!!ఆశయం!! ఆనంద ఆశలసౌధాల మధ్య నిర్మితమైన ఈ జీవనపయనంలో నడుమ కాస్త సేదదీరబోయి విరామంలో విశ్రాంతిగా మండుతూ నిన్ను నీవు ఓదార్చుకుంటూ భారం తగ్గించుకోబోయి పెంచుకోకు! ఆలోచనల చితిలో అనవసరంగా కాలుతూ నీకు నువ్వే దూరమై కన్నీటివాన కురిపించి నీ స్వప్నాలని నీవే భావాలతో బంధించేస్తూ మౌన నిట్టూర్పుల మధ్య హృదయం దేదీప్యమై వెలగాలి అనుకోకు! అర్థరాత్రి కరిపోయే జ్ఞాపకాలకు విలువ కట్టుకుంటూ నిద్రలేమిలో మరువలేని మరపురాని కోర్కెలకు కళ్ళెం విప్పి కొరడా ఝళిపేస్తూ భాధలో భుజం కాకపోయినా వేదనలో నీ మది నీ తోడని మరువకు! అనవసర క్షణాలని నిరీక్షణా కాలం అంటూ కార్యాలకి కాపలా పెట్టి సరదాలకీ సభ్యతకీ నడుమ జరిగే భీకరపోరులో నిస్సహాయతంటూ అలసట చెందిన గతానికి ఆలోచనల పందిరివేసి పైకి ఎగబ్రాకనీయకు! 06-03-14
by Padma Rani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fv9vjR
Posted by Katta
by Padma Rani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fv9vjR
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి