పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Maddali Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Maddali Srinivas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జూన్ 2014, శనివారం

Maddali Srinivas కవిత

కింకర్తవ్యం?//శ్రీనివాస్//21/06/2014 --------------------------------------------------------------- మాయదారి మణికట్టు గడియారం కనికట్టు నేర్చిందో యేమో?! కాలం కదలక మొరాయిస్తుంది దూరం సాగి సాగి చాలా , దూరమైపోతోంది గమ్యం మాయలా మృగ తృష్ణ లా మిణుక్కుమంటూ మెరుస్తుంది అప్పుడే కనుమరుగై మాయమైపోతుంది అనుభవానికొస్తే గాని సాపేక్ష తత్వం బోధపడలే కాలం జల్లెడ పడితే రాలి పడిన రేణువులా నేనొక్కడినే నిశ్చలంగా వున్నట్టూ, అందరి పయనం నిరాటంకంగా సాగిపోతున్నట్టు యెందుకిలాగౌతుందో యేమో కానీ, యెన్ని సార్లైనా అంతే!! బొక్కబోర్లా పడ్డప్పుడల్లా యేదో అనుభవమౌతూనే వుంటుంది యేదో తత్వం అవగతమౌతూనే వుంటుంది కొత్త పాఠం ఆచరణలో పెట్టేలోగా, తరుముకొచ్చే క్షణాలు కొన్ని మళ్ళీ నన్ను మింగేస్తాయి??? మళ్ళీ నేనోక్కణ్ణే నిశ్చలంగా................. ప్రపంచమంతా వేగంగా............... నా చుట్టూ నేనే పరిభ్రమిస్తున్నానేమో కాలమా చెప్పమ్మా!!! నేనొక వివిక్త వ్యవస్తనా? లేదా నేనొకానొక అవ్యక్తావస్తనా? కనికరముంటే కనికట్టు విప్పమ్మా? కర్తవ్యం చెప్పమ్మా!!!!!

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1puJUvo

Posted by Katta

20, జూన్ 2014, శుక్రవారం

Maddali Srinivas కవిత

పరీక్షా సమయం//శ్రీనివాస్//19/6/2014 ------------------------------------------------ పంటి కింద పడ్డ రాయిని కంట్లో పడ్డ నలుసును కాల్లో దిగిన ముల్లును నీ చెవిలో జోరీగను నన్నెట్లా మర్చిపోతావ్? నన్ను నుగ్గు చెయ్యాలని చూసిన పిడికిళ్ళన్నీ నెత్తుటి గాయాల పాలై రోదించింది చూళ్ళే? నన్ను విదిలించి కొడితే మళ్ళీ నీ రెండో కంట్లో దిగబడలే? తీసవతల పారేస్తే తీరిగ్గా కాచుకూర్చోని మళ్ళీ కరవలే? ఒక చెవి నుండి తొసేస్తే మరొక చెవిని దూరలే? నీ పిడికిలికి చిక్కింది మిడతంభొట్లు కాదు నీ పిడికిలిలో యిమడని అగ్ని జ్వాల నిన్నామూలాగ్రం శోధించి సాధించే ప్రళయ హేల యిప్పుడు చెప్పు నన్ను తప్పించుకు తిరుగుతావో నాకెదురుబడి నిజాయితీగా నిలుస్తావో? అగ్ని పునీత సంస్కారం తో పుటం పెట్టిన బంగారినివౌతావొ? మట్టిలో నిన్ను నువ్వు పాతేసుకోని నిన్ను నీవే నిర్మూలించుకుంటావో?

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pl25BO

Posted by Katta

19, జూన్ 2014, గురువారం

Maddali Srinivas కవిత

శాశ్వతానందాన్వేషణ//శ్రీనివాస్//19/6/2014 --------------------------------------------------- భావ జలప్రవాహ గర్భ మీన మస్తిష్కం లో లాభ నష్టాల రాజు స్థిరుడై మేకపోతు నాలుక పై కపట వాగ్గంభీరాఖ్యుడు నాట్యం చేస్తుంటే విక్రమాల కొలువుకు రేడు యెద్దు నొదిలిపెట్టేసి తూకానికెక్కితే,మనసును కమ్మిన ధూమ కేతువాతని కబళిస్తే గృహ మేధి, యిల్లు విడిచి,గురువింట్లో శత్రు రాజు వశమై ,కర్మ బ్రష్టుడైతే రోగాన బడ్డ కర్మాగారపు యజమాని వక్ర గతుల్లో ఆదాయానికి గండి కొడితే అప్పులే ఆదాయాలు ఖర్చులే వైభోగాలు అధోపతనంలో అంతిమ స్తానం చేరుకోవటమే అసలు విజయంలా వెక్కిరిస్తుంటే, తప్పదింక తిరుగుబాటు యిల్లాలే యింటి దీపానికి చమురు కావాలి బిడ్డలు మాణిక్యాలై మెరవాలి తుప్పట్టిన సంసార రధచక్రాన్ని సరి చేసేందుకు అగ్ని రగలాలి ఆవేశం కావాలి గృహ మేధికి బంధనాలు తెగిపోవాలంటే అనుభవాల వుపాధ్యాయుణ్ణి శరణు వేడాలి ఆటంకాల కంటకాలు తొలిగించుకోని బలహీనపు కోణాలను సరి చేసుకోని ధాతువిచ్చే వాడితో నెయ్యం చేయాలి వక్ర మార్గాలకు మరమ్మత్తులు చేసి భవిష్యత్తుకి బంగారు బాట వెయ్యలి వేయి రేకుల కమలాన్ని చుట్టుకున్న కోశాలన్నీ దాటేసెయ్యాలి మూలంలో చుట్టుకున్న సర్పాన్ని నిద్ర లేపాలి ఆ పైదాక దానితోకట్టుకోని నడవాలి గమ్యం చేరాక ,మార్గం తో పనేముంది సంతోషంగా సెలవు తీసుకోవాలి పునరాగమన గమనాల కు స్వస్తి చెప్పి ఆనందంలో తేలి పోవాలి

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lGZYnL

Posted by Katta

18, జూన్ 2014, బుధవారం

Maddali Srinivas కవిత

కధ కంచికి//శ్రీనివాస్//18/6/2014 ---------------------------------------------------------- తిరిగొచ్చిన కధలన్నీ రచ్చబండ మీద వాలిన పావురాలకి గింజలయ్యాయి అచ్చొత్తించుకోని యెగిరొచ్చిన కధలన్నీ సభల్లో విహరించే పెద్ద గద్దలకి పిడికెడు మెతుకులయ్యాయి పాత సారా కొత్త సీసా లోకి గమ్మత్తుగా నిండిపోయింది పెద్ద బేధమేమీ లేదు వోడినా,గెలిచినా, అన్ని కధలూ యెక్కడెక్కడ శాఖా సంక్రమణం చేసినా, చివరికి చేరాల్సింది కంచికే వాల్మీకి రాస్తే గొప్పేముంది? బోయ భీమన్న రాస్తే తక్కువేముంది? అన్ని కధల్లోనూ అంతే మంచే గెలుస్తుంది చెడు చెడిపోతుంది మనిషి బ్రతుకు కధలో అదే జరిగితే వింతేముంది? అందులో కధేముంది? అందుకే నాయనా! తిరిగొచ్చిన నీ కధలను చించెయ్యకు అందులో కొన్ని ఆస్కార్ కొట్టే సినిమాలు కావచ్చు లేదా నోబుల్ కొట్టేసే సాహిత్యం కావచ్చు కనీసం మామూలు మనిషి గుండెల్లో చెమ్మనూరించే కన్నీటి చెలమ కావచ్చు!

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lSzqEV

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Maddali Srinivas కవిత

వజ్రాయుధం//శ్రీనివాస్//08/06/2014 ------------------------------------------------ యెన్నో యేళ్ళు పోరాడి పగులగొట్టిన రాత్రి గోడ నుండి ఉదయిస్తున్న లేత సూరీడిని ఖద్దరేసుకున్న రాహువొకడు కబళిస్తున్నాడు మళ్ళీ ముసురుకుంటున్న చీకటిని చూసి గుండె పగిలిన మూగ జీవులు విగత జీవులై నేలకొరిగారు బేలగా మారిన సూరీడి కంటి నుండి జారిన రక్తాస్రువులు అగ్ని కీలలై నేలంతా కొన్ని దిష్టి బొమ్మల్ని సింబాలిక్ గా తగలబెట్టాయి రాహువు పట్టు వదలక పోతే వజ్రాయుధమై వేటేయటానికి దధీచి వారసుల వెన్నెముకలు నిటారుగా నిలబడ్డాయి

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOuBfk

Posted by Katta

Maddali Srinivas కవిత

వజ్రాయుధం//శ్రీనివాస్//08/06/2014 ------------------------------------------------ యెన్నో యేళ్ళు పోరాడి పగులగొట్టిన రాత్రి గోడ నుండి ఉదయిస్తున్న లేత సూరీడిని ఖద్దరేసుకున్న రాహువొకడు కబళిస్తున్నాడు మళ్ళీ ముసురుకుంటున్న చీకటిని చూసి గుండె పగిలిన మూగ జీవులు విగత జీవులై నేలకొరిగారు బేలగా మారిన సూరీడి కంటి నుండి జారిన రక్తాస్రువులు అగ్ని కీలలై నేలంతా కొన్ని దిష్టి బొమ్మల్ని సింబాలిక్ గా తగలబెట్టాయి రాహువు పట్టు వదలక పోతే వజ్రాయుధమై వేటేయటానికి దధీచి వారసుల వెన్నెముకలు నిటారుగా నిలబడ్డాయి

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kOuyAd

Posted by Katta

2, జూన్ 2014, సోమవారం

Maddali Srinivas కవిత

వందనం! అభివందనం//శ్రీనివాస్//02/06/2014 --------------------------------------------------------------------------------- తల్లిని కన్న బిడ్డలకు వందనం బిడ్డలను గాచుకునే తల్లికి అభివందనం అమ్మా తెలంగాణమా! తమ ప్రాణాలను నీ వూపిరిగా చేసి, తమ తనువులను నీ కునికిగా మార్చి, తమ రక్తం, తమ స్వేదం నీ కర్పించి తమని తాము బలి గావించుకోని నిన్ను కన్న నీ బిడ్డలకు వందనం! అమ్మా తెలంగాణమా! నీ వునికిని చలువ పందిరి చేసి నీ కనుల వెలుగు అందరికీ సమంగా పంచి నీ గుండెలో పుట్టు అమృతాన్ని అందరికీ అందించి నిన్ను కన్న నీ బిడ్డల ఋణం తీర్చుకో

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1rAXHno

Posted by Katta

31, మే 2014, శనివారం

Maddali Srinivas కవిత

ఒకే ఉదయం రెండు చోట్లా!!!//శ్రీనివాస్//31/05/2014 ------------------------------------------------------- వాన కురిసి వెలిసినట్టుంది రహదారుల నిండా పారుతున్న నీళ్ళు వలసపోతున్న కాగితపు పడవలు బాట కిరుపక్కల మేట వేసిన బురద బురదలో చిందులు వేస్తూ కాగితపు పడవలు నీళ్ళల్లో జారవిడుస్తూ హరివిల్లును కంట్లో కట్టేసుకుంటూ లేత యెండ చురుకు నాస్వాదిస్తూ కొత్త కాలపు వెలుగులు మనసును తడిపెయ్యాలని ఉవ్విళ్ళూరుతూ వాడొక్కడే !!! వాడొక్కడే!! వాడొక్కడే!! కాలం పోకడ తెలియని వాడొక్కడే!!! యేదొచ్చినా,యేది పోయినా నవ్వేసే వాడొక్కడే యేడవటం రాని వాడొక్కడే చిరుగు పాతల నొదిలేసి చిరునవ్వులను తొడిగేసుకుంటూ చిరకాలపు సంకెళ్ళను వదిలించుకున్న ఆనందాన్ని తనివి తీరా అనుభవించేస్తాడు ఆ చిన్నోడే ముసిరిన చీకట్లను విడిపించుకోని ఒకే ఉదయాన్ని రెండు చోట్లా చూస్తాడు

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tZbHFf

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Maddali Srinivas కవిత

దీర్ఘాక్షరములు వాడకుండా శివుని పై స్తుతి: (పతంజలి కి నమస్సులు,కృతజ్ఞతలు) యీ నాల్గు పాదాలు పతంజలి వ్రాసిన నట రాజ స్తోత్రం నడతలో నడపాలని చేసిన చిన్న ప్రయత్నం) ప్రేరణ కలిగించిన శ్రి జె.కె.మోహన్ రావు గారికి ధన్యవాదములు. ----------------------------------------------------------------------------------------------------------- అనన్యమతి సుందర మకుంఠిత తపధృతి నిమగ్న మఖ హంతక శివం అనంగ మద మర్ధన మచింత్య మహ దద్భుత మహత్వ శివ తత్వమలఘుం అనంత శయన ప్రియ మనంత పద నర్తన విచిత్ర కుశలం భవ హరం అనింద్యమతి సత్వ శుభ సుందరమ మంగళ హరం శుభ కరం శివ కరం

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PClJwr

Posted by Katta

15, మార్చి 2014, శనివారం

Maddali Srinivas కవిత

పిత్రు దేవో భవ//శ్రీనివాస్//15/03/2014 -------------------------------------------- ప్రాంతానికొక జాతి పిత? వీడిని ప్రాంత పిత అనాల్నేమో? తప్పైతే బాంచెన్ కాల్మొక్త దొరలు మన్నించాలె! ఆదికవి యెవరైతేనేం కానీ ఆడ యీడ నువ్వేలే గొప్ప కధకుడివి వుగ్గు కధలకు పితవు కాకూడదు? వూరికే అన్నాలే యేదో అజ్ఞానం కొద్దీ తప్పైతే............. "చల్ల" యెక్కడుంటుందో "మజ్జిగ ఎక్కడుంటుందో మాబాగా చెప్పినవ్ తీయ్ భాషా శాస్త్రానికి కూడా "పిత" కావాల్నే నువ్వైపోకూడదు? "భాషా శాస్త్ర పిత"! జబర్దస్తుందిలే టైటిల్ యేదో వాగేసాలే ..... తప్పైతే..............

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/Of5BRt

Posted by Katta

14, మార్చి 2014, శుక్రవారం

Maddali Srinivas కవిత

యతొధర్మస్తతో జయహ్!//శ్రీనివాస్//14/03/2014 ------------------------ --------------------------- నన్నొడ్డి తానోడెనో తానోడి నన్నొడ్డెనో? ధర్మ సందేహానికి నాటి కౌరవ సభ మూగవోయింది 371 ముందా? రాష్ట్ర విభజన ముందా? సభ తీర్చని ధర్మ సందేహానికి రాజ్యాంగ ధర్మాసనం బదులిస్తుంది నేడో రేపో స్వార్ధపరులు,తమ లక్ష్యాల కోసం నీచ మార్గాలనుసరిస్తే ప్రశ్నించే గొంతులు మూగబోవచ్చు కానీ ,ధర్మం తన ధర్మం తప్పదెన్నడూ నాటి ధర్మక్షేత్రం రణక్షేత్రమై కడకు శ్మశానమైనా ధర్మమే నెగ్గింది నేడు అదే పునరావృతమవుతుంది ఫైనల్సింకా మిగిలే వుంది ముసళ్ల పండక్కి తొందరేముంది? పరుగులో గెలిచిన షైనీ అబ్రహాం గీత దాటి అనర్హురాలు కాలేదా? లక్ష్మణ రేఖను దాటి మొద్దుల సభ చేసిన చట్టం కాదెన్నడు న్యాయ స్తానానికి చుట్టం ధర్మ స్తానంలో తప్పదు మీకు పరాజయం! యతో ధర్మహ్ తతో జయహ్

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fFszfb

Posted by Katta

13, మార్చి 2014, గురువారం

Maddali Srinivas కవిత

సర్వే జనా సుఖినో భవంతు//శ్రీనివాస్//13/03/2014 ------------------------------------------------------- గిరి గీసుకూర్చున్న గిరీశానికి కధ అడ్డం తిరుగుంది ముందు ప్రాంతాలను పిదప కులాలను వేరుచేసి బీసీ లను దళితులను కాపులను రెడ్లను ధృతరాష్ట్ర కౌగిలి లో బంధిద్దామని చూసే గాంధీల పార్టీకి కధ అడ్డం తిరుగుతుంది పిల్లి గడ్డం మాయల ఫకీరుకు విజన్ మంత్రదండం మాయమౌతుంది మళ్ళీ మళ్ళీ చెప్పే పాత కధ రోత పుడుతుంది కధ అడ్డం తిరగడమే కాదు కంచికి కూడా చేరుతుంది నమో మంత్రం బెడిసి కొట్టి నా అన్న వాళ్ళు కరువై కమలం ముడుచుకుంటుంది చెద పట్టిన కధలే మేలని పాత కధలని పల్లకీ నెక్కించి నమో మంత్రం ఉట్టికెక్కించడం కధ మళ్ళీ మొదలవ్వటం కనపడుతోంది కొత్త శిశువు వూపిరి పోసుకోవటనికి సమయం వచ్చింది విరిగి ముక్కలయిన మతాలు,కులాలు,ప్రాంతాలు మనుషులుగా మరలొచ్చి నాటు మంత్రసానులకు వాటంగా వాతపెట్టే సమయం మళ్ళా వొచ్చింది తెగి పడ్డ శకలాలన్నీ మానవాతా దారానికి లొంగిపోయి నానా రంగుల కలబోతగా వొకే వస్త్రంగా పల్లవిస్తుంది నిరంకుశ నియంతల పాలిటి పాశుపతమై ప్రళయంలో ముంచేస్తుంది కొత్త సమాజ సృష్టికి బీజాలను నాటుతుంది మనిషి కధలిక పురుడు పోసుకుంటాయి మంచి కధలెన్నో పుట్టుకొస్తాయి సర్వే జనా సుఖినో భవంతు

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nQvsLZ

Posted by Katta

4, మార్చి 2014, మంగళవారం

Maddali Srinivas కవిత

పునర్నిర్మాణం?!?!//శ్రీనివాస్//04/03/2014 ----------------------------------------------- కుట్టుకుంటూ కూర్చున్నావా చిరిగిన బొంతని తీరిగ్గా పేర్చుకుంటూ చీలకలూ పేలికలూ సూదేమో దిగదాయే దారపు చిక్కులు విడవాయె చీకటి తో నీ దోస్తీ తెగదాయే నడి రేయికి నవ్వులేదు జడివానకు మెరుపు లేదు తగదంటే వినకుండా వర్షించే కన్నుల్లో తడి బారిన గుండెల్లో వెన్నెలని వెదుక్కుంటూ వేసారిన మనసుకు విశ్రాంతే కరువాయె బ్రతుకంతా బరువాయె మేటింగ్లో ఫైటింగే పార్టింగ్లో ఫైటింగే మీటింగ్ పాయింటే లేని మనసులకు పీసంటే పీస్ పీసే పుట్టుంటే బాగుండే గిట్టున్నా బాగుండే పుట్టీ పుట్టని పుట్టుక పుట్టాకీ వగపేలో నూతుల్లో నీరు రాక జనవాసాలల్లో వద్దంటే పారాకా తెలిసి తెలిసీ చేసిన తప్పుల వుచ్చులు మెడ చుట్టూ బిగిసాకా నటనేలో వగపేలో వగపుల నటనేలో నటనల్లో వగపేలో వుచితంగా వెలిగే దివిటీలకు చమురు లేక నీరందిచ్చే శక్తి లేక అరువిచ్చే బుగత లేక పండని బీడులు వేసే ప్రశ్నలకి జవాబీయలేక మండే గుండెలకింత వుపశమనం కరువయ్యాక నువ్వు నాటిన గులాబి మొక్క వాడాకా నువ్వు వోడాకా వగపేలో, నటనేలో పేర్చుకున్న చితిలోనే మోక్షం పొందేసేయ్ పోసుకున్న పెగ్గులో కీర్తి నిషా తలకెక్కి జీవన్ముక్తికి సోపానం వేస్తుందిలే అరువు సోకుల ధగధగలన్నీ వెలిసిపోతే కాల గర్భంలో కలిసిపోతే నువ్వొక్కడివే కీర్తి నిషాలో తీరిగ్గా మునిగిపో మురికి పాలైన మమ్మల్ని యిట్లానే వదిలేసిపో

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1djCmGq

Posted by Katta

3, మార్చి 2014, సోమవారం

Maddali Srinivas కవిత

సందేశ గీతిక 1. //శ్రీనివాస్// 03/03/2014 ----------------------------------------------------------- మరణం లేదిక ,రాదురా మరల, యీ మాయా ప్రపంచమ్ములో తరుణమ్మయెను లేచిరా పవలు రాత్రాయెన్, పెనుత్పాతముల్ ధరణిన్ దర్శనమయ్యెరా, మరల మేధావుల్ కుతంత్రాల తో నరులన్ దొక్కెడి కాంక్ష తో కదిలె రా! నాయమ్ము చేయంగ రా! నిజమేదో తెలియంగ లేదు వెదికితే నీరందు లేదయ్యరో గజమే మిధ్యట గా! పలాయనము తాగాదేమి మిధ్యా మరీ రుజువుల్లేనపు డెన్ని మాటలను తా రువ్వంగ నేమింక తా నె జనాధ్యక్షుడు తానెపో మనిషి తానే మంత్రి తానే ప్రజా కొలువుల్ దక్కని నాడు నీ మనసు లో కొల్వైన దెయ్యాన్ని, నీ వెలుగున్ కమ్మిన చీకటిన్, తరుమ నీవే సిద్దమవ్వాలి రా! తళుకుల్ నిండిన మాటలందు నిను సాంతమ్ముంచి తా నెగ్గినా నిలువెల్లా విషమైన వాడి తను వున్నిప్పందు కాల్చంగ రా !

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eLHp3i

Posted by Katta

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

Maddali Srinivas కవిత

సోకైన దొరల బండి// శ్రీనివాస్//25/02/2014 --------------------------------------------------------- సై సై జోడెడ్ల బండీ సోకైన దొరలా బండీ వేరుపడే యెద్దు నాది జోడుందామన్న యెద్దు నాది చర్నాకోలా నా "చేతి"లో వుంటే యే యెద్దైనా నా మాటే వింటుంది || సై సై|| వొంటి కొమ్ము విసిరే పోట్ల గిత్తెనైనా రెండు కొమ్ములు విసిరే మకర దున్ననైనా యిట్టే నా దారికి తీసుకొస్తా నేనే రాణీ నని అనిపిస్తా ||సై సై|| తవుడు బాగ తినిపించి నీళ్ళు బాగ తాగించి యెకరాలకు యెకరాలను దున్నిస్తా వోట్ల పంట పండిస్తా నోట్ల పంట పండిస్తా నేనే మహా రాణి లాగ దునియానే యేలేస్తా ||సై సై|| డూ డూ బసవన్న లాగ వూగేటి యెద్దులెన్నొ నా దారికి తీసుకొచ్చి చెవులను మెలిపెట్టేసా యెగస్పార్టి ల పని పట్టేస్తా ||సై సై||

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1esS5PC

Posted by Katta

24, ఫిబ్రవరి 2014, సోమవారం

Maddali Srinivas కవిత

నిరీక్షణ!//శ్రీనివాస్//24/02/2014 ------------------------------------------------------------- మెత్తని కత్తి దూసి నిలువునా చీల్చిన మేను రెండు పక్కలా నెత్తురోడుతున్నది యెనస్థీషియా మత్తులో ఒక సగం జోగుతున్నది మరొక సగం తన గాయాలకు తన నాలుకతోనే మందు రాసుకుంటున్నది అవసాన శ్వాస నుండి కొత్త ప్రాణం పుట్టుకొస్తుంటే నిలువెల్లా రగిలిన గాయాల బాధ మింగి మొండి చేతులతో పగిలిన గుండె దోనె చేసి పురిటి పాపాయిని పొదివి పట్టుకుంటున్నది. మత్తు వీడని రెండో సగానికి యూఫోరియా లోనే బ్రతుకు తెల్లవారిపోకుండా నిజం తెలుసుకోని నిప్పు కణికై భగ్గుమంటే చూడాలని వుంది భస్మం నుండి లేచొచ్చే కొత్త పొద్దు పొడుపై వెలిగిపోతే చూడాలని వుంది అందుకే గాయాలను చూసి గాజు లా మారిన నా కళ్ళను ప్రమిదలు చేసి, శ్రమనే వత్తులు వేసి, నెత్తుటి నూనెను నింపి ఆశా జ్యోతులను వెలిగించి నిరీక్షిస్తూనే వుంటానింక యెన్ని చీకటి యుగాల పర్యంతమైనా!

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hKtyxl

Posted by Katta

22, ఫిబ్రవరి 2014, శనివారం

Maddali Srinivas కవిత

కవులకేం ?!! యెన్నైనా చెబుతారు//శ్రీనివాస్//22/02/2014 ------------------------------------------------------------------------------- కవుల కేం యెన్నైనా చెబుతారు! యేమైనా రాస్తారు! కలలన్నీ వెన్నెల్లో తడిపారబోసి అక్షరాలా అమృతాన్ని వొలకబోస్తారు! కవులకేం యెన్నైనా చెబుతారు కాలం కడలిలో మునిగే మా బోట్లకు భావాల తెరచాపల నాధారంగా చేస్తారు ఆదర్శాల దిక్సూచిని చూపించేస్తారు కవులకేం యెన్నైనా చెబుతారు యెడారుల్లో మల్లెలు పూయిస్తారు మండుటెండల్లో మంచినీళ్ళ వూటలు పుట్టిస్తారు బంజరు భూములన్నిటిని సస్య శ్యామలం చేసేస్తారు చీకటి ఖండాలల్లో వెలుగు పుంతలని పుట్టిస్తారు కవులకేం యన్నైనా చెబుతారు నిజం వేడికి కలలన్నీ కరిగి పోయే వేళ వెక్కిరించే వేదనలకి వేదాంతపు లేపనాలు పూసేస్తారు గాయమైన చోటే గేయాలను పుట్టిస్తారు శిశిరంలో నవ వసంతాన్ని గ్రీష్మంలో హేమంతపు చల్లదనాన్ని శరత్తులో రధ సప్తమి నాటి రవి కిరణాలనీ అక్షారలలో ఆవిష్కరిస్తారు కవులకేం యెన్నైనా చెబుతారు పగిలిన అద్దాన్ని అతికించాలనో విరిగిన మనసులను ఒకటి చేయాలనో అక్షరాల సంజీవని తో అద్భుత చికిత్స చేస్తారు కవులకేం యెన్నైనా చెబుతారు కలలతో కడుపు నింపేస్తారు. నిప్పులు కురిపించే ద్వేషపు బడబాగ్నులు చల్లారాలంటే చల్లని కలల సాయం చక్కని కవితా వ్యవసాయం అవసరమే మరి

by Maddali Srinivas



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1f8lpuz

Posted by Katta