టాపిక్ ఈజ్ ఓవర్! లేటైనవు తండ్రీ నువ్వు- ఆగిపోవాల్సిన చోట ఆగిపోకుండ ఉర్కాల్సిన కాడ ఉర్కకుండ పైకి పైకే చూడకుండ ఎనక ముందులు సోచాయించకుండ మాటలెంత మోసమైనయో తెల్సుకోకుండ బాటలెంత బట్టెబాజ్ వో సోయి లేకుండ నమ్మకాన్ని మించింది నాశ్నం చేసేది ఇంకోటి లేదని ఎర్క లేకుండ టైముని బట్టి మనిషి మారాలన్న కమస్కం గ్యానం లేకుండ అవుట్ డేటెడ్ సుభాషితాలు చెప్పుకుంట ఎక్స్ పైర్ అయిన గోళీల్ని ఏసుకుంట సిలబస్ చుట్టే శెక్కర్లు కొట్టుకుంట "ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడ్తుంది" అనే ప్లాస్టిక్ మాటలు నమ్ముకుంట... లేటైనవు తండ్రీ నువ్వు..! ***** అమ్మ అయ్య చెప్పంగ, సోపతిగాడు తిట్టంగ ఇష్టం లేకపొయినా కాష్టం తప్పదనుకుంట శినిగిన బట్టలు, తెగిన చెప్పులు, పెరిగిన గడ్డం, మన్ను మన్ను జుట్టు, దెబ్బల కాట్ల కాళ్ళు చేతులు, ఏడుస్తున్న గుండె, వొగిరిస్తున్న కళ్ళు... ఒక్కటిగూడ పట్టిచ్చుకోకుండ లెక్క తేల్చుకుందామని, జనంల కలుద్దామని వచ్చినవుగానీ - లేటైనవు తండ్రీ నువ్వు! 10.12.2012 ("జీరో డిగ్రీ" నుండి)
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MzlH7t
Posted by Katta
by Mohan Rishi
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MzlH7t
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి