పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Madhav Murthy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Madhav Murthy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మార్చి 2014, గురువారం

Madhav Murthy కవిత

ఎదురు చూపు నిను చూస్తూ ఉంటే కళ్ళల్లో .. నువ్వు నిలిచావే నా గుండెల్లో.. నీ రూపాన్నే ఒక శిల్పంగా నా గుండెల్లో నింపుకొని నిన్నే ప్రేమిస్తున్నట్టు నీకోసం నేనున్నట్టు నా ప్రేమ కథ నే చెబూతూ ఉంటే.. నాలో నువ్వున్నావంటూ నీకోసం ఉంటానంటూ అని నువ్వే చెప్పేస్తూ ఉంటే. నా ఆశ ఏమో ఆకాశాన్ని . మనసు ఏమో భూలోకాన్ని. విస్తరించి నా ప్రేమకథ నే చెప్పేస్తూ ఉంటే.. ఏ నాడు లేని సంతోషం తో... ఎన్నడు చూడని ఆనందం తో .... కళ్ళు తెరచి చూడగానే...., కళ్ళలోని కల ఏమో కన్నీరై కారుతుంటే.. మనసులోని ప్రేమ ఏమో మౌనంగా మారుతుంటే.. చిన్ననాటి ఆ స్నేహమే.. చిన్ననాటి ఆ భావమే ... కన్నీళ్లను తుడిచింది... గుండెల్లో నిలిచింది... ప్రేమ కోసం ఎదురేదురే చూస్తుంది... మాధవ (13/03/2014)

by Madhav Murthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOLzZl

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Madhav Murthy కవిత

మనకి జన్మనిచ్చేది... బాల్యంలో నడక నేర్పేది.. యుక్తవయసులో ప్రేమను తెలిపేది.. యవ్వనం లో జీవితాన్న్ని పంచుకునేది... వృద్దాప్యం లో సేద తీర్చేది.. మగాడి జీవితానికి అర్ధం లా నిలిచేది..మహిళ. మాధవ - 8/3/2014

by Madhav Murthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Pbztit

Posted by Katta

6, మార్చి 2014, గురువారం

Madhav Murthy కవిత

నిజమే - నిన్ను చూసింది క్షణమే ... చిలిపిగా నన్ను చూసింది .., చిలిపిగా నువ్వు నవ్విందీ.. క్షణమే. అనుక్షణం నేను తలచుకునేది ఆ క్షణమే .. నాకు ఆనందమంటే ఏంటో తెలిసింది ఆ క్షణమే ... నీ నవ్వును నే మరువలేను... నీ నడకను నే మరువలేను... నీ రూపుని నే మరువలేను.. నీ చూపుని నే మరువలేను... మచలేని నీ మనసుని నే మరువలేను .. మోనాలిస లాంటి సొగసుని నే మరువలేను... కల్మషం లేని నీ కన్నుల బాష ని నే మరువలేను... కలలా వచ్చే నీ జ్ఞాపకాన్ని నే మరువలేను... నిను చేరుటకు యుద్దమైన చేయగలను... వద్దనుకొని మాత్రం తిరిగి వెళ్ళలేను... ప్రేమ నువ్వు కనిపిస్తే అడగాలనుంది... నన్నెందుకు చేరావని... చేరాక ఒంటరిగా ఎందుకు వదిలి వెళ్ళావని..

by Madhav Murthy



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1duJLma

Posted by Katta