్షిణి.!! నా పెదవులపై ఓలలాడే చిరునవ్వు నువ్వు .నిర్ధయతో నాకు దూరము చేసిన నిరుపామానమైన నా చిరునవ్వు జీవకలని హరించింది, నిట్టూర్పులు నిలువెల్లా ఆవరించగా అసంతృప్తి అణ్వస్త్రమై అంతరంగంలో అణువణువు విస్పోటనాల మయమై .స్థిమితానికి తెర పడి మతి చెడి ఎద సడి అడుగులు తడబడి కుమిలి పోతున్న !! చిరునవ్వు తిరిగి ఇవ్వలేవా..?? !! .ప్రియధామిని..!! బలము కరువై బ్రతుకు బరువై ఆశలు నీర్వీర్యమై, నిసృహతో క్షణాలు సైతం యుగాలుగా గడుపుతున్నా భీతి పెరుగుటతో..!! మురిపించ రాలేవా.??.!! కానులార్పితే నా కనుపాపల నుండి నీ రూపము కన్నీరుల జారిపోతుందని, మది రగిలినా యెద పగిలినా నీ !! ఓ దార్పు!! కోసం వేచి ఉన్న...ఉంటాను...!!

by Sree Kavita



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pv10ea

Posted by Katta