పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, ఫిబ్రవరి 2014, శనివారం

Mohan Ravipati కవిత

మోహన్ ॥ బోధి వృక్షం ॥ ఐదేళ్లకోసారి భోది వృక్షం మొలుస్తుంది నిర్వాచనసదన ప్రాంగణంలో. చిత్రంగా బుద్దావతారాలన్నీ బద్దకం వదిలించుకొని కదనరంగానికి పరుగులెడతాయి హస్తిన విడిచి. వస్తుకానుకలు ఉచిత ప్రసాద వితరణల బాట పడతాయి. మూజువాణిలు, మేజువాణీలు జతకడతాయి. మోజు మాత్రం ఆసనం మీదే. శాసనాలనిండా, కాసుల వర్షాలు కురుస్తాయి చితికిన బతుకలన్నిటికీ అతుకులేస్తామని కోతలు కూస్తుంటాయి ద్రవం, ద్రవ్యం దరిద్రమంతై వీధివీధికి సంచరిస్తుంటాయి బొట్లు, జాకెట్లు, లాకెట్లు, కనికట్టు చేస్తుంటాయి ఓట్లడుగుతుంటాయి, అట్లా అట్లా అధికారం కోసం అఱులు చాస్తుంటాయి తపస్సు అయిపోతుంది బుద్దావతారాలు సమాధిలోకెళ్ళిపోతాయి బోదివృక్షం కూలిపోతుంది ఏలిన వారి దయ కోసం చూస్తూ కూలిన చెట్టుతో పాటు కూలీలా నువ్వు ఖాళీగా మిగిలిపోతావు 06/02/14

by Mohan Ravipati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivdCLI

Posted by Katta

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి