పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sravana Saineni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sravana Saineni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఏప్రిల్ 2014, బుధవారం

Sravana Saineni కవిత

"శ్రవణ సాయినేని" "వాహ్...తాజ్" తాజ్ మహల్ గొప్పప్రేమకు చిహ్నం ------------- -------------------- పండు వెన్నెల ముసుగులో తాజ్ ముంగిట ప్రపంచాన్ని తప్పించారు అందమైన ఒక ప్రేమ కావ్యపు దారుల్లోకి ------------- ------------------ వెన్నెల రాత్రుల్లో కాదు ఒక్క సారి ఎర్రటి ఎండలో నిల్చొని చూడండి ఒక పురాతనమైన చెమట చుక్క మెరుపు కనిపిస్తుందక్కడ ------------- -------------------- ఆకలి పునాదుల మీద కట్టిన ఏ మాన్యుమెంటును చూసినా బిగించి ఎత్తిన రోజుకూలీ పిడికిల్లా అనిపిస్తుంది ------------- -------------------- ఎన్ని గరుకు చేతులు నిమిరితే ఇంత నునుపు తేలిందో ఈ కట్టడం ------------- -------------------- ప్రతి సాయంత్రం ఇక్కడ గుభాలించే అత్తరు ఆవిర్ల వెనుక ఎన్ని చెమట చుక్కల పరిమళాలున్నాయో ------------- -------------------- పాలరాతి బరువుల కింద కోటి ఆశల పాలబుగ్గలు ఎన్ని చితికిపోయాయో ------------- -------------------- రాళ్ళ పాలైన రత్నాలన్నీ అన్నం మెతుకులుగా మారిన చారిత్రాత్మక సందర్భం ------------- -------------------- ఆకలిని ప్రేమించేవాడికన్నా గొప్ప ప్రేమికుడు ఎవడుంటాడు ----------------- ------------------- అన్నం కలుపుకున్నంత అపురూపంగా పాలరాళ్ళను పేర్చి వుంటారు అందుకే తాజ్ కంత అందం ------------- -------------------- నేనైతే తాజ్ మహల్ కంటే అన్నం ముద్దే అందంగా వుందంటాను ------------- -------------------- అవును తాజ్ మహల్ గొప్ప ప్రేమకు చిహ్నం --------- తరతరాలుగా ఎండిపోయిన డొక్కలకు రొట్టె మీద ఉన్న ప్రేమ అది ---------------- ------------------- వాహ్ ....తాజ్. ------------------- --------------------- 9-4-14 (వెన్నెల రాత్రుల్లో తాజ్ మహల్ సందర్శనకు అనుమతిచ్చినప్పటి ఒక పాత వెన్నెల్లో తాజ్ ఫోటో చూశాక ..... )

by Sravana Saineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hsfFD7

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Sravana Saineni కవిత

ఆమె రాకపోవటమే బాగుంది ఇటు వైపు ఆమె రాకపోవటమే బాగుంది ఉరి తీసినట్టు ఆ దారి బోసిగా వేళ్ళాడటమే బాగుంది ఆమె సగం పాడి వెళ్ళిపోయిన పాటను గుండెలకు హత్తుకొని మైకంలో తిరగటమే బాగుంది వాన కాలువలా అల్లరి చేసే పిల్లల నడుమ సన్నని గరిక పోచలాగా పచ్చటి జ్ఞాపకమై ఆమె ఒదిగిపోవటమే బాగుంది అప్పుడే కట్టిన పుష్ప గుచ్ఛంలాంటి ఆ పిల్లల బస్సులో తడి మెరుపై ఆమె గుర్తుకు రావటమే బాగుంది పసుపు రంగులో ముంచి ఎత్తిపట్టుకున్న లక్ష కుంచెల సూర్య పూల తోట ఎప్పుడు వెళ్ళినా ఆమెను గీసిపెట్టడం బాగుంది ఆమె కురులపరిమళాల్ని నింపుకున్న ఈ గాలులు బుసలు కొడుతున్న నాగులై నన్ను పగబట్టడం బాగుంది ఇటువైపు ఆమె రాకపోవటమే బాగుంది ఆ మలుపు మీది గోగుపూల వనాలు నేను ఎదురుపడ్డప్పుడు ఆమె బుగ్గల పూసిన సిగ్గులు కావడం బాగుంది అది దారి కాదు ఆమె జ్ఞాపకచిత్రాల ఆర్ట్ గ్యాలరి ఏమీ మాట్లాడకుండా ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది చేతిలోంచి సీతాకోకచిలుక ఎగిరిపోయింది వ్రేళ్ళ కొసలమీద మిగిలిన రంగురంగుల రెక్కల ముద్రల్ని ఇలా చూసుకోవటమే బాగుంది ఇటు వైపు ఆమె రాకపోవటమే బాగుంది "శ్రవణ సాయినేని" "ఆమె రాకపోవటమే బాగుంది" ఇటు వైపు ఆమె రాకపోవటమే బాగుంది ఉరి తీసినట్టు ఆ దారి బోసిగా వేళ్ళాడటమే బాగుంది ఆమె సగం పాడి వెళ్ళిపోయిన పాటను గుండెలకు హత్తుకొని మైకంలో తిరగటమే బాగుంది వాన కాలువలా అల్లరి చేసే పిల్లల నడుమ సన్నని గరిక పోచలాగా పచ్చటి జ్ఞాపకమై ఆమె ఒదిగిపోవటమే బాగుంది అప్పుడే కట్టిన పుష్ప గుచ్ఛంలాంటి ఆ పిల్లల బస్సులో తడి మెరుపై ఆమె గుర్తుకు రావటమే బాగుంది పసుపు రంగులో ముంచి ఎత్తిపట్టుకున్న లక్ష కుంచెల సూర్య పూల తోట ఎప్పుడు వెళ్ళినా ఆమెను గీసిపెట్టడం బాగుంది ఆమె కురులపరిమళాల్ని నింపుకున్న ఈ గాలులు బుసలు కొడుతున్న నాగులై నన్ను పగబట్టడం బాగుంది ఇటువైపు ఆమె రాకపోవటమే బాగుంది ఆ మలుపు మీది గోగుపూల వనాలు నేను ఎదురుపడ్డప్పుడు ఆమె బుగ్గల పూసిన సిగ్గులు కావడం బాగుంది అది దారి కాదు ఆమె జ్ఞాపకచిత్రాల ఆర్ట్ గ్యాలరి ఏమీ మాట్లాడకుండా ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది చేతిలోంచి సీతాకోకచిలుక ఎగిరిపోయింది వ్రేళ్ళ కొసలమీద మిగిలిన రంగురంగుల రెక్కల ముద్రల్ని ఇలా చూసుకోవటమే బాగుంది ఇటు వైపు ఆమె రాకపోవటమే బాగుంది 6-4-14

by Sravana Saineni



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PAICkz

Posted by Katta