గ్రీష్మం క్రొత్త సంవత్సరానికి ఆహ్వనం పలికి రాశిఫలాలు తెలుసుకుంటూ వెలుగురేఖలు వెల్లి విరియాలని ఆశ పడతారు కాలపురుషుని కదలికలతో ఋతువుమారి ప్రక్రుతిమాత ఒడిలోకి గ్రీష్మం కోయిల కుహుకుహు గానంతో చిగురాకుల చిరు సవ్వడితొ గ్రీష్మానికి అహ్వనం పలికాయి మల్లెలు గుబాళింపులు పలుకరిస్తూ మధుర ఊహలు మోసుకొస్తాయి మామిడిపండ్ల కమ్మదనాలు ఆవకాయ,మాగాయ పచ్చళ్ళతో హదావిడి ఎండవేడిమి తాళలేక పుచ్చపండ్లూ,తాటి ముంజలను ఆశ్రయిస్తూ తడి ఆరిపోయే గొంతులు కొబ్బరి నీళ్ళు పండ్లరసాలు పుచ్చుకుంటూసేద తీరుతాయి చిన్నారులకు వేసవి సెలవుల ఉత్సాహంఆటపాటలతో అల్లరి చేస్తూ తాత బామ్మల తో ముచ్చటిస్తూ విహారయాత్రకు ఉరకలు వేస్తారు దినకరుని ప్రచండతేజం ప్రతాపంతో బీడుబారిన పంటపొలాలు ఏడారులని తలపిస్తాయి ఎండిపోయిన నేల తల్లి నీటికోసం తల్లడిల్లి నోళ్ళు తెరిచి తడిసిపోవాలని తపిస్తుంది ఆకురాలిన చెట్లకొమ్మలు చిగురించాలని చినుకుకోసం ఎదురుచూస్తాయీ vani koratamaddi 12/3/2014
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOtqe4
Posted by Katta
by Vani Koratamaddi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oOtqe4
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి