Nauduri Murty గారి మాటలు 'కవిత్వం' గురించి.... "కవిత్వం ఒక ఆవేశం. ఒక రకంగా చెప్పాలంటే Aberration of Emotion. మనుషులందరికీ నచ్చినవి కవికి నచ్చకపోవచ్చు. ఎవరూ పెద్దగా పట్టించుకోని విషయాలని, పనికిమాలినవిగా వదిలేసినవి చిన్నపిల్లాడిలా కవి పట్టించుకోవచ్చు. అసలు కవిత్వం మనలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందోకూడా తెలీదు. అదొక వైరస్ లాంటిది. అదిపట్టిందంటే అమ్మవారు పూనినట్టుంటుంది. అది వదుల్చుకునేదాకా, కాగితమ్మీద ఆ కవితావేశాన్ని ఒలికించేదాకా ఈతరానివాడు ఒక సుడిగుండంలో చిక్కుకుని బయటపడడానికి చేసే ప్రయత్నంలా ఉంటుంది. ఇది సహజ స్థితి. కాని కొంత అలవాటైన తర్వాత, ఈతవచ్చినవాడు నూతిలోనో, చెరువులోనో చేసే విన్యాసంలా ఉంటుంది కవిత్వం. అంటే కేవల ఆవేశం నుండి కొంత సమర్థతలోకి వస్తుంది. ఇరవై ఏళ్ళవయసు వచ్చిన తర్వాత జీవితానికి అర్థం ఏమిటి? అన్న ప్రశ్న ఉదయించినట్టు, ఇప్పుడు ఈ కవిత్వం ఎందుకు రాస్తున్నట్టు అని కవికి అనిపించవచ్చు. (ఈ సందర్భం వారి వారి వ్యక్తిగత సంస్కారాన్ని బట్టీ, పరిస్థితుల అనుకూనలతనుబట్టి మారుతుంటుంది). ఒక రకంగా కవిత్వం ఎందుకు రాస్తున్నట్టు అన్నదానికి సమాధానమే కవి మేనిఫెస్టో. మన సానుభూతిని బట్టి మనకు కొందరు కవులు నచ్చుతారు కొందరు నచ్చరు. కాని, మనం అలవరచుకోవలసినది, మన ఇష్టాయిస్టాలతో సంబంధంలేకుండా, ఎక్కడ కవిత్వాంశ ఉందో దాన్ని పట్టుకోవడం. అంటే ,వోల్టేర్ చెప్పినట్టు " I do not agree with what you say, but I defend to death that you have every right to say it అన్న Democratic స్ఫూర్తి అలవరచుకోవడం. పంకంలోంచి పంకజం వచ్చినట్టు వ్యక్తిత్వంలేని కవిలోంచికూడా మంచికవిత్వం రావొచ్చు అన్నసత్యం మనం గుర్తుంచుకోవాలి. కవీ కవిత్వమూ ఒకటిగా జీవిస్తే, జీవించగలిగితే అది ఆదర్శం. అవి చాలా అరుదైన వస్తువులు."
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e22JmQ
Posted by Katta
by Kavi Yakoob
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e22JmQ
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి