పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Sriramoju Haragopal కవిత

పచ్చీసాట కన్నీటి గవ్వలతో కాలం పచ్చీసాడుతున్నది నన్ను నీతో పోటీకి దింపి తెగ నవ్వుకుంటున్నది నా పందేలన్ని దూగ,తీని,చారీలే సంపుడు పందెంలేదు, పెద్ద పందెంలేదు నేను తనంత చెయ్యి తిరిగిన ఆటగాణ్ణి కాదు పడక పడక పందెం పడ్డా బతుకు పంటగడి చేరకుండనే గుండెల పండుగాయలు చస్తున్నయి ‘ఎన పచ్చీసు’ గెలుపు మంత్రం ఎన్ని సార్లన్నా గవ్వలు నవ్వుల్లెక్క తెల్లగ పడ్డదెన్నని, పడితే పనికిరాని ఏకాంతం చౌదానో, ఒంటరితనం చెక్కనో ఆటొప్పుకున్నంక తప్పదు మాటల్లో, మహిమల్లో నీతో గెలవనని నాకెరికే నీ చేతుల గవ్వలు నీవనుకున్నంత పందెం పలుకుతయి నీవనుకున్నట్టె గెలుపులన్ని నీ ఇంట్లనే దస్సో, పచ్చీసో, త్రీయీసో నీ రెండువేళ్ళమధ్య నీ ఇష్టం గవ్వ నీవన్నట్లు నీషరతుకు పడతయి నాకు నీ చేతిల ఓడిపోవుడు కొత్తనా నీ బనాయింపులే కొత్త కాయలెత్తెటపుడు, పచ్చీసు మూట కట్టేటపుడు గుస గుస ‘నీవెందుకు ఓడిపోతవో నా కెరుకే’ నీ చిన్ననవ్వులో పరిచయ పరాచికం నాకేం తెలుసు ఆడినా ఆడకున్నా నువ్వంటే నాకు ఇష్టభయసందోహం నన్ను ఆడించేది నువ్వే, ఆటను నేను నువ్వు ఓడించే గెలుపును నేను

by Sriramoju Haragopal



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1htU3Ap

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి