పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Kumar Varma K K లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kumar Varma K K లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జూన్ 2014, గురువారం

Kumar Varma K K కవిత

కెక్యూబ్ వర్మ ॥ వెదురు గాయం ॥ రాశి పోసావిన్ని పూలను కానీ నా కనులకు నెత్తురంటిన జేగురు చెమ్మ తగిలి గాయం రేగుతోంది పదాల మధ్య అతకని దారమేదో తెగుతూ నిశ్శబ్దాన్ని మెత్తగా కోస్తోంది ఆకులన్నీ రాలుతున్న చప్పుళ్ళ మధ్య ఒకింత ఖాళీ ఏర్పడి గాలి ఊసులేవొ గుసగుసగా రాతి పొరలమధ్య నీ ఉలికి చెందని శిల్పమేదో ఆవిష్కృతమవుతోంది నెమ్మదిగా ఈ మట్టి వేళ్ళ మధ్య పారే నీటిని దోసిలితో పట్టి గాయపడ్డ ఈ వెదురు గొంతులో ఒంపి పాటగా సాగిపో..

by Kumar Varma K K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1xa8mWr

Posted by Katta

24, మే 2014, శనివారం

Kumar Varma K K కవిత

కెక్యూబ్ వర్మ ॥ దేహం విరమించిన వేళ ॥ దీపస్తంభాన్నెవరో ఎత్తుకు పోయినట్టున్నారు ఈ గోడ చీకటి నీడ కప్పుకుని వుంది కాళ్ళు రెండూ ముడుచుకుని డొక్కలోకి తన్నిపెట్టి ఆకలిని చంపుతూ చినిగిన దుప్పటి యింత వెన్నెలను లోపలికి చొరబెడుతూ చల్లని స్పర్శనేదో ఒకింత పులుముతున్నట్టుంది చిన్నగా మెలకువని మింగి ఏదో మగతనిద్రలో కలవరిస్తూ దేహాన్ని విరమించిన వేళ కాసింత విశ్రాంతిని మిగిల్చి ముసురుకున్న కలల కత్తి అంచు మీద మనసు నాట్యం చేస్తూ ఊపిరి స్వరం నెమ్మదిగా చివరి వత్తినంటిన చమురులా ఈ అసంపూర్ణ పద్యాన్నిలా కత్తిరించి కాసేపు గాలిపటంలా ఎగరేసి తోకచుక్కను తాకాలని ఓ అసహజ ప్రయత్నమేదో చేయబూనుతూ (తే 24-04-2014 దీ)

by Kumar Varma K K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mj5MYn

Posted by Katta

19, మార్చి 2014, బుధవారం

Kumar Varma K K కవిత

కెక్యూబ్ వర్మ ॥ వాడో నవ్వుల దీపం ॥ వాడెప్పుడూ అలా నవ్వుతూనే వున్నాడు బాల్యం నుండి ఈ రోజు వరకు వాడెప్పుడూ అలా వెన్నెలలా తెల్లగా నవ్వుతూనే వున్నాడు దేహమంతా నరాలుదేరి కొవ్వన్నదే పట్టని పక్కటెముకలతో నల్లగా నిగ నిగ లాడుతూ వాడెప్పుడూ అలా ఇరిడి బొమ్మలా నవ్వుతూనే వుంటాడు మట్టిని పిసికి మట్టిని పీల్చి మట్టిని తిని మట్టితోనే బతుకంతా పెనవేసుకుంటూ వాడెప్పుడూ అలా మట్టి దీపంలా నవ్వుతూనే వుంటాడు నాతో పాటుగా వాడి వయసూ పెరుగుతూనే దూరంగా పోతున్న నన్ను చూసి వాడు అలా నిటారుగా ఆకుపచ్చ చందమామలా నవ్వుతూనే వున్నాడు వాడలా నవ్వుతూ వున్న సమయమే నాకెప్పుడూ మరో వసంతాన్ని హామీ యిస్తూ వాడితో పాటు నేనూ నవ్విన క్షణం నాలో వేయి దీపాలను వెలిగిస్తాడు (తే 18/03/2014 దీ 10.20 PM)

by Kumar Varma K K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OtvBJ4

Posted by Katta

13, మార్చి 2014, గురువారం

Kumar Varma K K కవిత

కెక్యూబ్ వర్మ ॥ పాత చొక్కా॥ అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు బస్సెక్కేటప్పుడు తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన దేహానికి తన బిగువులో కాసింత సేద దీరుస్తున్నట్టు ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!! (తే 13/03/2014 దీ 08.09 PM )

by Kumar Varma K K



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc5BF

Posted by Katta