మనిషి ...నిరంతర అన్వేషి .............శశి ............................................................ ఆనందం ఆవేశం ఆవేదన అనురాగం ..వీటన్నింటి కలయికే జీవితం ఆశల సౌథాల మధ్య వూగిసలాడుతుంటాడు మనిషి సంతోషం వుంటే ఎగిరెగిరి పడతాడు దుఃఖం వస్తే క్రుంగిపోతాడు ప్రతి మనిషి జీవితం .......కాదేదీ పూల వనం సుఖ దుఃఖాల నడుమ ...ఊగే ఊయల వైనం ఉన్నదాన్ని వదులుతాడు లేనిదానికి ఆరాట పడతాడు తన స్థితికి భగవంతుడిని తూలనాడతాడు ఏదైనా బాధ కలిగితే అది దైవం ఇచ్చిన శాపం సంతోషం వుంటే అది తను సాధించిన గొప్పదనం ఏమిటో ఈ మానవ నైజం కరిగిపోయే కలలే తన గమ్యమనుకుంటాడు తీరని కోర్కెలకు కళ్ళెం వేయనంటాడు వ్యర్థ నిరీక్షణలో కాలం గడుపుతాడు పరవారి విమర్శనలో తన గమ్యం మర్చిపోతాడు అలసిన గతాన్ని మరిచి రాబోయే మధుర క్షణాల్ని తలచి సంతోషపడనంటాడు దొరికే ఆనందాన్ని కాపాడుకోనంటాడు ఏమిటో ఈ మనిషి పుట్టించిన బ్రహ్మకైన అర్థం కాని అన్వేషి .............................................13 march 14
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PvJ3Nk
Posted by Katta
by Sasi Bala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PvJ3Nk
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి