పుప్పొడి రేణువులు . . ! ప్రకృతి కాంత జుట్టు విరబోసింది చిమ్మ చీకటి . . ! పురి విప్పింది పూవుల పింఛాలతో వన మయూరం. . ! ఏ కీచురాయి అస్తిత్వ పోరాటమో పొగిలే కేక . . ! పంటపొలాల సరాగాల శ్వాసలు పైరగాలి( సమీరం ) సడి . . ! శ్రావణ మాసం మేఘాల భారం మోస్తూ నిండు గర్భిణి . . ! సాగర హోరు తరింగిణీ తరుణి కలవరింత . . ! వేసవి కాలం మబ్బుకెంత దాహమో నదిని తాగేస్తూ . . . . ! పొద్దు పొడుపు కాంతి బాటలు వేస్తూ నిద్ర లేపుతూ . . ! సందె కెంజాయ కమిలిన చేతులో కందిన బుగ్గలో . . ! కోయిల గానం చిగురించిన మోడు మళ్ళీ ఆశలు . . ! పూల గుండెల్లో పుప్పొడి రేణువులు కేళీ జాడలు . . ! శ్రావణ మాసం మేఘాల భారం మోస్తూ నిండు గర్భిణి . . ! రాలే శిశిరం అలసిన చెట్టుకు ఆటవిడుపు . . ! నీహారికలు మేఘాల సందేశాలు నిశి రాత్రంతా . . . . ! మఱ్ఱి ఊడలు మూడ నమ్మకాలలా పునర్జన్మిస్తూ . . ! చేనేత మగ్గం చిరిగిన బ్రతుక్కి మాసిక నేస్తూ. . . . ! కుమ్మరి చక్రం ఓటుపడ్డ జీవితం కుండల్ని చేస్తూ . . ! బుల్లి తెరపై చిందే చిరునవ్వులు ప్లాస్టిక్ పూలు . . ! అపార్టుమెంటు మబ్బులు కమ్మేసిన ఆకాశ హర్మ్యం . . ! ఏటిగట్టున వలస జీవితాల్లా పిచ్చుక గూళ్ళు . . ! లౌకిక రాజ్యం గొర్రెల కాపరిలా తోడేళ్ళ లోకం . . ! సమైక్య వాదం పిల్లిమెడలో గంట జాగ్రత్త సుమా . . . . ! సగటు పార్టీ తాటిచెట్టు నీడలో పాలు తాగుతూ . . ! నిర్మలారాణి తోట తేది:13.03. 2014
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZ1EOU
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lZ1EOU
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి