పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!. ‎
Sreedhar Babu Pasunuru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sreedhar Babu Pasunuru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఏప్రిల్ 2014, శనివారం

Sreedhar Babu Pasunuru కవిత

"The Wolf of the Wall Street" -- పసునూరు శ్రీధర్ బాబు చెప్పకూడనివి చెప్పాలనిపిస్తుంది దాచుకోవాల్సినవి చూపించాలనిపిస్తుంది చచ్చేదాకా బతికేందుకు ఇన్నేసి రహస్యాలను కాపాడాల్సిన దౌర్భాగ్యమేమిరా దేవుడా? చీకటిలో తెరుచుకున్న రంగస్థలం మీద రహస్యాలభంజికలతో రాజుకుని మాడి మసైపోయి పొగల సెగల ఆనవాళ్ళతో లుంగలు చుట్టుకుపోతూ ఏదేదో రాసేయాలనిపిస్తుంది నెత్తుటి వెలుతురులో దుఃఖపు చీకటి అక్షరాలతో.. కోర్కెల రాత్రిలో మసిలే కన్నీటి వ్యాకరణంతో.. ఒక బ్లాక్ కామెడీ.. కరెన్సీ నోట్ల మీద కెలికేసి నలిపేసి… చెత్తబుట్టలో పారేసి- చెత్తబుట్టలు టేబుల్ కిందే ఉండవు.. లేబిల్ లేకుండా లోపల్లోపల నోరు తెరుచుకుని చూస్తూనే ఉంటయ్.. దీర్ఘాలోచనల నిట్టూర్పులను బుసకొడుతూ జుర్రుకునేందుకు- ముసలాడు మార్టిన్ స్కోర్సీస్ ఎప్పటికీ ఓ పాతికేళ్ళ తోడేలు భయపెడుతున్నాడు ముసుగులన్నీ పరపరా చింపేసి- సిగ్గుతో చచ్చిపోతున్నామిక్కడ.. వలువలన్నీ తీసేస్తుంటే.. విలువలు లేని బతుకులు తట్టుకునేదెట్లారా? టెడ్డీ బేర్ కన్ను ఆవురావురుమంటూ ప్రియురాలి రహస్సౌందర్యంలోకి చొరబడి చొంగకారుస్తుంటే.. ముక్కుపుటాలదిరేలా మాదక ద్రవ్యాన్ని మస్తిష్కంలోకి పీల్చుకున్నాక నైతికత ఒక అస్పష్ట కళాఖండం.. ఆధునిక దృశ్య కావ్యం… ‘ఓహ్… ఐ జస్ట్ కేమ్.. డిడ్ యూ?’ *** ఫిబ్రవరి, '14 (మార్టిన్ స్కోర్సీస్ చిత్రం "ది వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్" చూసింతర్వాత)

by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nNRS07

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

Sreedhar Babu Pasunuru కవిత

"మళ్ళీ మరొక్కసారి ప్రేమ గురించి..." -- పసునూరు శ్రీధర్ బాబు మరొక్కసారి ప్రేమ గురించి మళ్ళీ మళ్ళీ మరొక్కసారి వెళ్ళిపోయిన ప్రేమ గురించి రాలిన పూవు మట్టిలో కలిసిపోతుంది వాలిన చూపు ఎక్కడో నాటుకుపోతుంది కురిసిన వర్షం వంకలో వాగులో చివరకు సముద్రంలో కలిసిపోతుంది తడిసిన దేహం చివరి నిట్టూర్పు దాకా వణుకుతూనే ఉంటుంది పొద్దుటి వెలుగు మీదకు చీకటి తరుముకొస్తుంది చీకటి పంచిన కలలను ఏ వెలుగు తుడిచేయగలుగుతుంది? శిశిరానికి కానుకైన మొదటి హరిత పత్రం వసంతాన్ని స్మరిస్తుందా.. స్వప్నిస్తుందా? నిన్నటి రాత్రి నేటి రాత్రి ఒక్కటి కాదు నిన్నటి వెన్నెల ఇవాళ్టి వెన్నెల వేరు వేరే మధ్యలో ఈ కాలం గొడవేమిటి నేనెప్పుడో నీదారి నీదే నాదారి నాదే అని చెప్పింతర్వాత! గుండ్రని భూమికి ధిశలేమిటి? ఎటు వెళ్ళినా నేను ముందుకే వెళ్తాను- నా జీవితాన్ని నేను ఇటు నుంచి అటూ అటు నుంచి ఇటూ జీవిస్తాను ఎటు వెళ్ళినా ఇక్కడికే వస్తానో లేక ఎక్కడికైనా పోతానో? ఏమైతేనేం? నేను నా కాలం నా ప్రాణం నా ప్రయాణం ఒక్కటే అయినప్పుడు! ఏమైపోతేనేం? నేను నా గానం నా గాయం నా జ్ఞాపకం వెన్నంటే వస్తున్నప్పుడు! అందుకే మరొక్కసారి ప్రేమ గురించి ప్రతిక్షణాన్ని ప్రతీక్షణంతో వెలిగించి వెళ్ళిపోయిన ప్రేమ గురించి వెళ్ళిపోయిన ప్రేమ వెంటే వెళ్ళిపోయిన నాగురించి శిలువ మీద క్రీస్తులా కాగితాల మీద అక్షరాలుగా వేలాడే క్షణాల గురించి మళ్ళీ మరొక్కసారి నావెంటే వెళ్ళిపోయిన ప్రేమ గురించి...! *** (24 ఏప్రిల్ 2014)

by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nJimzZ

Posted by Katta

Sreedhar Babu Pasunuru కవిత



by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1npx5Ta

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

Sreedhar Babu Pasunuru కవిత

"మల్లెపువ్వు" -- పసునూరు శ్రీధర్ బాబు ఒక మల్లెపువ్వు ఈ రాత్రి కిటికీలోంచి తారకలా వచ్చి పలకరించింది వెలుతురు భాషలో మాట్లాడుతూ నా కళ్ళల్లో కొన్ని మిణుగురుల్ని వెలిగించింది తెల్లని మౌనంలా సిగ్గుపడుతూ నా చెవుల్లోకి ఒక ప్రేమకవితను ఒంపింది ఒక ఇంధ్రధనుసు ఈ అర్థరాత్రిలో వెచ్చని పైట చెంగులా నా ముఖాన్ని నిమురుతూ వెళ్ళిపోయింది మల్లెపువ్వు నా భుజం మీద వాలి వెళ్ళిపోయిన కాలంలోని వెలిగిన క్షణాలను నా దోసిట్లో పోసింది రెక్కల గుర్రం మీద ఎవరో దేవకన్య నిరుటి జన్మ స్నేహంలా ఎదుట వాలింది పెదాల మీద తలకిందులుగా వాలిన మల్లెపూవు గుండెలో నలిగి మలిగిన పాత పాటనొకదాన్ని సన్నని తీగలా బయటకు లాగింది అది చీకటి కొలనులో వెన్నెల వలయాలుగా కంపించి కనుమరుగైంది అరిచేతిలో ప్రేయసి చుబుకంలా ఒదిగిన ఆ మల్లెపూవు నిశ్శబ్దం వెచ్చగా గుబాళించడమంటే ఏమిటో చూపించింది మౌనం ఎంత లయాత్మకంగా కల్లోలపరుస్తుందో అనుభవంలోకి తెచ్చింది ఆ మల్లెపూవును అలాగే గుప్పిట్లో దాచినప్పుడు ఆకాశమంత జ్ఞాపకం చల్లని దీపంలా నన్ను లోలోపల వెలిగించింది- దాన్ని కదిలిస్తే.. మువ్వల శబ్దం ఎద మీద హత్తుకుంటే... శంఖపు హోరు అది చీకట్లో తేలుతూ ఏకాంతంలోకి చొరబడుతుంటే నాలో తలుపులు తెరుచుకుంటున్న చప్పుడు- కుంటాల జలపాతంలా నేను నాలోకే దుముకుతున్నప్పుడు ఎగిరే నీటి నురగల మీద తుళ్ళిపడుతూ గంతులేస్తూ మురిసిన ఆ సిరిమల్లి మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోయింది- వీడ్కోలు గాయం చేయకుండా వెళ్ళిపోగల మహత్యం దానిది- ఈసారి వచ్చేటప్పుడు తన తోటనంతా తీసుకువస్తానంది అప్పుడు నక్షత్రాల ఆకాశం తలకిందులై నన్ను తన మీద నడిపిస్తుందేమో చూడాలి- *** (2-11 ఏప్రిల్ 2014)

