పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మార్చి 2014, గురువారం

Swatee Sripada కవిత

మనసు భాష మనసు పొరల లోలోనికి ఇంకా అలలు అలలుగా పాకి పాకి వస్తున్న ఒక మసక వెలుతురు నీడ పెదవులపై ఆరని నీటి తేమ సంతకాలు స్వప్న హరివిల్లులు సీతాకోక చిలుకలై కనురెప్పలపై అలవోకగా వాలి పులకింతలు నెమరువేస్తున్న అలికిడి ఒక తపస్సులోనో తమకంలోనో పూర్తిగా అణువణువూ నీలోకి నీటి చుక్కల్లా ఇ౦కిపోయాక ఉనికి, ఒక నీరెండ చాలు, తెలీకుండానే మమేకపు సందుల్లో౦చి నిశ్శబ్దంగా జారిపోయాక నాకు నేను అదృశ్యమై నాకు నేను శూన్యమై నాకు నేను నీలాన్ని పులుముకున్న ఆకాశాన్నై నా చుట్టూ అలుముకున్న ఒకేఒక్క ప్రపంచంలో నా లోలోపలి నీలో ఒదిగి ఒదిగి నువ్వూ నేననే సరిహద్దులు చేరిపెసుకున్నాకా ... ఇహ అంచులు లేని అంతుచిక్కని సముద్రమేగా నిండు వెన్నెల వి౦దునారగిస్తూ... 2. నిశ్శబ్దపు ఊహ నాభాష హిమవన్నగాలపై విస్తరిస్తూ ఎప్పటికప్పుడు కొత్త నెత్తావి పరిమళమై నీ చుట్టూ అలుముకు౦టు౦ది మూసేసుకున్న తలుపుల వెనక గోడలూ కిటికీలూ ఏవీ లేని ఒక సువిశాల హరితవనం ఎప్పటికప్పుడు కొత్త చిగుళ్ళ ఆరాటంలో పసిపాపై పారాడుతూ ఉంటుంది. 3. నాజూకు వేలికొసల చివరంచుల్లో మోము దాచుకున్న మనసు అక్షరాలై ,మంచుపూలై అలా ఉ౦డీ ఉ౦డీ రాలుతూనే పోతుంది.

by Swatee Sripada



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxpbTE

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి