పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Mohan Ravipati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mohan Ravipati లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, మార్చి 2014, శుక్రవారం

Mohan Ravipati కవిత

మోహన్ రావిపాటి || ఎలక్షణాలు || మూడు తరాలనుండి మోస్తూ ఉన్న మ్యానిఫాస్టో కొత్త ప్రింట్ అవుట్ తీసి ముందు పెట్టాము మరో సారి అరచేతిలో చూసుకొని క్షణకాలం స్వర్గంలో తేలి పోండి . మా తాతల కాలంలో ఇచ్చిన హామీలు చార్మినార్ రేకుల సాక్షిగా తీరుస్తామని సరికొత్తగా మరోసారి హామీ ఇస్తున్నాం. మా తాతలు వేసిన మూడు రంగులు వెలిసిపోకుండా మా మూతులకు పూసుకొని తిరుగుతున్నాం , వాసన చూసి ఓటేసి వెళ్లండి . అభివృద్ది అంటాం , అబ్ కీ బార్ అంటాం, వృద్దులను పక్కన పెడతాం మోడలో. . మోడులో తెలియదు కానీ మెడలో వేసుకొని తిరుగుతున్నాం . భారమో.. భార..తీయమో , బరువు మాత్రం మోయమంటున్నాం తలపై మోది, ఆధ్వని రాకుండా, రోదన లేకుండా మిమ్మలనందరిని ,అందలం ఎక్కిస్తామని కర్ణాలలో పంకజాలు పదిలంగా దాస్తున్నాం వాసన చూసి ఒట్లేసి వెళ్లండి 28/03/2014

by Mohan Ravipati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gyLHvV

Posted by Katta

20, ఫిబ్రవరి 2014, గురువారం

Mohan Ravipati కవిత

మోహన్ || సముద్రాన్ని తాగిన తీరం || ఈ రోజు నా సిరల్లో శిరసులు తెగిపడ్డ శరీరాలు స్రవించే రక్తం పరుగులెడుతుంది నా ధమనుల్లో దమనకాండకు గురైన దరిద్ర నారాయణుల రుధిర ధారలు ప్రవహిస్తున్నాయి. రెండిటిని కలిపి భరించే గుండె కావాలి. ఆ మండే గుండెలు చల్లారేందుకు ఘోష లేని సముద్రాలు కావాలి నాకో నిశ్శబ్దం కావాలి, నా గుండెల్లో మ్రోగే లబ్ డబ్ ల డప్పుల గీతం ప్రపంచమంతా ప్రవహించి , ప్రతి గుండె తో జత కూడి మరో సముద్రాన్ని సృష్టించాలి నాకో తీరం కావాలి. సముద్రాన్ని దశదిశలా విస్తరించే తీరం కావాలి ఇసుక రేణువుల్లో తడినింపుకోగల దాహంతో కూడిన తీరం కావాలి. తీరం దాహం తీర్చి సముద్రాలు ఇంకి పోవాలి ఆ దాహంతీరిన తీరంలో నేను సేదతీరాలి 20/02/2014

by Mohan Ravipati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MEwspp

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Mohan Ravipati కవిత

మోహన్ ॥ బోధి వృక్షం ॥ ఐదేళ్లకోసారి భోది వృక్షం మొలుస్తుంది నిర్వాచనసదన ప్రాంగణంలో. చిత్రంగా బుద్దావతారాలన్నీ బద్దకం వదిలించుకొని కదనరంగానికి పరుగులెడతాయి హస్తిన విడిచి. వస్తుకానుకలు ఉచిత ప్రసాద వితరణల బాట పడతాయి. మూజువాణిలు, మేజువాణీలు జతకడతాయి. మోజు మాత్రం ఆసనం మీదే. శాసనాలనిండా, కాసుల వర్షాలు కురుస్తాయి చితికిన బతుకలన్నిటికీ అతుకులేస్తామని కోతలు కూస్తుంటాయి ద్రవం, ద్రవ్యం దరిద్రమంతై వీధివీధికి సంచరిస్తుంటాయి బొట్లు, జాకెట్లు, లాకెట్లు, కనికట్టు చేస్తుంటాయి ఓట్లడుగుతుంటాయి, అట్లా అట్లా అధికారం కోసం అఱులు చాస్తుంటాయి తపస్సు అయిపోతుంది బుద్దావతారాలు సమాధిలోకెళ్ళిపోతాయి బోదివృక్షం కూలిపోతుంది ఏలిన వారి దయ కోసం చూస్తూ కూలిన చెట్టుతో పాటు కూలీలా నువ్వు ఖాళీగా మిగిలిపోతావు 06/02/14

by Mohan Ravipati



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ivdCLI

Posted by Katta