by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwB0N0

Posted by Katta

13, మార్చి 2014, గురువారం

Sreedhar Babu Pasunuru కవిత

"On a River Bank" - Origin (Telugu): Pasunuru Sreedhar Babu Translated by: Elanaaga What’s there on a river bank? Perhaps a few teardrops left by someone A few faint quartered conversations Some abandoned faces of loneliness Circles of grief furrows in sand. What else is there on a river bank? Some arid melancholy blended and soaked In the rippling sounds of flowing river What more are there on river bank? On a river bank there are Multi coloured pebbles Broken snail shells Footprints carrying tinkles of anklets Lamps of moonlight assembled on noon clouds Is that all? No. On a river bank There’s a nameless sweetheart A buddy without own place A celestial embrace And a surreal handshake Besides these There’s also a frisky river which unmindful of all these flows gleefully ***

by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ewc3d1

Posted by Katta

6, ఫిబ్రవరి 2014, గురువారం

Sreedhar Babu Pasunuru కవిత

"The Wolf of Wall Street" -పసునూరు శ్రీధర్ బాబు .... చెప్పకూడనివి చెప్పాలనిపిస్తుంది దాచుకోవాల్సినవి చూపించాలనిపిస్తుంది చచ్చేదాకా బతికేందుకు ఇన్నేసి రహస్యాలను కాపాడాల్సిన దౌర్భాగ్యమేమిరా దేవుడా? చీకటిలో తెరుచుకున్న రంగస్థలం మీద రహస్యాలభంజికలతో రాజుకుని మాడి మసైపోయి పొగల సెగల ఆనవాళ్ళతో లుంగలు చుట్టుకుపోతూ ఏదేదో రాసేయాలనిపిస్తుంది నెత్తుటి వెలుతురులో దుఃఖపు చీకటి అక్షరాలతో.. కోర్కెల రాత్రిలో మసిలే కన్నీటి వ్యాకరణంతో.. ఒక బ్లాక్ కామెడీ.. కరెన్సీ నోట్ల మీద కెలికేసి నలిపేసి... చెత్తబుట్టలో పారేసి- చెత్తబుట్టలు టేబుల్ కిందే ఉండవు.. లేబిల్ లేకుండా లోపల్లోపల నోరు తెరుచుకుని చూస్తూనే ఉంటయ్.. దీర్ఘాలోచనల నిట్టూర్పులను బుసకొడుతూ జుర్రుకునేందుకు- ముసలాడు మార్టిన్ స్కోర్సీస్ ఎప్పటికీ ఓ పాతికేళ్ళ తోడేలు భయపెడుతున్నాడు ముసుగులన్నీ పరపరా చింపేసి- సిగ్గుతో చచ్చిపోతున్నామిక్కడ.. వలువలన్నీ తీసేస్తుంటే.. విలువలు లేని బతుకులు తట్టుకునేదెట్లారా? టెడ్డీ బేర్ కన్ను ఆవురావురుమంటూ ప్రియురాలి రహస్సౌందర్యంలోకి చొరబడి చొంగకారుస్తుంటే.. ముక్కుపుటాలదిరేలా మాదక ద్రవ్యాన్ని మస్తిష్కంలోకి పీల్చుకున్నాక నైతికత ఒక అస్పష్ట కళాఖండం.. ఆధునిక దృశ్య కావ్యం... 'ఓహ్... ఐ జస్ట్ కేమ్.. డిడ్ యూ?' ..... (12.35 a.m. ఫిబ్రవరి 4, 2014)

by Sreedhar Babu Pasunuru



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1k6NASF

Posted by Katta