కట్టా శ్రీనివాస్ || గ్లాసుల్లో ప్రపంచం ద్రవంనింపిన గ్లాసుగుండా ప్రపంచం ఒంపులు తిరుగుతూ ఒయ్యారాలు పోతుంటుంది వికృతంగా జడిపిస్తూ విహల్యులుగానూ చేస్తుంటుంది. అసలుదేదో దాచినట్లు కొత్తహంగుల్ని కప్పేస్తుంటుంది పారదర్శకతలోనూ నిండుతూ రంగుల చమక్కులు చూపిస్తుంది తడి పండుతూ మనసుకి లిమరిక్కులు వాక్కుల ఋత్విక్కులు వ్యవహార దృక్కులు వ్యాపార దక్షులు సర్వం సమ్మిళితానంద సందోహ సందర్బాలను కల్పిస్తుంటుంది. నింపుతున్న కొద్దీ ఖాళీనిజాల్ని బయటకు పొర్లిస్తుంది ఆక్సిటోసిన్* ప్రేమతో ముంచేస్తుంది. గానుగ గాటన పరుగులకు కిణ్వణాల ప్రోబయోట్స్ క్షణాలు కొన్ని వత్తిడుల వేడి విడదీసే వేళల్లో చల్లదనాల అనుసంధానంలా జ్ఞాపకాల వీచికలకు ‘తలపులు’ తెరుస్తూ చుట్టూ మడుసుల్ని అల్లుకుంటుంది. అయినా నానేస్తున్నకొద్దీ దారాల్నే ఊడలుగా బిగిస్తుంది. ► 13-03-2014 http://ift.tt/1fxpbD8 =పాదసూచిక ఇస్తున్నందుకు ఇప్పటికే ఈ విషయాలు తెలిసిన మిత్రులు మన్నించాలి. *ఆక్సిటోసిన్ :known as the “love hormone” because of its role in social bonding **కిణ్వణం ( Fermentation ) is a metabolic process that converts sugar to acids, gases and/or alcohol. ***Probiotics are micro-organisms that some have claimed provide health benefits when consumed.
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxpbD8
Posted by Katta
by Katta Srinivas
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fxpbD8
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి