పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Srinivasa Bharadwaj Kishore లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Srinivasa Bharadwaj Kishore లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జూన్ 2014, శుక్రవారం

Srinivasa Bharadwaj Kishore కవిత

ఇదిఏల స్వామి? రచన - కిభశ్రీ స్వేచ్ఛావృత్త౦ ౼ ఖ౦డనడక కనిపి౦చు ఈజగము సృష్టిచేసిన నీవు కనిపి౦చుచు౦టివని తమఊహల౦దునే కనులకి౦పగు మానవాకృతులసృష్టి౦చు జనులచూచుచునీవునవ్వుచు౦టివ స్వామి? తలక్రి౦దులౌచువెతికేమ౦తనీకొరకు తెలుసుకొమేలప్రతిఅణువునీవు౦టివని నిలువు౦డ మా అ౦తర౦గమ౦దున నీవు వెలుపల౦తయుశోధ వ్యర్థముగదా స్వామి? కనకు౦టె దైవత్వమునుసాటి మానవున కనెదమేవిధిని ప్రత్యక్ష్యమైననునీవు వినలేకపోతె మానవుల ఆక్ర౦దనలు వినగలమె నీవరములనుదీవెనలస్వామి? తెలుసుకొ౦టిమి విశ్వమ౦చె౦త దూరమో తెలయకు౦డెను మనసులోతునేము౦డెనో తెలుసుననుకు౦టాము గ్రహములప్రభావములు తెలుసుకోమేలనో మనమ౦దు భావములు?

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1p0JtqD

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Srinivasa Bharadwaj Kishore కవిత

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అద్భుతమైన, నాకు చాలా ఇష్టమైన పాట "ఆదిభిక్షువు నాడినేమి కోరేది". ఆ పాటలోని పాదాలు మరొక దృక్పథంనుంచి చూడమని నన్ను ప్రేరేపించాయి. నాకు స్ఫురించిన భావం ఇదిగో ----- నచ్చితే చెప్పండి నచ్చకపోతే నా ఈ దుస్సాహసానికి క్షమించేసేయండి. ఖండ నడకలో ప్రాసతో వ్రాసే ప్రయత్నం చేసాను ఆదిభిక్షువు వాడినేమి కోరేది బూడిదిచ్చేవాడినేమి అడిగేది అడుగకయె అవసరము లనుదీర్చి తోడుండు నడుగడుగు వాడాది భిక్షువైతేనేమి (తోడుండును అడుగడుగు) అడగడమె ఆలస్యముగ వరములిచ్చేసి పొడిబూడిదొకచెటికె చిలకరించితెనేమి తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగునలమినవానినేమి కోరేది (నిగనిగలాడే నల్లరంగంటే చాలా ఇష్ఠమైనవాళ్ళలో నేనొకడిని) నింపె మాధుర్యమును గళమందు ఒకవైపు సొంపైన అమవస నిశీధిశాల్వొకవైపు (నిశీధి శాలువ లేదా నిశీధందమొకవైపు) కెంపులను కనులలో పోదిగెనింకొకవైపు ఎంచి అందములన్ని కోకిలమ్మకెనిచ్చె కరకు గర్జనల మేఘముల మేనికి మేరపు హంగు కూర్చినవాడినేమి అడిగేది యెదలదురు ఉరుములతొ మేఘములు వచ్చినచొ పొదినున్న పసిపిల్ల లదిరిభయ పడెదరని యెదనత్తుకొనురంచు తల్లులకు తెలుపంగ పెద్దవెలుగులుకొన్నిపంపేను ముందుగనె తేనెలొలికే పూబాలాలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేమి కోరేది ముచ్చటగ మూడుదినములజీవనములోనె విచ్చితమ పరిమళము జగమెల్లవెదజల్లి వచ్చితన పదములకడచేరు భాగ్యమ్ము నిచ్చేటిముక్కంటి వాడినెటు పొగిడేది? బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేమి అడిగేది కొండలుగ యుగయుగము లుంచినను శాశ్వతము గుండేటి తనరూపు విగ్రహముగామార్చి పొందమని తనవంతు వేవేల పూజలను దండిగా దీవించు వాడినెటు పొగిడేది?

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oCaKPL

Posted by Katta

17, మే 2014, శనివారం

Srinivasa Bharadwaj Kishore కవిత

ఇదిఏల స్వామి? రచన - కిభశ్రీ స్వేచ్ఛావృత్త౦ ౼ ఖ౦డనడక కనిపి౦చు ఈజగము సృష్టిచేసిన నీవు కనిపి౦చుచు౦టివని మాఊహల౦దునే కనులకి౦పగు మానవాకృతులసృష్టి౦చు జనులచూచుచునీవునవ్వుచు౦టివ స్వామి? తలక్రి౦దులౌచువెతికేమ౦తనీకొరకు తెలుసుకొమేలప్రతిఅణువునీవు౦టివని నిలువు౦డ మా అ౦తర౦గమ౦దున నీవు వెలుపల౦తయుశోధ వ్యర్థముగదా స్వామి? కనకు౦టె దైవత్వమునుసాటి మానవున కనెదమేవిధిని ప్రత్యక్ష్యమైననునీవు వినలేకపోతె మానవుల ఆక్ర౦దనలు వినగలమె నీవరములనుదీవెనలస్వామి? తెలుసుకొ౦టిమి విశ్వమ౦చె౦త దూరమో తెలయకు౦డెను మనసులోతునేము౦డెనో తెలుసుననుకు౦టాము గ్రహములప్రభావములు తెలుసుకోమేలనో మనమ౦దు భావములు?

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gcHmA8

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Srinivasa Bharadwaj Kishore కవిత

ఒకానొక వానదినమునాడు, చలికి ముసుగుతన్ని పడుకుని టీవీలో సినమా చూస్తున్నప్పుడు నాకు వచ్చిన ఒక ఆలోచన, సాధారణంగా ఆ పరిస్థితులలో అందరికీ, ముఖ్యంగా తెలుగువారందరికీ వచ్చేదే అయినా, ఆరోజు, వచ్చిన ఆలోచనను అమలుపరచడం నేను స్వయంగా, తదనంతరం నేను పడ్డ అవస్థ ఇతివృత్తంగా తీసకుని సరదాగా ఛందోబద్ధంగా వ్రాయాలని కలిగిన కోరిక ఫలితమే ఈ కవితలు . వానదినము - కైవల్యము రచన: కిభశ్రీ శ్రీనవాస భరద్వాజ కిశోర్ వృత్తం: కందం వెలుపల జోరుగ వానకు నులివెచ్చగనింటియందు నూయలనుండన్ తలపున వచ్చిన యోచన తలమునకలుచేసి నన్ను తైతకలాడెన్ ఇంచుకనైనను ఆలస మెంచక నే ముసుగుతీసి మెల్లగలేవన్ మంచినిదుర చెడగొట్టితి న౦చుపలువిధుల శ్రీమతి ననుదూషి౦చెన్ శీతలకారిలొ (refrigerator) బరిణెల మూతలతీయగ దొరికెను మోహమువెలుగగన్ చేతులు రెండిటి నిండుగ పాతవెనైనను ఘాటువి పచ్చిమిరపలున్ మూడంగుళములు పొడవువి వాడినవైనను తొడిమెలు బాగనెయు౦డెన్ వాడిగ నున్నొక కత్తితొ వీడక నడుమను చీలిచి వేరుగపెడితిన్ పండిన చింతకు జిలకర నిండుగ వామును లవణము ని౦పితినయమున్ పిండిసెనగనందుముంచి మెండుగవేయించిచేస్తి మిర్చీబజ్జీ యేమని చెప్పను రుచినిం కేమని పొగడుదు మిరీ్చకేదికపోటీ నామనసొప్పదుప౦చగ ఈమని శ్రీమతి అడిగితె యేమనిచెప్పన్ వీసిన సనజాజిపూల వాసన మరిపింపజేయ వచ్చినవాటిన్ మూసిన కన్నుల తోడనె వేసినవటు వేసినట్లు వేసుకుతినగన్ కారెను నా కంటనీరు మారిక నోరగ్నిగుండమైనను మరి నేన్ భీరుడకాదలచక గం భీరముగిం కొన్నితినగ భీతియెలేకన్ (గంభీరముగ ఇంకొన్ని తినగ) కాననిచోటెల్లమంట తోనిక నాతంటాలకు తోడుగనయ్యెన్ లోనికి బైటికి పరుగులు కానుకగా పొందితినే కైవల్యంబున్ చెప్పిన వినన౦దుకుఈ తిప్పలు తప్పవు పొమ్మని తిట్టితరుణినా తప్పడు పనులకు శిక్షగ చప్పిడికూడేఈరోజనితీర్పిచ్చెన్

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QOhFKr

Posted by Katta

13, మార్చి 2014, గురువారం

Srinivasa Bharadwaj Kishore కవిత

సమస్యా పూర్ణ౦ సమస్య ౼ కోడలిప౦చన {ఇ౦టనె} జేరెనుకూతురిగత్తే {కూతురిగా అత్తయే} {సరదా} పీడ౦చెనతిగ ప్రాణము వీడేవరకి౦కనుతనివితీరలేదో మూడునెలలలోనెతిరిగి కోడలి ప౦చను {ఇ౦టనె} జేరెను కూతురిగత్తే {ప్రాణమున్న౦తకాల౦ పీడి౦చి తనివి తీరక కోడలికే కూతురిగా తిరిగి వచచేసి౦ది అత్త} {తత్వ చి౦తనపరమన పద్య౦} ఉ౦డగ వేద సఘోషలు ని౦డుగ ఇల్లది వాణీ నిలయమ్మేన౦ దు౦డగవేడగ{రమ్మన}జనకుడు కోడలి ప౦చను {ఇ౦టనె} జేరెను కూతురిగత్తే {సరస్వతీ దేవి ౼ కోడలి ఇ౦ట కూతురిగా అత్త లక్ష్మీదేవి సీత రూప౦లో చేరి౦ది}

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m0rOAM

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

Srinivasa Bharadwaj Kishore కవిత

మొన్న ఒకరోజు భారతదేశంలో వున్న నా స్నేహితునితో పిచ్చా పాటీ కాసేపటికి పిచ్చి-పోటీ అయి "త్త" సంయుక్తాక్షరంతో అంతమయ్యే పదాల వరుసలో మాట్లాడుకోవడం లోకి దిగింది. ఉదాహరణకు "ఏమిటి కొత్త - ఏముంది చత్త, ఉత్త....., అత్త...." వగైరా వగైరా. ఉన్నట్లుండి నేస్తం నన్నుద్దేశించి - "ఉత్త, మా అత్త, మత్తు, మీ అత్త" అన్న పదాలు ఉపయోగించి ఒక కందపద్యం వ్రాసి ఆతరువాతనే తనతో మాట్లాడమని ఠక్కున ఫోను పెట్టేశాడు. నాకు గొంతులో వెలక్కాయ పడింది కానీ ఈ ఛాలెంజీ సరదాగా బాగానే వుందనుకుని, కళ్ళుమూసుకుని ఇరవైనాలుగు గంటలూ వీణవాయించే ఆవిడను తలచుకుని రంగంలోకి దిగతే వచ్చిందిది - ఉత్తగడ౦బాలుపలికె మత్తునయున్నపుడుతెల్క మాయత్తికమీ యత్తయుతక్కువకాదుగ పుత్తడికాన్కని ఇత్తడిపూసలనిచ్చెన్ (ఒక అత్త డంబాలు పలికితే, ఇంకొకావిడ బంగారం అని చెప్పి ఇత్తడిపూసలనిచ్చింది) సరదాగా ఈ పద్యం వ్రాసిన తరువాత మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఆవిడ వీణవాయించడం ఆపేసి ఆడవాళ్ళంటే, అందునా ఆత్తలంటై మరీ లోకువైపోయారా నీకు - అన్నట్లు నా వైపు కొరకొర చూడడం చూసి భయం వేసి, ఆవిడను మచ్చిచేసుకునే ఉద్దేశ్యంతో మళ్ళీ మొదలు పెట్టాను ఉత్తమ విద్యలతొ సమా యత్తముచేసిన నినువిడి యాచి౦చితి మీ యత్తను స౦పదలాశను మత్తువదలినది క్షమి౦పు మమ్మ పుత్రునిన్ (విద్యలనొసగిన సరస్వతీదేవిని కాదని ఆమెకు అత్త - అంటే లక్ష్మీదేవిని యాచించినందుకు క్షమాభిక్షనివ్వమని వేడుకున్నాను) మరి ఆ తరువాత కళ్ళుమూసుకుంటే ఇంకేమి కనిపిస్తుందో - ఊహించండి

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWnOvg

Posted by Katta

Srinivasa Bharadwaj Kishore కవిత

మొన్న ఒకరోజు భారతదేశంలో వున్న నా స్నేహితునితో పిచ్చా పాటీ కాసేపటికి పిచ్చి-పోటీ అయి "త్త" సంయుక్తాక్షరంతో అంతమయ్యే పదాల వరుసలో మాట్లాడుకోవడం లోకి దిగింది. ఉదాహరణకు "ఏమిటి కొత్త - ఏముంది చత్త, ఉత్త....., అత్త...." వగైరా వగైరా. ఉన్నట్లుండి నేస్తం నన్నుద్దేశించి - "ఉత్త, మా అత్త, మత్తు, మీ అత్త" అన్న పదాలు ఉపయోగించి ఒక కందపద్యం వ్రాసి ఆతరువాతనే తనతో మాట్లాడమని ఠక్కున ఫోను పెట్టేశాడు. నాకు గొంతులో వెలక్కాయ పడింది కానీ ఈ ఛాలెంజీ సరదాగా బాగానే వుందనుకుని, కళ్ళుమూసుకుని ఇరవైనాలుగు గంటలూ వీణవాయించే ఆవిడను తలచుకుని రంగంలోకి దిగతే వచ్చిందిది - ఉత్తగడ౦బాలుపలికె మత్తునయున్నపుడుతెల్క మాయత్తికమీ యత్తయుతక్కువకాదుగ పుత్తడికాన్కని ఇత్తడిపూసలనిచ్చెన్ (ఒక అత్త డంబాలు పలికితే, ఇంకొకావిడ బంగారం అని చెప్పి ఇత్తడిపూసలనిచ్చింది) సరదాగా ఈ పద్యం వ్రాసిన తరువాత మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఆవిడ వీణవాయించడం ఆపేసి ఆడవాళ్ళంటే, అందునా ఆత్తలంటై మరీ లోకువైపోయారా నీకు - అన్నట్లు నా వైపు కొరకొర చూడడం చూసి భయం వేసి, ఆవిడను మచ్చిచేసుకునే ఉద్దేశ్యంతో మళ్ళీ మొదలు పెట్టాను ఉత్తమ విద్యలతొ సమా యత్తముచేసిన నినువిడి యాచి౦చితి మీ యత్తను స౦పదలాశను మత్తువదలినది క్షమి౦పు మమ్మ పుత్రునిన్ (విద్యలనొసగిన సరస్వతీదేవిని కాదని ఆమెకు అత్త - అంటే లక్ష్మీదేవిని యాచించినందుకు క్షమాభిక్షనివ్వమని వేడుకున్నాను) మరి ఆ తరువాత కళ్ళుమూసుకుంటే ఇంకేమి కనిపిస్తుందో - ఊహించండి

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gWnOv6

Posted by Katta

5, మార్చి 2014, బుధవారం

Srinivasa Bharadwaj Kishore కవిత

నా ముఖపుస్తకం ఫోటోలో నా బట్టతలపై చమత్కారంగా ఏదైనా వ్రాయమని ఒక స్నేహితుని సలహా మేరకు వ్రాసిన ఈ చిన్ని కవిత మిశ్ర నడక (స్వేచ్ఛావృత్తం) ప్రాసాక్షరం "డ" తోడునీడగనున్న నా పూ బోడి తలపుల నిండియుండగ పైడితీరున మెరసెనిటు నా బోడి తలయును చూడరే

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f4WI2q

Posted by Katta

9, ఫిబ్రవరి 2014, ఆదివారం

Srinivasa Bharadwaj Kishore కవిత

అమెరికాలో అట్లాంటా నగరంలో పరివార సమేతంగా స్థిరనివాసమేర్పరచుకున్న శ్రీనివాసుడు, శివాదుల నుద్దేశించి, ఛందోబద్ధంగా ఒక ధారలాగ వచ్చిన పద్యాలు ఇవిగో నచ్చి ఆనందిస్తే నాకు చెప్పండి. నచ్చకపోతే మరచిపొండి. పలుకుల తల్లికి నివాళి - వలసవచ్చిన దేవతలు రచన: కిభశ్రీ వృత్తం : చంపకమాల IIII UI UIII UII UII UI UI U III IUI UII IUI IUI IUI UIU 1, 11వ అక్షరాలకు యతి మైత్రి పలుకుల తల్లి నీ చరణ ప౦కజముల్ కడ నిల్చియు౦డి నా తలపుల నిన్ను యు౦చగ పదాలవె దొర్లెను గారడీవలెన్ ఖలుడను నాకునీవిధిని కైతలు ధారగ వచ్చెన౦టె నీ చలువనె కాకలేదు పద జాలము వాడెడి ప్రజ్ఞ నాకుగన్ తా:: సరస్వతీ దేవి కటాక్షము లేకుంటే, నాకెక్కడిది ఛందోబద్ధమైన కవిత వ్రాసేంతటి ప్రజ్ఞ సిరిపతి వీడిపాల్కడలి చేరెను ఈదరి రివ్రుడేలునన్ సరియగు సౌతులిర్వురును సంయమునుండిరి చేరి పెన్మిటిన్ నరుడిగ నారదు౦డు హరి నామములే నిరత౦ జపి౦చగన్ తిరిగె విమానమై తనివి దీరగ చుట్టును వైనతేయుడున్ తా:: విష్ణువు, పాలకడలి వదలి రివరుడేలులో వెలుస్తాడు. లక్ష్మీదేవి, ఆమే సవతి(భూదేవి) తో పతిని చేరి వుంటుంది. గరుడుడు జనులను మోసుకుని (airplanes) గోపురవీధులు (గోపురం - ఆకాశాన్నంటుతుంది - గోపురవీధులు - ఆకాశంలో వీధులు) (airplanes hovering around). నారదుడు నరుడిరూపంలో వస్తాడు. శివుడును వీడిపర్వతము సింహిక తోడుగ రాగ ధాత్రికిన్ భవునికి అండనుండగనిభాననుడింకను షణ్ముఖాదులున్ (అండగుండగను ఇభాననుడు) శివునగ నాగరాజుతనె సీ(చీ)కటిబిల్మున దూరె చల్లగన్ శివజటనున్నగ౦గయును శీతలధారల ఛాటహూచయెన్ తా: శివుడు లింగం రూపంలోను, పార్వతి, మోదలగు వారందరూ వస్తారు. శివునగ (శివుని నగ - ఆభరణం ) బిలంలోకి దూరాడు (we have lots of snakes in USA). గంగ (Chatahoochee river - అట్లాంటా జీవనది) దివివిడి ఇ౦ద్ర గ౦ధరువ దేవతలప్సరసాదుల౦దరున్ కవిజన గానకోవిదులు ఖ్యాతిని పొందిన నాట్య తారలై నవవిధ భకి్త భావములు నైగమ శాస్త్రము లన్ని నేర్వగన్ చవియగు మానవాకృతుల చైత్యము కూడిరి పర్వదిన్ములన్ (చవియగు - సరియగు, చైత్యము - గుడి) తా: స్వర్గంనుంచి ఇంద్రుడు మోదలగువారు కవులు, గాయకులు, నాట్యతారలుగ మానవరూపంలో మా వూళ్ళో వెలసినారు. జనులందరూ భక్తులై పూజలు గుళ్ళో చేస్తారు నేను వుండేవూరు - తాలహాసీ. అక్కడ గుడి కట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. పైని పద్యాలలో "రివ్రుడేలునన్" ను "తాలహాసినన్" అని, "చాటహూచయెన్" ను "ఓఖ్లఖూనయెన్" అని మార్చి, తాలహాసి కి కూడా అన్వయించుకోవచ్చు......

by Srinivasa Bharadwaj Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ksJXXl

Posted by Katta