ఆరాటం ********* చెదరని నవ్వుల చెరువు గట్టు నీ అడుగులని గుర్తు చేసి మూలుగుతుంది నీ చూపు కానక అడవి అద్దం నిదుర పోయింది నీ స్పర్శ కోసం ఆ గడ్డి మొదలు ఎదురుచూస్తుంది ! నీ ఒడిలో ఆడ అలసిన డొక్కల లేడి మందల గెంతులు నీ మెరుపు మెరవక ఏటి ఒడ్డున పక్షి గుంపుల ఆకలి తిప్పలు రాత్రి పగలు తేడా తెలియక కన్ను ఆర్పని ఎండిన చేపలు నీ వయ్యారాలను చూపిస్తూ ఆ వాగులు గీసిన బొమ్మలెన్నో ! హోమగుండంలో ఆకురాల్చిన చిన్న చితక రేపటి రోజుకు రేపటి తరముకు నీకై పరచిన స్వాగత గలగలలు ! అందం చెదిరి కొండల కోనల గుంతకనుల దిక్కులు ! అధరం పగిలి కారని నెత్తుటి మాడిన దుక్కులు ! కృష్ణ మణి I 13-03-2014
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0rPok
Posted by Katta
by Krishna Mani
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0rPok
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి