పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

13, మార్చి 2014, గురువారం

బ్రెయిన్ డెడ్ కవిత

నిశీధి | Rest in peace | ఆలోచించలేదు పబ్లిక్ లో బుగ్గ పై చిన్న ముద్దు కే నీ భూగోళం బద్దలవుతుంది అని ఆ ఆలోచనే ఉంటే పవిత్రం గా పరువు కాపాడుకుంటూ రాత్రి నీడలలో మరో మగాడి కౌగిల్లో , కాంక్షతో నలిగే దాన్ని తెలియలేదు నా శ్రాద్ధ ఖర్మలకు మూలం నీ విలువుల హద్దుల ముంగిట్లో నిలబడి ఉందని తెలిస్తే 16 గజాల చీరలో ఇమిడి కోరుకున్న వాడికి కొంగు పరిచే దాన్ని ఏమి చేసాను ? ముద్దే కదా పెట్టాను ? రహస్యపు రతికేళి కాదే ? పరాయి వాడని తెలిసినా పది మంది ముందు ధైర్యం గా ఒక చిన్న ముద్దు అంతేగా ? ఏమి కోరుకున్నాను ? చిన్న అటేన్షన్ ఎదుటి వాళ్ళ కళ్ళలో కొంచం విబ్రమం మరి కొంత ఆశ్చర్యం ఇంతేగా ? నువ్వు రాకుమరుడివి కాకపోయినా నీ తనువు అసూయ వాసనలతో తడిచినా నీ కలల్లో నేను కాని నగ్నత్వం నాట్యం ఆడుతుందని తెలిసినా నా గుండెల్లో నీ నీడ తో పాటు రొమ్ముల పైన నీ అసహ్యాన్ని భరించానే ఒక్క ముద్దే తట్టుకోలేక పోయావా ? లేక తప్పుడు మాటలు విన్నావా ? ఏదయితేనేమి .. ఇపుడు కాలుతున్న నా చర్మం వెనక మాంసపు ముద్ద లో కరగుతున్న ఈ ప్రాణం హాయిగా ఉంది ఇహ నిన్ను నీ మూర్కత్వాలని భరించే అవసరం నాకు లేదు ప్రాపంచిక విలువలనుండి విముక్తి చెందే నా ఆత్మ ఎక్కడ ఎవరిని రమించినా ఆపలేవు, అడ్డుకోలేవు ఎలుగెత్తి చెప్పాలని ఉంది అందరికి మగతనం అంటే కుటుంబం విలువలని ఆడదాని కటి లో దాచటం కాదురా ఆమె మనసు లో విలువ సంపాదించుకోవడంరా అని కాని... నా స్వేచ్చాత్మ గోష మీకు వినబడ్డ మరుక్షణం అమ్మలను ,ఆత్మలను కూడా అమ్ముకొనే మీరు కాటికి కూటికీ కూడా కాకుండా పోతారని క్షమించి వదిలేస్తున్నాను . బ్రతికండి పొండి బ్రతుకుతున్నాం అనుకోని జీవచ్చవాల్లా బ్రతుకుతూ పొండి ఆఖరుగా .. ఐ పిటీ యూ సీత అనుమానం భర్త కి అందమయిన పిల్లలని బహుమతిగా ఇచ్చావు నీ పవిత్రతలకి తర్వాత తరపు ఆడజన్మలను బలి చేసావు . నువ్వే ఎదురించి అగ్నిదేవుడ్నే మోహించి బూడిధై ఉంటే నాలాంటి ఎన్నో హృదయాలను బలి కాకుండా ఆపేదానివి క్షమయా ధరిత్రిని నేను కాని నిన్ను మాత్రం క్షమించలేను . మానసిక వ్యభిచారుల మధ్య శారీరక పవిత్రతలు దాచుకుంటూ బ్రతకటం కన్నా నాకీ మరణమే మహాశాంతంగా ఉంది . నిశీ !! 13-03-14 R.I.p .... Assam woman who kissed Rahul Gandhi burnt to death by husband

by బ్రెయిన్ డెడ్



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gng5sd

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి