పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మార్చి 2014, గురువారం

Thilak Bommaraju కవిత

తిలక్/నూనె మరీచిక --------------------­---------- ఇక ఇప్పుడిక్కడ కొన్ని ఎడారులు నిశ్చింతగా నడుస్తున్నాయి ఎవరిని ఉద్దేశించని పదార్థంలా నేలపై తేలియాడే కొన్ని నూనె సెలయేళ్ళు సమర్థ వేగంతో ఇక ఎప్పటికి ఇంకిపోకుండా కళ్ళ జలపాతాలు మనసు ముచ్చట్లు ఎన్ని శిధిలాలో అక్కడక్కడా పరుచుకున్న కొన్ని అచ్చులు సంతృప్తంగా కరగని కొన్ని ద్రావణపు రాత్రులు వెన్నెల మధువులు తాగిన కొండ కళేభరాలు దాంపత్యం అలవాటుకాని వసంతపు శిశిరాలునూ కొన్ని క్షణాలు వెతుకుతూ కొన్ని క్షణాలు నడుస్తూ.... అయినా లభ్యం చేసుకోలేని ఇంకాసిని మరీచికలు. తిలక్ బొమ్మరాజు 13.03.14

by Thilak Bommaraju



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/O5ZWwY

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి