ఉనికి __________ 1 సందర్భమెపుడూ తాత్కాలికంకాదు అది సర్వకాలికమే డేగ ఎదైనా కావొచ్చు దాని పీతాంబరం ఏదైనా కావొచ్చు గద్ద ఎక్కడిదైనా కావొచ్చు దాని రంగు ఏదైనా కావొచ్చు జంతుబుద్ధిని అతిశయించి దాని బుద్ధెప్పుడూ సిoహాసనమైనప్పుడు ఏ నిముషమైనా ఏ సందర్భమైనా ఏ కుక్క గొడుగైనా ఏ రాజ చత్రమైనా సర్వకాలికమే. కుక్కతోలు కప్పుకొనో ఆవుపొదుగు అంటించుకొనో శాలువాకప్పి భుజాన్ని కత్తిరించే డేగ చూపులోని తర్కమెప్పుడూ శాశ్వతమే. కాలంతో పాటు నడిస్తే చాలదు నిన్ను నువ్వు కప్పుకోక పోతే నీలాంటివాడిగుండెవు కాకపోతే నువు క్రీస్తు పూర్వమే గడ్డకట్టుకు పోయి వుంటావు నీనుంచినువ్వు వేరైపోయి తరలివెళ్లిపోయే నీటిచుక్క వౌతవో సాయOనిల్చే కాల్వ వౌతవో రూపయికంకితమయ్యే నీళ్ల డబ్బావౌతావో. నిప్పై మండిపోయి పొలాలన్నీ పూలుపండిద్దామనుకున్నాక ప్రశాంతతమరక కప్పి ఇప్పుడు ఉనికి దోపిడీకి గురౌతుంది ఓ మొగిలి చెర్లో ..ఓ బషీర్ బాగో ఓ లక్ష్మీపురమో..కారంచేడో ఇప్పటికిప్పుడు పోలవరమో ఉనికికోసం ఉనికినినలిపే ప్రయత్నం ఆకలికోసం అకలినిదోచే పాచిక ముల్లుని ముల్లుతోనే తియ్యాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి కుర్చీకి తెలిసిన సూత్రమింతే.
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pw0xch
Posted by Katta
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pw0xch
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి