#మను# కంపెని రక్కసి # అప్పుడెప్పుడో మన దేశంలో కంపెనీ పాలన ఉండేదని విన్నాం ఇప్పుడు కంపెనీల పాలనను చూస్తున్నాం కంపెనీల కాలచక్రంలో సామాన్యుడి జీవితం సొట్టబోయింది కార్పోరేట్ల నీడలో కష్టజీవి కాలిపోతున్నాడు ప్రభుత్వ పెరేడ్లో కంపెనీలు కవాతు చేస్తున్నాయి గ్లోబలైజేషన్ రైతుల వెనక గోతులు తవ్వుతుంటే పారిశ్రామికీకరణ పచ్చటి పొలాల్ని మింగేస్తోంది అమెరికాలో ఆర్ధికమాంద్యమొస్తే అనకాపల్లి బెల్లం చేదెక్కుతోంది వాల్ మార్ట్ దేశీ వ్యాపారుల తోలు తీస్తుంటే దేశీ "కోల్" గేట్లు ఆర్ధికమూలాల్ని కోసేస్తున్నాయి మహాత్ముడు కలలుగన్న గ్రామరాజ్యం కార్పోరేట్లకు భోజ్యంగా మారింది ప్రపంచీకరణ ఫలితం పేదవాడిన పచ్చడిమెతుకులకు దూరం చేస్తోంది కాబట్టి ఎన్ని'కల'లో నిద్రపోతున్న నాయకులూ ..... ఇకనైన కాకలు తీరిన కార్పోరేట్లను కాకుండా కడుపు కాలే సగటు జీవిని కనికరించండి 13.03.14
by Katika Manohar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTQo1M
Posted by Katta
by Katika Manohar
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTQo1M
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి