\\రచయిత రచన భాష\\ ---------------------- ప్రతి కళలోనూ కళాకారుడికి కొన్ని పనిముట్లు ఉంటాయి. చిత్రకారుడికి కుంచెలూ కేన్వాసు, శిల్పికి ఉలి సుత్తి. రచయితకి కూడా ఉన్నై పాత రోజుల్లో అయితే గంటాలు, భూర్జపత్రాలు, తరవాత ఇంకు పెన్నులు కాయితాలు, ఈ రోజుల్లో అయితే కంప్యూటర్లు. అసలు సరుకంతా ముడిపదార్ధంలో ఉన్నది. శిల్పికి చెక్కనో శిలనో ఎలాగో రచయితకి భాష అలాగు. ఐతే ఒక మౌలికమైన భేదం లేకపోలేదు. రచయితకి ముడి సరుకైన భాష, శిలలాగానో కేన్వాసులాగానో ప్రాణం లేనిది కాదు, అది సజీవమైనది. చరిత్రని పొట్టనిండా నింపుకుని సంస్కృతిని సాంప్రదాయాన్ని వేళ్ళకొసల్లో కనుకొలుకుల్లో తొణికిస్తూ ఉంటుంది. తన జాతి చైతన్యంతో అది నవనవలాడుతూ ఉంటుంది. ఎప్పుడూ. భాషతో వ్యవహారం ఆషామాషీ కాదెప్పుడూ. ఇలా సజీవమైన ముడిసరుకుతో కుస్తీ పట్టే రచయితని చూస్తే నాకు చెవులుకుట్టే వాళ్ళూ, పచ్చబొట్టు పొడిచేవాళ్ళూ గుర్తొస్తారు. పచ్చబొట్టు పొడిచేవాడు అసమర్ధుడైతే, వాడి ముడిసరుకునైన నేను వాడి చేతిలో నరకం చూస్తాను గద! ఆ బాధలో వాడీ గొంతునులిమి చంపెయ్యలేక పోవచ్చును గానీ కుయ్యో మొర్రో అని మొత్తుకుంటాను గద! అటూ ఇటూ మెలికలు తిరుగుతాను గద! ఇంతా చేసి చివరికి ఆ పచ్చబొట్టు నానాకంగాళీ అవకతవగ్గా తయారవుతుందని వేరే చెప్పాలా? ఆ మచ్చని - మనకి నచ్చనిదైనా - చెరిపేసుకోలేను గద! అసమర్ధుడైన రచయితచేతిలో భాష కూడా ఇలాంటి పాట్లే పడుతుంది. విజ్ఞుడైన రచయిత భాష పట్ల గౌరవంగా ఉంటాడు. ప్రాణానికి జీవానికి మనమిచ్చే ఒక మౌలికమైన గౌరవమది. జ్ఞాన నిధులైన పండితులకిచ్చే గౌరవమది. అది తెలిసి మసలుకునే రచయితని భాష కరుణిస్తుంది, ప్రేమిస్తుంది. ఒకే క్షణంలో తల్లీ ప్రేయసీ కూడా అవుతుంది. ఆ కరుణలో ప్రేమలో తడిసి పునీతుడైన రచయిత ఆ భాషకి నగిషీలు చెక్కి అందాలు అద్దుతాడు. POSTED BY కొత్త పాళీ LABELS: భాష Link: http://ift.tt/1fRMjMi 5-4-2014.
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fRMjMi
Posted by Katta
by దాసరాజు రామారావు
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fRMjMi
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి