పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Viswanath Goud కవిత

*మంటలు* కడుపు రేకుల షెడ్డులా కాలుతోంది ఆకలి మిట్టమద్యాహ్నంలా మండుతోంది ఓ రొట్టెముక్క మేఘంలా అంటుకున్న ప్రేగులను చల్లారిస్తే బాగుండు పోనీ ఏ అన్నపూర్ణ దేవో అన్నం వండి వంచుతున్న ఓ గ్లాసుడు గంజినీళ్ళలో మునిగితేనయినా ఈ వేడి చల్లబడుతుందేమో చూడాలి ఎవరో ఎక్కువై పాడేసిన సద్దిముద్దను సాయమడగాలి తానయినా మంచుముద్దై పస్తుల పూటను కరిగిస్తుందేమో ****************** ఎదురుచూపుల ఋతువులలో వేసవి ఆకలిమంటల కాలాలు తరగకున్నవి చల్లారని ఆకలిమంటలు దావాలనంలా నీరసాన్ని శరీరమంతా వ్యాపింపజేసి గుండెను అగ్ని గోళంగా మార్చాయి కడుపు కాలిన ప్రతిపూట ఏ తల్లో కురిపించే ఓ పట్టెడు మెతుకుల చినుకుల కోసం చకోర పక్షిలా ఎదురుచూడటం అలవాటే మండకుండా, ఎండకుండా ఏ దేవుడో నీరు పెట్టే ఎడారి మొక్కను నేను నా మొలకకు కారణమయిన రైతెవరో తెలియదు మరి నాకు అనాథ జాతి అంటుమొక్కలు అనాదిగా అంటుకుంటూనే ఉన్నాయిగా ఆకలి మంటలు చేలరేగుతూ దహిస్తుంటే ఈ కట్టె కాలుతూనే ఉండవలసిందే ఇంక మండటానికి,కాలడానికి ఏం లేకుండా ఈ కాయం భూడిదయ్యేవరకూ.! విశ్వనాథ్ 06APR14

by Viswanath Goud



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QTtbop

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి