పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sateesh Namavarapu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sateesh Namavarapu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Sateesh Namavarapu కవిత

***ఒక్కోసారి*** ఒక్కోసారి.. నదిపాయలా మొదలైన సాధారణ దుఃఖం సాంద్రత పెరిగేకొద్దీ అవుతుంది సముద్రం..!! ఒక్కోసారి.. సాదాగానే మొదలైన బతుకు నాటకం సమస్యల తోరణంగా మారి జీవితం రణరంగమవుతుంది..!! ఒక్కోసారి... అలలా పడిలేచే జీవితం అనుమానం వలలో పడి అవమానం రాక్షసికి అర్ధాయుష్షుగా సాగిలపడుతుంది..! ! ఒక్కోసారి... అప్పటిదాకా..అలవాటుగా ఒద్దికగా సాగే జీవితం, ఒద్దిక సా...గే జీవితం అనిపిస్తుంది..అకస్మాత్తుగ..!! ఒక్కోసారి... ఫలవంతం కాని కలలు మంచు పలకల్లా కరగిపోతే, మనసులో బడబానలం రగిలి.. భరించలేని దేహం చల్లబడుతుంది..!!..23జున్2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1m4EvoY

Posted by Katta

23, మార్చి 2014, ఆదివారం

Sateesh Namavarapu కవిత

***నవరత్నాలు*** కొందరిని కొన్ని అడిగి.., మరికొందరిని.. అడుగలేక, అవుతాము చులకన.! కొందరికి కొన్ని చెప్పి., మరికొందరికి..చెప్పలేక, అవుతాము పలచన.! కొందరిని కొన్ని అన్నందుకు.., మరికొందరిని..అనలేక బాధ పడతాము.! కొందరిచే కొన్ని అనబడినందుకు.., మరికొందరిచే.అనబడనందుకు చింతిస్తాము.! ఏ క్షణం ఆగిపోతామో తెలియని గడియారాలం, ప్రతీ క్షణం పోటీ పడి పరుగు తీస్తుంటాము.! మూడే కాలం ఎప్పుడో తెలియని మూర్ఖులం, నడిచే కాలం మనదే అని కాలర్ ఎగరేస్తాము.! కొన్ని సార్లు చెప్పలేని బాధ అని చెప్పుకుంటాము, చాలా సార్లు అది మనం సృష్టించుకున్నదే అని మరచి పోతుంటాము.! చేసేది మనమే, చేయబడేది మనవల్లనే.., బంధాలు తగిలించుకోవడం, విచ్చిన్నం చేసుకోవడం.! ఆకాశం అందుకునే తెలివితేటలు మనవే అంటాము, అవకాశవాదం ప్రదర్శించడంలో ..అంతే ముందు ఉంటాము..!!..23MAR2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NFRROX

Posted by Katta

14, మార్చి 2014, శుక్రవారం

Sateesh Namavarapu కవిత

***ఆత్మావలోకనం.*** నువ్వు పలకరించబోతే.. ఎదుటివారు దులపరించుకుంటే, నువ్వు ఆదరించగోరితే.. వారు చీదరించుకుంటే.. నీకు, వినసొంపుగా పలకరించడం రాక కాదేమో, వారి కంటగింపుగా..నీ వెనుక పరిస్థితులు కావచ్చు.! ఆత్మాభిమానం చంపుకొని,సహాయం కోరదలచినప్పుడు.. క్షోభతో నీ మనసు నలిగిపోవడం కనబడక కావచ్చు.! రోజువారీ వృత్తిలా అడుక్కునేవారికీ, సమస్యల వృత్తంలో ఇరుక్కున్న వారికీ.. తేడా గుర్తించలేక కావచ్చు..! తప్పని పరిస్థితిలో..తప్పని తెలిసినా, తిప్పలు తప్పవని హెచ్చరించిన మనసు చంపుకొని మరీ.. వారి మనసు అందనంత చేయి సాచావేమో ఎప్పుడైనా.. సాయం చెయ్యకున్నా.. అడిగిన పాపానికి అనర్హుల జాబితాలో చేరావేమో..? ..చేసినప్పుడు, ప్రతిఫలంగా నువ్వేమీ చేయలేనప్పుడు..లాభం లేదనుకున్నారేమో..?? అది సరేగానీ..ఇదే పరిస్థితి.. నీ వల్ల ఇంకెవరైనా అనుభవించారేమో.. నీ గుండె కోత సాక్షిగా.. మనసు లోతుల్లోకి తరచి చూసుకో ఓ సారి..!!..14MAR2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1o1ICGe

Posted by Katta

13, మార్చి 2014, గురువారం

Sateesh Namavarapu కవిత

***అది అంతే..!!*** కొందరిని కలిసినప్పుడు కొన్ని మాట్లాడలేము, కొన్ని మాట్లాడితే కొందరిని మళ్ళీ కలవలేము.! కొందరికి బతికి ఉండగా కొన్ని చెప్పలేము, కొన్ని చెబితే..కొందరితో బతికి ఉండలేము.! కొందరు చూసినప్పుడు కొన్ని దాచకుండా ఉండలేము, కొందరు దాచినా ..కొన్ని చూడకుండా ఉండలేము.! కొన్ని చూపులు గుచ్చుతాయని కవచాలు తొడగలేము, తొడిగినా.. కొన్ని గుచ్చుకోకుండా ఆపలేము...! మనసుకు నచ్చినప్పుడు మెచ్చుకోకుండా ఉండలేము, మెచ్చుకున్నవి అన్నీ మనకు నచ్చినట్లు ఉంటాయని ఆశించలేము.! కొన్నిసార్లు మాట్లాడినప్పుడు నవ్వించగలము, కొన్నిసార్లు నవ్వించబోయి నవ్వులపాలు కాగలము.! ఇలా లాభం లేదని "త్రిశంకు స్వర్గం" సృష్టించలేము, ఎందుకంటే ఉన్నది, బతుకూ..చావూ కాని నరకంలో కాబట్టి..!!..13MAR2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc1BS

Posted by Katta

9, మార్చి 2014, ఆదివారం

Sateesh Namavarapu కవిత

***జీవితం*** జీవితంలో అన్నీ కష్టాలే అనుభవించామనుకుంటే.. సుఖాలు ఇంకా మిగిలి ఉన్నాయనీ, అన్ని సుఖాలూ అనుభవించామనుకుంటే.. ఇకపై కష్టాలు ఎదురు చూస్తున్నాయనీ గుర్తు.! కష్టసుఖాలు రెండూ కలగాపులగంగా అనుభవించాల్సిందే అనుకుంటే.. జీవితమంటే జంట కవిత్వమనీ.. జీవితమంటే.నిరంతరం ప్రవహించాల్సిన విద్యుత్తు అనీ.. జన్మతోనే సంక్రమించే విద్వత్తు అనీ.. ధన,ఋణ ఆవేశాలు రెండూ లేకుండా జీవితం "బల్బు" వెలగదనీ అర్ధమౌతుంది..!!..09MAR2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iqk2zJ

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Sateesh Namavarapu కవిత

***జ్ఞాపకాలు*** అగ్నికీలలై దహిస్తూ కొన్ని, ఆగని వరదై తడిపేస్తూ మరి కొన్ని! మనసు మండిస్తూ కొన్ని, మనసు పండిస్తూ మరి కొన్ని.! పరవశింపజేస్తూ కొన్ని, పరిహసింపజేస్తూ మరి కొన్ని.! తగిన వ్యాపకం లేకుంటే..శక్తి పెంచుకుంటూ కొన్ని, తగ్గిన శక్తితో..మెదడు బూడిదలో కప్పబడుతూ మరి కొన్ని.! దెబ్బ తగిలితే మరుగున పడేవి కొన్ని, గత జన్మల్లోనుండీ బయటపడేవి మరి కొన్ని.! కాలక్షేపం నెమరువేతకు కొన్ని, కాణీ ఖర్చు లేని వినోదాన్నిచ్చేవి మరి కొన్ని.! ఉబుసుపోక ముసురుతూ కొన్ని, ఉసురు తీసేలా కసురుతూ మరి కొన్ని.! ఉరుముల్లా ఉరుముతూ..భయపెడుతూ కొన్ని, మెరుపుల్లా మెరుస్తూ..మురిపిస్తూ మరికొన్ని..!!..08MAR2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dB4BjR

Posted by Katta

20, ఫిబ్రవరి 2014, గురువారం

Sateesh Namavarapu కవిత

***ధన్యం*** పుట్టుక మొదటి పేజి చావు చివరి పేజి మధ్యలో బతుకంతా రాజీ..! మొదటి పేజి నీ సొంతం కాదు చివరి పేజి నీ సంతకం ఉండదు. మద్యలో..మిథ్యలోనే.. నీకు ఇష్టమైన రాత రాసుకో, జీవన వనంలొ.. నీకు ఇష్టమైన కోత కోసుకో.! కలల డాలు అడ్డుపెట్టి, కఠినమైన నిజం కత్తిదెబ్బ కాచుకోలేవు.! ఉత్తినే మొరిగే కుక్కలను మెత్తగా జవాబు చెప్పి నోరు మూయించలేవు...! ఒకప్పుడు రాజీ పడని రాజులా బతికానని, ఇక ఎప్పటికీ మాజీ కాబోనని భ్రమపడకు.! మొదటి పుటనుండి,చివరి పుట దాకా.. ఆపకుండా చదివించగలిగితే నీ బతుకు పుస్తకం.. నీ జన్మ ధన్యం..!!..20FEB2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gYwanA

Posted by Katta

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Sateesh Namavarapu కవిత

***ఒక్కోసారి..జీవితం..!!*** చిత్రంగా కనిపిస్తుంది, విచిత్రంగా వినిపిస్తుంది! చిత్రంగా తోస్తుంది, చీత్కారంగా కోస్తుంది.! హద్దులుగా కనిపిస్తుంది, అన్ని ఎల్లలు దాటేస్తుంది.! అసహజంగా కనిపిస్తుంది, అసహనంగా మారుస్తుంది.! ఏమరుపాటుగా ఉన్నామనిపిస్తుంది, తెలియకుండానే ఏమారుస్తుంది.! కలల వర్షమై కురుస్తుంది, కల్లలై, కన్నీరై ప్రవహిస్తుంది.! విడ్డూరంగా కనిపిస్తుంది, వైఢూర్యంగా ప్రభవిస్తుంది.! ఎంతో వింతగా కనిపిస్తుంది, అంతలో చింతల పంజా విసురుతుంది.! మనకే సొంతం అనిపిస్తుంది, మనని మనకు కాకుండా చేస్తుంది.! వండిన పదార్ధమైనా, ఉన్నదేదైనా, భావం కలిపితే..నైవేద్యమవుతుంది.! ఉన్నవన్నీ పోయిన నాడు, మిగిలి ఉన్నదేదో..సత్యమవుతుంది..!!..11FEB2014

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NwHVIk

Posted by Katta

3, ఫిబ్రవరి 2014, సోమవారం

Sateesh Namavarapu కవిత

***అర్ధం కాని "అర్ధం"*** తట్టుకోలేని కష్టం కాటేస్తే.. ఆపలేని..కురిసే వర్షం..కన్నీరు.! పట్టరాని సంతోషం వాటేస్తే.. ఓపలేని..మురిసే హర్షం..భాష్పాలు.! ఏదైనా వండి వార్చేది, నయనద్వయమేనా..? కష్టమైనా, సుఖమైనా.. సమాన న్యాయమేనా..?? స్పందించే మనసు సంధించే భావ శరాలకు అనుగుణం, అందించేను జల ధారలు.. అదే కనుల అద్భుత గుణం. అందరికీ గెలవాలనే ఉంటుంది బతుకు యుధ్ధం.! కానీ ఓడే వారు ఎక్కువ.! గెలుపూ, ఓటమీ కాకుండా, బతుకూ, చావూ కాకుండా.. ఏడవలేక నవ్వుతూ, నవ్వలేక ఏడుస్తూ.. బతుకీడ్చేవారూ ఎక్కువ..!! నేటి బతుకు "ఖర్మ" నిన్నటి "కర్మ" ఫలితమా, మొన్నటి జన్మ ఫలం.. పాపం అవశేషాల మిళితమా..?? అర్ధం కాక అయోమయంలో.. జన్మలెన్ని గడచిపోయాయో, "అర్ధం" లేక అవమానంతో.. బతుకులెన్ని బండబారిపోయాయో..?? సామర్ధ్యం లేదని, వ్యర్ధమని తలచి గుండెలెన్ని పగిలాయో..?? లెక్క తేల్చేదెవరు..? దిక్కు చూపేదెవరు..??..01Fఏభ్2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fwQKvm

Posted by Katta

1, ఫిబ్రవరి 2014, శనివారం

Sateesh Namavarapu కవిత

***అర్ధం కాని "అర్ధం"*** తట్టుకోలేని కష్టం కాటేస్తే.. ఆపలేని..కురిసే వర్షం..కన్నీరు.! పట్టరాని సంతోషం వాటేస్తే.. ఓపలేని..మురిసే హర్షం..భాష్పాలు.! ఏదైనా వండి వార్చేది, నయనద్వయమేనా..? కష్టమైనా, సుఖమైనా.. సమాన న్యాయమేనా..?? స్పందించే మనసు సంధించే భావ శరాలకు అనుగుణం, అందించేను జల ధారలు.. అదే కనుల అద్భుత గుణం. అందరికీ గెలవాలనే ఉంటుంది బతుకు యుధ్ధం.! కానీ ఓడే వారు ఎక్కువ.! గెలుపూ, ఓటమీ కాకుండా, బతుకూ, చావూ కాకుండా.. ఏడవలేక నవ్వుతూ, నవ్వలేక ఏడుస్తూ.. బతుకీడ్చేవారూ ఎక్కువ..!! నేటి బతుకు "ఖర్మ" నిన్నటి "కర్మ" ఫలితమా, మొన్నటి జన్మ ఫలం.. పాపం అవశేషాల మిళితమా..?? అర్ధం కాక అయోమయంలో.. జన్మలెన్ని గడచిపోయాయో, "అర్ధం" లేక అవమానంతో.. బతుకులెన్ని బండబారిపోయాయో..?? సామర్ధ్యం లేదని, వ్యర్ధమని తలచి గుండెలెన్ని పగిలాయో..?? లెక్క తేల్చేదెవరు..? దిక్కు చూపేదెవరు..??..01Fఏభ్2014.

by Sateesh Namavarapu



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fwQKvm

Posted by Katta